Achampeta
-
ఫెంటాస్టిక్ ఫోర్ పవర్ పోరు
అవి తెలంగాణకు నాలుగు దిక్కుల్లో ఉన్న శాసనసభ నియోజకవర్గాలు. కులాలు, మతాలతోపాటు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో వైరుధ్యం ఉన్న ప్రాంతాలు. కానీ ఎన్నికలొచ్చినప్పుడు మాత్రం ఒక్కటిగానే ఆలోచిస్తున్నాయి. ఒకరికొకరు కూడబలుక్కున్నట్టుగా తీర్పునిస్తున్నాయి. అంతేకాదు 1952 నుంచి 2018 వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక్కసారి మినహాయిస్తే.. మిగిలిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఇక్కడ గెలిస్తే రాష్ట్రంలో అధికారం ఖాయమన్న సెంటిమెంట్‌కు అచ్చంపేట, అందోల్, సికింద్రాబాద్, గజ్వేల్ నియోజకవర్గాలు ప్రాతిపదికగా నిలిచాయి. దీంతో ఈసారి కూడా అందరి చూపు ఈ నాలుగు నియోజకవర్గాలపైనే కేంద్రీ కృతమైంది. ఏడు దశాబ్దాల సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాయా? ఆనవాయితీకే పట్టం కడతాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ‘అచ్చం’ అదే ట్రెండ్... నల్లమల అడవిని ఆనుకుని ఉన్న అచ్చంపేట నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం, దాని అనుబంధ ఆదాయాలపైనే ఆధారపడిన ప్రాంతం. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలు ఉన్న ఈ సెగ్మెంట్లో అక్షరాస్యులు తక్కువే. నాగర్‌కర్నూల్ ద్విసభ నియోజకవర్గం నుంచి వేరుపడి 1962లో అచ్చంపేటగా ఏర్పడిన అనంతరం 2018 వరకు 13 సార్లు ఎన్నిక జరిగితే. 2009లో ఒక్కమారు మినహా, మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టడం గమనార్హం. పి.మహేంద్రనాథ్ 1972లో కాంగ్రెస్, 1983, 85లలో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి ఎన్టీఆర్ కేబినెట్లో కీలక పదవులు నిర్వహించారు. 2009లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి డాక్టర్ వంశీకృష్ణపై 4,831 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒక అభ్యర్థి, ఒక పార్టీ నుంచి రెండుమార్లు కంటే ఎక్కువగా గెలవకపోవడం. సికింద్రాబాద్..గెలిస్తే జిందాబాదే ఆంగ్లో ఇండియన్లకు తోడు తమిళ, మలయాళీలు, పక్కా తెలంగాణ మూలాలున్న అడ్డా కూలీలతో నిండిపోయిన సికింద్రాబాద్ తీర్పు సైతం ఎప్పుడూ ప్రత్యేకమే. 1952 –2018 వరకు 15 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే 14 మార్లు.. ఇక్కడ ఏ పార్టీ కూటమి గెలిస్తే.. అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 1978లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్(ఐ) 175 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టినా.. ఇక్కడ మాత్రం జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎల్.నారాయణ, తన సమీప కాంగ్రెస్(ఐ) అభ్యర్థిపై 8,152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలోనూ 1957, 62, 67 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె.సత్యనారాయణ మినహాయిస్తే, మరెవరూ వరుసగా మూడుమార్లు విజయం సాధించలేదు. అందోల్ తీరూ అంతే.. కన్నడ–తెలంగాణ సమ్మిళిత సంస్కృతి కనిపించే ఈ నియోజకవర్గంలో ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వర్గాలే అత్యధికం. 1952లో ద్విసభ నియోజకవర్గంగా ఏర్పడిన అందోల్‌లో 2018 వరకు జరిగిన 15 ఎన్నికల్లో ఒక్కమారు మినహా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1983లో రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపడితే, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌జీ.. ఈశ్వరీబాయిపై విజయం సాధించారు. ఇక అత్యల్ప మెజార్టీలతో గెలిచిన అదృష్టవంతులు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. ఇక్కడ కూడా వరుసగా 3 సార్లు ఎవరూ గెలవకపోవటం విశేషం. గజ్వేల్.. కమాల్ హైదరాబాద్‌కు సమీపాన్నే ఉన్నా.. పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన గజ్వేల్‌లోనూ 1952 నుంచి 2018 వరకు జరిగిన 15 ఎన్నికల్లో గెలిచిన పార్టీనే 13 మార్లు అధికారంలోకి వచ్చింది. 1952లో జరిగిన తొలి ఎన్నికలో కమ్యూనిస్టుల అభ్యర్థి పెండెం వాసుదేవ్, కాంగ్రెస్ అభ్యర్థి మాడపాటి హన్మంతరావుపై 15 వేలకు పైగా ఓట్లతో విజయం సాధిస్తే, 1962లో కాంగ్రెస్ అభ్యర్థి జి.వెంకటస్వామిపై, స్వతంత్ర అభ్యర్థి గజ్వేల్ సైదయ్య 1,035 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఇక్కడ గెలిచిన పార్టీలే రాష్ట్రంలోనూ అధికార పగ్గాలు చేపట్టాయి. ఈ నియోజకవర్గం నుంచి మూడుమార్లు గెలిచిన అభ్యర్థిగా గజ్వేల్ సైదయ్య పేరిటే ఇప్పటికీ రికార్డు ఉంది. అయితే 2014, 18లలో విజయం సాధించిన కేసీఆర్..మూడోసారి కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగటంతో గజ్వేల్‌పై ఆసక్తి నెలకొంది. ఒకే తీర్పు..ఒకింత విచిత్రమే.. ఈ నాలుగు నియోజకవర్గాల ఓటర్లు ఇస్తున్న తీర్పు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ నాలుగు ప్రాంతాల్లో విభిన్న సామాజిక వర్గాలు ఉన్నాయి. భౌగోళికంగానూ చాలా భిన్నమైన ప్రాంతాలు. పెద్దగా ఆశలు, ఆకాంక్షలు లేని వారు అత్యధికంగా ఉండే నియోజకవర్గాలు. కానీ ఎప్పుడూ ఇక్కడ గెలిచిన పార్టీలే దాదాపుగా ప్రతిసారీ అధికారం చేపట్టడం ఒకింత విచిత్రమే అని చెప్పాలి. – మల్లేపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకుడు -శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి -
Telangana: ముక్కోణపు పోటీ తప్పదా?
