జిల్లాలోని అచ్చంపెటలో దారుణం జరిగింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేసి ఆమె కూతురు గొంతుకోశాడు ఓ తాగుబోతు యువకుడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అచ్చంపేటకు చెందిన రాజ్యలక్ష్మీ అనే మహిళ తన కూతురు శివదుర్గతో కలిసి జీవిస్తోంది. ఇటీవల ఆమె భర్త మరణించారు. దీంతో కూలీ పనిచేస్తూ చిన్నారితో కలిసి ఉంటుంది.