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో ఈసారి ముక్కోణపు పోటీ గట్టిగానే కనిపిస్తోంది. అయితే అన్ని పార్టీలు గెలుపు తమదే అంటున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎజెండాగా అధికార బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చనందున ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక బీజేపీ కూడా గెలుపు మీద గట్టి నమ్మకంతో ఉంది. అసలు అధికార పార్టీ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. జిల్లాల విభజన తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలోకి వచ్చిన అచ్చంపేటలో గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన అధికార గులాబీ పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయిన అచ్చంపేటలో రెండు సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్ది డాక్టర్ వంశీకృష్ణ మీదే బాలరాజు గెలిచారు. పదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న గువ్వల బాలరాజు వ్యవహారశైలిపై సొంతపార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు, పార్టీ కార్యకర్తల పట్ల దురుసుగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు తప్ప..ఎమ్మెల్యే ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఏమీ చేయలేదనే విమర్శ ఉంది. నియోజకవర్గ అభివృద్ది కోసం ప్రయత్నమే చేయలేదని అధికార పార్టీ నేతలే అంటున్నారు. చెంచులు నివసించే ఏజేన్సీ ప్రాంతం అధికంగా ఉన్న అమ్రాబాద్ మండలంలో సాగునీటి సమస్య ఇప్పటికీ తీరలేదు. పోడు భూముల వ్యవహారం కూడా ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో అడవిబిడ్డలైన పోడు రైతులు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. బల్మూరు, లింగాల మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీ నేటికి నెరవేరలేదు. ఇటీవలే ఉమామహేశ్వర్ రిజర్వాయర్‌కు శంకుస్దాపన చేశారు. మండల స్థాయి బీఆర్ఎస్ నేతలు కొందరు ఎమ్మెల్యే వైఖరితోనే పార్టీకి దూరమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నా ఆ విషయాన్ని ఆయనకు చెప్పే దైర్యం చేయటం లేదని ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు కారు దిగి హస్తం గూటీకి చేరటం ఎమ్మెల్యేకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే భూ వివాదాల్లో తలదూర్చి ఒకపక్షం వహిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదు. పేదలకు కనీసం ఇళ్ల స్దలాలు కూడా ఇవ్వలేదు. అయితే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చెందటం గువ్వల బాలరాజుకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజుకు, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములుకు మధ్య వర్గపోరు నడుస్తోంది. ఎంపీ రాములు తనయుడు భరత్‌ప్రసాద్ నాగర్‌కర్నూల్ జడ్పీచైర్మన్ గా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. దానికి ఎమ్మెల్యే గువ్వల బాల్రాజే కారణమని ఆరోపిస్తున్న భరత్‌ప్రసాద్ ఆయన మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీ రాములు అచ్చంపేటలో సీఎం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొనకపోవటం నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అధికార బీఆర్ఎస్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. బాలరాజ్ మాత్రం పదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న ఆశతో ఉన్నారు. నియోజకవర్గంలో సాగునీరందించే ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు ఇటీవల శంకుస్దాపన చేయటం, వంద పడకల ఆస్పత్రి ప్రారంభం చేయటం ఎమ్మెల్యేకు కలిసి వచ్చే అంశంగా ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఓడిపోయిన డాక్టర్ వంశీకృష్ణ మరోసారి ఆ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నారు. మొదటి జాబితాలోనే అధిష్టానం ఆయన పేరు ప్రకటించింది. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కూడ అచ్చంపేట నియోజకవర్గంలో ఉండటంతో దీనిపై రేవంత్‌రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సీటు తప్పకుండా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదని మండిపడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలోని వర్గపోరు, అంతర్గత విబేదాలు వంశీకృష్ణకు కలిసి వస్తాయని ఆశపడుతున్నారు. గతంలో పార్టీని వదిలిన నేతలు సైతం తిరిగి సొంతగూటికి వస్తున్న నేపధ్యంలో వంశీకృష్ణ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారేంటీలను ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో వంశీకృష్ణ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణకు మాదిగ సామాజిక వర్గ ఓట్లు మైనస్‌గా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అచ్చంపేటలో జెండా ఎగరేయాలని కాషాయ పార్టీ ఆశపడుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్న బీజేపీ అచ్చంపేటలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన సతీష్ మాదిగ, శ్రీకాంత్ పేర్లు వినిపిస్తున్నాయి. -
బీఆర్ఎస్ నేతల మధ్య వార్.. వారి ఫోన్ సంభాషణ ఇలా
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితిలోని ఇద్దరు ముఖ్య నేతల మధ్య నువ్వా.. నేనా అన్నట్లు వార్ కొనసాగుతోంది. . ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు ఒకే పార్టీలో ఉన్నా.. ఇరువురి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీల లొల్లి మొదలు ఎమ్మెల్యే, ఎంపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరడం.. వారి ఫోన్ సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారి ఫోన్ సంభాషణ ఇలా.. గువ్వల: నియోజకవర్గంలో నీ కొడుకు ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదు. పోతుగంటి: ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటది బాలరాజ్. గువ్వల: పార్టీలో ఉండదట్ల.. పోతుగంటి: అయితే పార్టీలో తేల్చుకుందాం.. గువ్వల: నాకున్న అధికారాన్ని నేను ఉపయోగిస్తా. పోతుగంటి: నేను జిల్లా అధ్యక్షుడిగా పని చేశా. నాకు తెలుసు. నీకిచ్చే గౌరవం నీకిస్తా. నాకిచ్చే గౌరవం నాకుంటది. చేసేది చేసి అంతా అయిపోయింది అంటే ఎట్లా? గువ్వల: అందులో సంబంధం ఉందంటే భవిష్యత్‌లో కూడా చేస్తా. పోతుగంటి: చేసుకోవయ్యా.. నేనొద్దన్నానా ? గువ్వల : వయా గియా అని మాట్లాడకు. మంచిగా మాట్లాడు. సర్ అని పిలుస్తుంటే వయా అంటవ్.. అటెండర్ మాట్లాడినట్లు మాట్లాడతవ్.. పోతుగంటి: వయా అంటే ఏంది అర్థం.. అయ్యా బాలరాజ్ గారు.. మీరు చేసేది చేసుకోండి. దాని గురించి ఎందుకంత కోపం.. గువ్వల: ఇక నుంచి నీ కొడుకు పార్టీ ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదు. ఈ రోజు, రేపు తీసేయండి. రాములు: అంటే.. అంటే.. నీ బెదిరింపులు నాకాడా పనికి రావు. గువ్వల: రికార్డు చేసుకో.. ఎవరికైనా చెప్పుకో.. అట్లే చేస్తే నీ కొడుక్కి పార్టీ పరంగా మర్యాద ఉండదు. పోతుగంటి: నా కొడుకు నాకు సహకారంగా ఉంటడు. ఎవరి కొడుకు వారు సహకారంగా ఉంటడు. మరి నీ కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారు? గువ్వల: మా అభిమానులు కట్టారు. పోతుగంటి: మాకూ అభిమానులే కట్టారు. గువ్వల: ఇలా చేస్తే మంచిగుండదు. పోతుగంటి: నీ బెదిరింపులు నా వద్ద చెల్లవు. ఈ విషయం అధిష్టానం వద్దే చూసుకుందాం. -
సారూ.. ఇదేం తీరు
సాక్షి నాగర్ కర్నూల్/అచ్చంపేట రూరల్: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది తీరు మారడం లేదు. ఎన్నిసార్లు సస్పెండ్లు చేసినా.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నా.. తమ పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా గురువారం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలోని సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్ సెంటర్లోకి ఓ ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకుడు శిశువుల రక్త నమూనాలు తీసుకెళ్లడానికి వచ్చాడు. శిశువుల నుంచి రక్త నమూనాలు తీసుకుని వారి బంధువుల వద్ద ఒక్కొక్కరి దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడు. ఆస్పత్రిలోని ఓ నర్సు టీఎస్‌బీ, సీపీపీ, బీజీఎఫ్ పరీక్షల కోసం ఆస్పత్రి పేరు మీద ఉన్న చీటీలు రాసిచ్చారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలు చేయడానికి వీల్లేదని, ఓ ల్యాబ్ నుంచి వ్యక్తి వచ్చి పరీక్షలు చేస్తారని చెప్పారని బల్మూర్ మండలం చెన్నారం గ్రామానికి చెందిన బాలింత జ్యోతి భర్త సాయిబాబు తెలిపారు. ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకుడు దర్జాగా ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం సేకరించాడు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి ఫార్మాసిస్టు రాజేష్‌కు విషయం చెప్పడంతో వెంటనే ఆయన వచ్చి నిలదీశాడు. ఆస్పత్రి లోపలికి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని రాజేష్ తెలిపారు. కాగా ఓ బాలింతకు చెందిన బంధువులు ఆస్పత్రిలోని ఓ నర్సు చెప్పడంతో తామంతా రక్త పరీక్షలు చేసుకోవడానికి ముందుకొచ్చామని, రూ.500 ఇచ్చామని ఆరోపించారు. ఆస్పత్రిలో అన్ని వసతులు సమకూర్చుతున్నామని, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నామని ఫార్మాసిస్టు చెప్పారు. ఇటీవలి కాలంలోనే ఉన్నతాధికారులు పరీక్షల నిమిత్తం ఓ నూతన యంత్రాన్ని పంపించారని వివరించారు. కాగా బయటి నుంచి ప్రైవేటు ల్యాబ్ వ్యక్తులు ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకెళ్తున్నా పర్యవేక్షణ కరువైందని, శిశువులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. కొందరు నర్సులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, డిమాండ్‌గా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బయటకు పంపడం సరికాదు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల వసతులు సమకూరుతున్నా కొందరు సిబ్బంది తీరు మారడం లేదు. పరీక్షల కోసం రోగులు, బాలింతలు, చిన్నారులను బయటకు పంపడం సరికాదు. ప్రైవేటు వ్యక్తి వచ్చి ఆస్పత్రిలో చిన్నారుల వద్ద రక్త నమూనాలు తీసుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. – మల్లేష్, సీపీఎం నాయకుడు, అచ్చంపేట సొంత క్లినిక్‌లకు రెఫర్ స్థానికులుగా ఉన్న వైద్యులే తరుచుగా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారని, వారే స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తూ ఇక్కడి రోగులపై నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను తమ క్లినిక్‌లకు రెఫర్ చేసుకుంటున్నారని, ఈ మేరకు ఆస్పత్రిలోని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించిన వైద్యులు, సిబ్బందిపై పలుమార్లు చర్యలు తీసుకున్నా.. సస్పెండ్ అయినా కొన్ని రోజులకే మళ్లీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించడంతో వైద్యశాఖ ఉన్నతాధికారుల పనితీరు బహిర్గతమవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆస్పత్రిలో వైద్యుడు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందడం, అంతకు ముందు కరోనా సమయంలో ఓ చెంచు మహిళకు కరోనా ఉందని కాన్పు చేయకపోవడంతో వైద్యులను, సిబ్బందిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణను వివరణ కోరడానికి ప్రయత్నం చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. (చదవండి: పంటలకు ‘కట్’కట!) -
జూపల్లి కృష్ణారావు అడుగులెటు.. ‘కారు’ దిగడం ఖాయమా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సీనియర్ రాజకీయ నాయకుడు.. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఓ వెలుగు వెలిగారు. కానీ ఒక్క ఓటమితో పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం.. ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకోవడం.. తదితర పరిణామాల క్రమంలో స్వపక్షంలోనే విపక్షంగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. జూపల్లి రాజకీయ భవిష్యత్‌పై పలు రకాల ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కమలమా, కాంగ్రెస్సా, స్వతంత్రంగా పోటీలో ఉంటారా.. అనే ప్రశ్నలకు అతడి మౌనమే సమాధానమైంది. కానీ నిత్యం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఈ క్రమంలో కృష్ణారావు క్రియాశీలక అడుగులు వేశారు. నియోజకవర్గాల వారీగా మరో ప్రస్థానం పేరిట ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మౌనం వీడినట్లేనని.. ‘కారు’ దిగడం ఖాయమని తేలినట్లు విశ్లేషిస్తున్నారు. ముందస్తు ఖాయమనే అంచనాకు వచ్చిన ఆయన వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటడమే లక్ష్యంగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. పూడ్చలేనంత పెరిగిన గ్యాప్.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీరం టీఆర్ఎస్లో చేరడంతో సీన్ మారిపోయింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో జూపల్లికి ప్రాధాన్యం దక్కడం లేదని అనుచరులు వాదులాటకు దిగడం నుంచి మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి తన వర్గీయులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలో దింపి సత్తాచాటడం వంటి అంశాలు ఇరువురి మధ్య మనస్పర్థలకు దారితీశాయి. ఆ తర్వాత కేటీఆర్ తన ఇంటికి స్వయంగా రావడంతో కొన్ని నెలలు స్తబ్దుగా ఉన్నా.. అనంతరం అభివృద్ధి తదితర అంశాల్లో జూపల్లి, బీరం మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకోవడంతో ఇరువురి మధ్య దూరం గ్యాప్ పూడ్చలేనంతగాపెరిగింది. ఏకం చేసే దిశగా.. మునుగోడులో బీజేపీ గెలిస్తే కమలం గూటికి వెళ్లాలనే యోచనలో ఉన్న జూపల్లి ఫలితం తారుమారు కావడంతో కొంత సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఫాంహౌస్ ఎపిసోడ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని స్వతంత్రంగా బరిలో దిగితే గెలిచే అవకాశం ఉందనే ఆలోచనలో జూపల్లి, ఆయన వర్గీయులు ఉన్నట్లు సమాచారం. తప్పుడు నిర్ణయం తీసుకుంటే తనతో పాటు తనను నమ్ముకున్న కార్యకర్తలు, అనుచరులకు నష్టం కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్న జూపల్లి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొల్లాపూర్‌తో పాటు తనకు పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనానికి పూనుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లో నమ్మకస్తులైన నేతలతో ఇది వరకే రహస్యంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు అచ్చంపేట నుంచి ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టిన ఆయన పూర్వాశ్రమమైన కాంగ్రెస్‌లోని ముఖ్య అనుచరులు, నాయకులతో పాటు మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానం పలికారు. ప్రధానంగా టీఆర్ఎస్లోని అసంతృప్త నాయకులను ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అచ్చంపేటను అందుకే ఎంచుకున్నరా.. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ త్వరలో అచ్చంపేటలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సభకు, గతంలో వనపర్తిలో జరిగిన సీఎం పర్యటనకు గైర్హాజరైన జూపల్లి.. తొలి ఆత్మీయ సమ్మేళనానికి కేసీఆర్ నోటి వెంట వచ్చిన అచ్చంపేటను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫాంహౌస్ ఘటనలో కొల్లాపూర్‌తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫాంహౌస్ ఘటనను ఫోకస్ చేయాలని భావిస్తున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి జూపల్లి టీఆర్ఎస్ను వీడడం ఖాయంగా కనిపిస్తుండగా.. మాజీ మంత్రి తీరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జూపల్లి ఆత్మీయ సమ్మేళనం.. ఆయన వేస్తున్న అడుగులను టీఆర్ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సిట్టింగ్‌లకే సీటు అనడంతో.. ఇటీవల మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా ఉండడంతో కొల్లాపూర్‌లో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే నెలరోజులుగా కనిపించడంం లేదని పోస్టర్లు వెలియడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఫాంహౌస్ ఎపిసోడ్ తర్వాత నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యే తాను ఏది చేసినా నియోజకవర్గ అభివృద్ధికేనని ప్రకటించారు. స్పందించిన జూపల్లి.. చేసిన అభివృద్ధి ఏందో చూపించాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఫాంహౌస్ కేసులో మన ఎమ్మెల్యేలే దొంగలను పట్టించారని.. సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన బీరం వర్గీయుల్లో ఉత్సాహాన్ని నింపితే.. జూపల్లి వర్గీయులను ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికైనా తుది నిర్ణయం తీసుకోవాలని అనుచరులు జూపల్లిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. (క్లిక్ చేయండి: మహబూబ్‌నగర్‌లో హద్దులు దాటని కేసీఆర్.. ఆ వ్యాఖ్యలకు అర్థమేంటి?) -
శ్రీశైలానికి భారీగా వరద
దోమలపెంట (అచ్చంపేట)/నాగార్జునసాగర్: జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో జూరాల నుంచి స్పిల్ వే ద్వారా 1,73,946 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 26,741, సుంకేసుల నుంచి 1,83,630, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులు మొత్తం 3,84,434 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో పది క్రస్టు గేట్లు ఒక్కొక్కటి 15 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 3,79,630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎడమ గట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,287 క్యూసెక్కులు.. మొత్తం 4,41,701 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885.0 అడుగులు, 215.8070 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వతో ఉంది. సాగర్‌లో 22 గేట్ల ద్వారా నీటి విడుదల శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 3,93,553 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నుంచి అంతే నీటిని విడుదల చేస్తున్నారు. 22 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3,48,472 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 33,040 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.10 అడుగులుంది. -
పల్నాడు రైతుల వినూత్న పంథా.. ‘ఫల’ప్రదం
పల్నాడు ‘ఫల’నాడుగా మారుతోంది. వినూత్న ప్రయోగాలకు వేదికవుతోంది. ఫలప్రదమై ఆనందాలు పంచుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మనవిగాని సరికొత్త పండ్ల తోటల సాగుకు ఇక్కడి కర్షకులు శ్రీకారం చుడుతున్నారు. సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలివిగా ఆలోచించి స్వేదం చిందిస్తే సిరులు కురిపించడం పెద్ద కష్టమేమీ కాదని, కష్టే‘ఫలి’ అని నిరూపిస్తున్నారు. లాభాలు గడిస్తూ అందరిచేత ఔరా అనిపిస్తున్నారు. సాక్షి, నరసరావుపేట: తక్కువ నీటితో అధిక దిగుబడులిచ్చే సరికొత్త ఉద్యానపంటల సాగుకు పల్నాడు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఆధునిక సాంకేతికతను జోడిస్తూ లాభసాటి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో పండ్ల తోటల సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ఖర్జూర బా(ద్)షా సాధారణంగా ఖర్జూర పంటను గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో సాగుచేస్తారు. ఈ మధ్య రాయలసీమలోని అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో పండిస్తున్నారు. పల్నాడు జిల్లాలోనూ దీనిని సాగుచేయవచ్చని కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన బాషా నిరూపించారు. 15 ఎకరాల ఎర్ర ఇసుక నేలలో గుజరాత్‌లోని ఖచ్ కార్పొరేషన్ ల్యాబ్, రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని అతుల్ ల్యాబ్ నుంచి మూడున్నరేళ్ల వయసున్న 750 మొక్కలు తెచ్చి రెండేళ్ల క్రితం నాటారు. ఒక్కో మొక్కను రూ.5 వేలకు కొన్నారు. తొలి కాపు మొదలైంది. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు ఉండటంతో ఇక్కడి వాతావరణం ఖర్జూర సాగుకు అనుకూలమని రైతు బాషా చెబుతున్నారు. పంట కు సబ్సిడీ అందించడానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఉద్యాన రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మెట్టప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మొత్తం 81,750 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతోపాటు రాయితీలు, ఇతర కార్యక్రమాలకు రూ.13 కోట్ల వరకు ఖర్చుచేస్తోంది. యాపిల్ బేర్.. రైతు కు‘భేర్’ థాయ్‌లాండ్‌కి చెందిన యాపిల్ బేర్‌ను ఉత్తరభారత దేశంలో అధికంగా సాగుచేస్తారు. ప్రస్తుతం అచ్చంపేట మండలం గ్రంథిసిరి గ్రామానికి చెందిన రైతు రాంబాబు దీనిని వినూత్నంగా సాగుచేస్తున్నారు. నాలుగెకరాల్లో పంట మొదలుపెట్టారు. ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు యాపిల్ బేర్ పంట చేతికివస్తుంది. ఎకరానికి పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, ఆదాయం సగటున రూ.2 లక్షల వరకు ఉంటుందని రైతు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో యాపిల్ బేర్‌ను కిలో రూ.80 నుంచి రూ.90 వరకు అమ్ముతున్నారు. యాపిల్ బేర్ సాగుకు అవసరమైన మెలుకువలను ఉద్యానవనశాఖ అధికారులు అందజేస్తున్నట్టు రాంబాబు వెల్లడించారు. డ్రాగన్ ‘ఫ్రూట్‌ఫుల్’ ఎన్నో గొప్ప పోషకాలున్న డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం మాచర్ల, పెదకూరపాడు, మాచవరం, యడ్లపాడు, నరసరావుపేట మండలాల్లో ఎక్కువగా సాగవుతోంది. మొత్తం 110 ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అంచనా. పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులూ దీని సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. తక్కువ నీటితో పెరిగే ఈ మొక్కలు నాటిన రెండేళ్లలో దిగుబడి ప్రారంభమవుతుంది. మూడేళ్ల తర్వాత ఎకరానికి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తు్తంది. ఉద్యాన వన శాఖ ఎకరానికి రూ.12 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. బెంగళూరు, హైదరాబాద్‌లాంటి నగరాలతోపాటు స్థానికంగా కూడా ఈ పండ్లకు గిరాకీ బాగా ఉంటోంది. (క్లిక్: తాటి.. పోషకాల్లో మేటి) ఉద్యాన శాఖ సహకారంతో.. నాలుగు ఎకరాల్లో యాపిల్ బేర్ పంట సాగుచేస్తున్నా. మన ప్రాంతంలో ఈ పంట సాగుచేయవచ్చా లేదా అన్న విషయాన్ని అధ్యయనం చేసి ప్రారంభించాను. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. ఉద్యానవన శాఖ నుంచి సాంకేతిక సలహాలు, సూచనలు అందుతున్నాయి. అధిక లాభాలు సాధించే అవకాశం ఉంది. – రాంబాబు, రైతు, గ్రంథసిరి గ్రామం, అచ్చంపేట లాభసాటి పంటలు ఉద్యాన పంటలు లాభసాటిగా ఉంటాయి. కాలానుగుణంగా వస్తున్న కొత్త వంగడాలు, రకాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటేనే సత్ఫలితాలు సాధ్యం. పల్నాడు జిల్లాలో ఖర్జూర, యాపిల్ బేర్, డ్రాగన్ ఫ్రూట్ వంటి కొత్త రకం పంటలకు రైతులు శ్రీకారం చుట్టారు. వీరికి సలహాలు, సూచనలతోపాటు రాయితీలు అందిస్తున్నాం. మార్కెటింగ్ చేసుకోవడం ఎలాగో కూడా చెబుతున్నాం. – బెన్నీ, జిల్లా ఉద్యానశాఖ అధికారి, పల్నాడు -
నాగర్‌కర్నూలు: అచ్చంపేటలో టీఆర్ఎస్ Vs కాంగ్రెస్
-
అచ్చంపేట ఘటనపై గవర్నర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 సోకిందని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గిరిజన గర్భిణి నిమ్మల లాలమ్మను చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించడంతో ఆమె ఆస్పత్రి బయట ప్రసవించిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళతో ఫోన్లో మాట్లాడి రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. ఆమెకు అన్ని రకాల సహాయసహకారాలు అందించాలని సొసైటీని కోరారు. కరోనా సోకిందని ఆస్పత్రుల్లో గర్భిణులను చేర్చుకోకుండా నిరాకరించొద్దన్నారు. ట్వీట్లను ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి, కేంద్ర వైద్యారోగ్య మంత్రుల కార్యాలయాలకు ట్యాగ్ చేసి ఘటనను వారి దృష్టికి తీసుకెళ్లారు. -
జమునా హేచరీస్ కేసు: కొనసాగుతున్న భూసర్వే..
సాక్షి, మెదక్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మెదక్ జిల్లా అచ్చంపేటలో భూసర్వే కొనసాగుతుంది. జమునా హేచరీస్‌కు సంబంధించిన భూములను సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, 130 సర్వే నెంబర్లో 18.20 ఎకరాల అసైన్డ్ భూమి సర్వే జరుగుతుంది. దీనిపై ఇప్పటికే 11 మంది రైతులకు నోటిసులు ఇచ్చినట్లు ఆర్డీవో శ్యామ్ ప్రకాష్ తెలిపారు. -
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం: ఇక నలుదిశలా ‘దళిత బంధు’
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని ఇక రాష్ట్రవ్యాప్తం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని నలుదిశలా దళితబంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేశారు. ఆ నాలుగు మండలాల్లో అన్ని దళిత కుటుంబాలకు హుజూరాబాద్‌తో పాటు అమలుచేయాలని సీఎం ఆదేశించారు. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?) ఎంపికైన ఆ నాలుగు మండలాలు ఇవే.. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం: చింతకాని మండలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం: తిరుమలగిరి మండలం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం: చారగొండ మండలం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: నిజాం సాగర్ మండలం ఈ మండలాల్లోని అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేయనుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
ఘనంగా తీజ్ సంబరాలు
-
తీజ్ సంబరాలు: తీన్మార్ వేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు
అచ్చంపేట: తీజ్ సంబురాలు అచ్చంపేట లో ఆదివారం అంబరాన్నంటాయి. జాగో బంజారా.. బొరావ్ తీజ్ అంటూ.. గిరిజనులు మొలకల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈనెల 21న ప్రారంభించిన తీజ్ వేడుకలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించారు. ఆదివారం ముగింపు వేడుకలు పురస్కరించుకుని సంప్రదాయ వాయిద్యం వాయిస్తూ యువతులు, మహిళలు చేసిన నృత్యాలు చేశారు. ఈ ఉత్సవాల్లో యువతులు తీజ్ బుట్టలను తలపై ఉంచి కుటుంబసభ్యులతో కలిసి బహిరంగ ఊరేగింపులో సంప్రదాయ నృత్యం చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి గిరిజన బంధువులు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉత్సవాల్లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిష్కరించారు. చెరువులో నిమజ్జనం.. గిరిజన భవన్ వద్ద పందిరిపై ఏర్పాటు చేసిన తీజ్ బుట్టలను (మంచెపై) దింపి పీటమీద పెట్టి ఆట,పాటలతో తీజ్ నారును తెంపారు. రేగుచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోధుమనారు(డోనా) చిన్న కర్ర(పీట)లతో యువతీ, యువకులు ఒకరిని ఒకరు ఆటపట్టించారు. మొలకల బుట్టలను తలపై పెట్టుకున్నారు. అమ్మాయిలతో పాటు కుటుంబసభ్యులు, పెద్దమనుషులు అంతాకలిసి ఊరేగింపుగా బయలుదేరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గిరిజన తండాల నుంచి భారీగా గిరిజనులు తరలివచ్చారు. బుట్టలతో ఊరేగింపుగా నడింపల్లి చెరువు వద్దకు వెళ్లారు. చెరువు దగ్గర తమ సంప్రదాయ పద్ధతులతో మొలకల బుట్టలకు పూజలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు. పూజలలో పాల్గొన్న అమ్మాయిలు తీసుకున్న రొట్టెలు, ఆకుకూరల ఆహారాన్నే సంప్రదాయ రీతిలో అందరూ అక్కడ తీసుకున్నారు. అనంతరం తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించిన గిరిజన భవన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ పెద్దమనషులకు యువతులు కాళ్లు కడిగి వారి ఆశీర్వాదం పొందారు. అమ్మాయిలకు కూడా పెద్దమనషులు కాళ్లు కడిగి ఆశీర్వదించారు. ఉత్సవాల్లో ఎంపీ, ఎమ్మెల్యే నృత్యం మొలకల పండుగ ఊరేగింపులో ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, మనోహర్, మార్కెట్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి బాలజీ పాల్గొన్నారు. ఎంపీ రాములు గిరిజనులతో పాటు నృత్యం చేశారు. బంజారా గిరిజనులతో పాటు ఎమ్మెల్యేగువ్వల బాలరాజు సతీసమేతంగా పాల్గొన్నారు. అమల మొలకలను తలపై పెట్టుకుని చూపరులను ఆకర్షించారు. -
Photo Feature: కెమెరాకు చిక్కిన వేటగాళ్లు
సాక్షి, అచ్చంపేట: గత నెల 3, 7 తేదీల్లో పది మంది వేటగాళ్లు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ఉచ్చులు బిగించి.. అందులో చిక్కిన దుప్పి, సాంబార్లను గొడ్డళ్లతో నరికి చంపారు. వాటిని ముక్కలు చేసి తీసుకెళ్లారు. అయితే.. రిజర్వ్ ఫారెస్ట్‌లో బిగించిన కెమెరా ట్రాప్లను నెలకొకసారి అధికారులు పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం కెమెరా ట్రాప్లను పరిశీలిస్తుండగా, అచ్చంపేట గుంపన్‌పల్లికి చెందిన పది మంది వన్యప్రాణుల్ని వేటాడుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. వీరిని అదుపులోకి తీసుకుని ఈనెల 5న అచ్చంపేట కోర్టుకు తరలించగా, సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారని రేంజర్ మనోహర్ తెలిపారు. ఈ చిత్రాలను అటవీ అధికారులు సోమవారం విడుదల చేశారు. చదవండి: కాల్పుల విరమణ దిశగా మావోలు? -
అన్ని చోట్ల గుబాళింపు: టీఆర్ఎస్లో డబుల్ జోష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఫుల్ జోష్‌లో ఉంది. నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో గెలిచిన ఆనందంలో ఉండగానే మినీ మున్సిపల్స్‌లో అద్భుతమైన విజయంతో డబుల్ సంతోషంలో టీఆర్ఎస్ శ్రేణులు మునిగారు. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని గులాబీ పార్టీ సత్తా చాటింది. ఇక వరంగల్, ఖమ్మం కార్పొఒరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకోవడంతో గులాబీ శ్రేణుల్లో డబుల్ జోష్ వచ్చింది. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. నకిరేకల్‌లో 20 వార్డులు ఉండగా వాటిలో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 గెలిచారు. ఆ ఇతరుల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. రేపోమాపో వారు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్ సంఖ్య పెరగనుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ 7 స్థానాలతో సొంతం చేసుకుంది. 12 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 7 గెలవగా కాంగ్రెస్ 5 డివిజన్లలో గెలిచింది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 20 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 13 గెలిచి చైర్మన్ పీఠం సొంతం చేసుకుంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 1 గెలుచుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ భారీగా డివిజన్లు సొంతం చేసుకుంది. మొత్తం 27 డివిజన్లు ఉండగా వాటిలో 23 టీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 2, బీజేపీ 2 డివిజన్లతో సరిపెట్టుకున్నాయి. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీశ్ రావు మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తోంది. 43 స్థానాలు ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఏకంగా 36 సొంతం చేసుకుంది. ఒకటి చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలవగా ఇతరులు 5 డివిజన్లలో గెలిచారు. ఇతరులు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ భావించగా కొద్దిలో ఆ అవకాశం మిస్సయ్యింది. సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సత్తా చాటారు. కార్పొరేషన్ ఫలితాలు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 45 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. చదవండి: థియేటర్లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’ చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
100 ఎకరాలు లాక్కున్నారు: ఈటలపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో తమ అసైన్డ్ భూములను వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు కబ్జా చేశారంటూ.. కొందరు రైతులు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 1994లో బడుగు బలహీన వర్గాలకు సాయం కింద ప్రభుత్వం సర్వే నంబర్లు 130/5, 130/9, 130/10లలో.. చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ, చాకలి కృష్ణ, చాకలి పరశురాం, చాకలి నాగులు అనే వ్యక్తులకు ఒకటిన్నర ఎకరాల చొప్పున అసైన్ చేసిందని లేఖలో వివరించారు. సర్వే నంబర్ 130/2లో ఎరుకల దుర్గయ్య, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు అనే వ్యక్తుల పేరిట మూడెకరాలు అసైన్ చేసినట్టు తెలిపారు. తమకు చెందిన ఈ భూములను మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు సూరి అలియాస్ సుదర్శన్, యంజాల సుధాకర్‌రెడ్డి అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని భయపెట్టారని.. తమతోపాటు వంద మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి అసైన్డ్ సర్టిఫికెట్లను దౌర్జన్యంగా లాక్కున్నారని పేర్కొన్నారు. వంద ఎకరాలు కబ్జా చేశారు: మంత్రి ఈటల, ఆయన అనుచరులు రెండు గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో రైతులు ఆరోపించారు. ఆ భూముల్లో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. వారికి అడ్డుపడుతున్న రైతులను బెదిరిస్తున్నారని, తమ పొలాలకు వెళ్లే దారి మూసేసి ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు. భూములను తమకు అమ్మేయాలని, లేకుంటే శాశ్వతంగా దారిలేకుండా చూస్తామని బెదిరిస్తున్నారని లేఖలో రైతులు పేర్కొన్నారు. మాపై మంత్రి ఈటల ఒత్తిడి చేశారు అచ్చంపేట, హకీంపేట అసైన్డ్ భూములకు సంబంధించి గతంలో మంత్రి తమపై ఒత్తిడి తెచ్చారని మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. అక్కడ ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ఈటలకు సంబంధించినదే అయిఉంటుందన్నారు. గతంలో బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తమకు కేటాయిస్తే పౌల్ట్రీ హేచరీకి ఉపయోగపడుతాయంటూ.. మంత్రి అనుచరులు తన వద్దకు వచ్చారని, గతంలో మెదక్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన నగేశ్ చెప్పారు. ఎంత ఒత్తిడి వచ్చినా.. అసైనీలకు తప్ప వేరొకరికి భూములు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పామన్నారు. భూములపై అసైనీలు తమకు ఫిర్యాదు చేశారని.. పొజిషన్లోకి వెళ్లి, భూములను వినియోగించుకోవాల్సిందిగా సూచించామని తెలిపారు. మా పొలానికి వెళ్లనీయడం లేదు గ్రామశివారులో మా పేరిట మూడెకరాల సీలింగ్ భూమి ఉంది. సాగుకోసం గతంలోనే చదును చేసుకున్నాం. కొన్నేళ్ల కింద ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసిన మంత్రి ఈటల కుటుంబీకులు.. మమ్మల్ని మా భూమిలోకి వెళ్లనీయడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే భూమిని ఎంతో కొంతకు అమ్ముకొని వెళ్లండి. కానీ దారి ఇవ్వం అంటూ బెదిరిస్తున్నారు. – టంటం లక్ష్మి, అచ్చంపేట సర్పంచ్ సొసైటీకి కేటాయించిన భూమిని లాక్కున్నారు గీత కార్మికులు ఈత వనాలు పెంచుకునేందుకు 2003లో ప్రభుత్వం ఐదెకరాలు కేటాయించింది. మాకు కేటాయించిన స్థలాన్ని చదును చేసి మొక్కలు పెట్టేందుకు ప్రయత్నించగా మంత్రి ఈటల వర్గీయులు అడ్డుపడి బలవంతంగా లాక్కున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అధికారులు మరోచోట బండరాళ్లున్న భూమిని చూపెట్టారు. అక్కడ చదును చేయడానికి వెళ్తే మైనింగ్ అధికారులు అడ్డుకున్నారు. – అంజాగౌడ్, గీత కార్మికుడు, అచ్చంపేట మా భూమి నుంచి రోడ్డు వేసుకున్నారు సర్వే నంబర్ 77లో మాకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. మాకు సమాచారం ఇవ్వకుండానే మా భూముల నుంచి అక్రమంగా 50 ఫీట్ల మట్టిరోడ్డు వేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించినా బలవంతంగా పనులు చేపట్టారు. ఇదేమిటని పరిశ్రమ సిబ్బందిని నిలదీస్తే, పట్టించుకోవడం లేదు. – శ్రీను, అచ్చంపేట ఎంక్వైరీ చేస్తాం మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట, ధరిపల్లి గ్రామాలకు చెందిన భూముల వ్యవహారం ఈరోజే తెలిసింది. విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. – హరీశ్, కలెక్టర్, మెదక్ జిల్లా -
తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
-
తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మినీ మున్సి‘పోల్స్’ కు నగారా మోగింది. ఈ నెల 30న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట, సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీలోని లింగోజిగూడ డివిజన్, వివిధ మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన పలు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. శుక్రవారం(నేటి) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై ఆదివారంతో ముగియనుంది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ కొత్తగా ఏర్పడ్డాయి. సిద్దిపేట పాలకమండలి పదవీకాలం గురువారం పూర్తికాగా, అచ్చంపేటలో వివిధ గ్రామపంచాయతీల విలీనం అనంతరం మున్సిపాలిటీగా మారాక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జల్పల్లి, అలంపూర్, గజ్వేల్, నల్లగొండ, బోధన్, బెల్లంపల్లి, మెట్పల్లి, పరకాల మున్సి పాలిటీల్లో ఖాళీలు ఏర్పడటంతో ఒక్కోవార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లన్నీ ఇదివరకే ఎస్ఈసీ పూర్తిచేయడంతో వెంటనే నామినేషన్ల స్వీకరణ, ఇతర ప్రక్రియలను చేపట్టడానికి మున్సిపల్ శాఖ సిద్ధమైంది. రిజర్వేషన్ల ఖరారు... గెజిట్ జారీ ఎన్నికలు జరగనున్న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు గురువారం ఖరారు చేశారు. ఆ వెంటనే రిజర్వేషన్లను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఆయా జిల్లాల్లో రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెకర్లు మహిళారిజర్వేషన్లకు సంబంధించి లాటరీ తీశారు. కొత్తగా ఏర్పాటైన కొత్తూరు, నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి లాటరీలు తీశారు. చైర్పర్సన్ స్థానాలకు నకిరేకల్ బీసీ జనరల్‌కు, జడ్చర్ల బీసీ మహిళకు, కొత్తూరు జనరల్ మహిళకు రిజర్వ్ చేస్తూ మున్సిపల్ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల వివరాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందగానే ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గతేడాది జనవరిలో మున్సిపల్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం... వరంగల్ మేయర్ పదవి జనరల్‌కు, ఖమ్మం మేయర్ పదవి మహిళకు, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ పదవి మహిళకు, అచ్చంపేట మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలి ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా కోవిడ్ ప్రొటోకాల్‌పై కేంద్ర హోంశాఖ వెలువరించిన మార్గదర్శకాలతోపాటు ఇతర నియమ, నిబంధనలను ఎస్ఈసీ విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునే ప్రతివ్యక్తి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, పోలింగ్ స్టేషన్లలో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, క్యూలైన్లలో భౌతికదూరాన్ని కచ్చితంగా పాటించాలని సూచించింది. ఎన్నికల సిబ్బందికి ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరి చేయాలని, ప్రతిస్థాయిలో నోడల్ హెల్త్ ఆఫీసర్లను నియమించి ఎన్నికల సందర్భంగా ఏర్పాట్లు, నియంత్రణచర్యలు పర్యవేక్షించాలని సూచిస్తూ సర్క్యులర్ జారీచేసింది. ఎన్నికల కోడ్.. మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో ఒకవార్డు/డివిజన్‌కు ఎన్నిక జరిగినా మొత్తం మున్సిపాలిటీకి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఒక జిల్లాలో మున్సిపాలిటీ జరుగుతుంటే ఆ మునిసిపాలిటీ వరకు మాత్రమే ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. అభ్యర్థులు తమ నామినేషన్లతోపాటు డిపాజిట్ ఇలా... మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500, ఇతర అభ్యర్థులకు రూ.5,000 మున్సిపాలిటీల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1,250, ఇతర అభ్యర్థులకు రూ.2,500 వ్యయం ఇలా... మున్సిపల్ కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ మినహా) డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థులకు రూ.1,50,000 ఎన్నికల వ్యయ పరిమితి ఉంటుంది. జీహెచ్ఎంసీలోని డివిజన్‌కు పోటీచేసే వారికి రూ.5,00,000 ఎన్నికల ఖర్చు పరిమితి విధించారు. మున్సిపాలిటీల పరిధిలోని వార్డులకు పోటీ చేసే అభ్యర్థులకు రూ.1,00,000 ఎన్నికల ఖర్చు పరిమితి ఉంటుంది. నామినేషన్లతోపాటు అభ్యర్థులు తమ నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, తదితరాలను ఇద్దరు సాక్షుల అటెస్టేషన్తో నిర్ణీత ఫార్మాట్లో సమర్పించాలి. ఇదీ షెడ్యూల్... ఏప్రిల్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ తుది ఓటర్ల జాబితా వార్డులవారీగా 16న ప్రచురణ 19న నామినేషన్ల పరిశీలన నామినేషన్ల తిరస్కరణపై 20న అప్పీళ్ల స్వీకరణ 21న అప్పీళ్లపై నిర్ణయం 22న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ 30న పోలింగ్ మే 2న రీపోలింగ్ 3న ఓట్ల లెక్కింపు.. ముగిసిన వెంటనే ఫలితాల ప్రకటన -
విద్యుదుత్పత్తి పునరుద్ధరణకు రూ.కోటి
సాక్షి, దోమలపెంట (అచ్చంపేట): టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజలను విద్యుత్తు కేంద్రంలో 1, 2వ యూనిట్ల పునరుద్ధరణకు రూ.కోటిలోపే ఖర్చయిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వరెడ్డి చెప్పారు. సోమవారం ఈ రెండు యూనిట్లను మంత్రి పునఃప్రారంభించారు. ఆగస్టు 20న షార్ట్ సర్క్యూట్ వల్ల భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగి 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. యూనిట్ల పునరుద్ధరించిన అనంతరం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. అగ్ని ప్రమాదంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, దీంతో సుమారు 100 కోట్ల రూపాయల నష్టం ఏర్పడిందన్నారు. 15 నుంచి 20 రోజుల్లోనే విద్యుదుత్పత్తి చేపట్టాలనుకున్నా.. జెన్కో అధికారులకు కరోనా సోకడంతో ఆలస్యమైందన్నారు. మరో నాలుగు నెలల్లోనే 3, 5, 6వ యూనిట్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. 4వ యూనిట్ పునరుద్ధరణకు మరికొంత సమయం పడుతోందని, ఇందులోనే ఎక్కువ నష్టం జరిగిందని పేర్కొన్నారు. అంతకుముందు ఈగలపెంటలో జెన్కో అతిథిగృహం కృష్ణవేణి వద్ద మంత్రికి జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పూల మొక్కను ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో సందీప్ సుల్తానియా, జెన్కో హైడెల్ డైరెక్టర్ వెంకటరాజం, భూగర్భ కేంద్రం సీఈ ప్రభాకర్‌రావు, ఎస్ఈ సద్గుణరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం రెండు యూనిట్ల ద్వారా 300 మెగావాట్ల ఉత్పత్తిని చేపట్టారు. -
రైతు దంపతులు సురక్షితం
అచ్చంపేట రూరల్: డిండి వాగు ఉధృతితో అవతలి ఒడ్డున 12 గంటల పాటు అలాగే ఉండిపోయిన గిరిజన రైతు దంపతులు సబావత్ బుజ్జి, వెంకట్రాం ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. వీరిని గురువారం తెల్లవారుజామున ప్రాణాలకు తెగించి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు కాపాడారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ సమీపంలోని ఈ వాగుకు అవతలి వైపు ఎత్తు ప్రాంతంలో బిక్కుబిక్కుమంటున్న దంపతులను చిమ్మచీకట్లో వారు సురక్షిత ప్రాంతానికి చేర్చారు. సిద్ధాపూర్‌కు ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు బుధవారం రాత్రి పది గంటలకు జనరేటర్ సాయంతో సిగ్నల్ లైట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు తమ వెంట తెచ్చుకున్న పరికరాలతో పడవను తయారు చేసుకుని వరద నీటిలోకి నలుగురు వెళ్లారు. ఉధృతి ఎక్కువగా ఉండటంతో వెనకకు తిరిగి వచ్చారు. కొద్దిసేపటికి మరోసారి అతి కష్టం మీద అవతలి ఒడ్డుకు చేరుకుని అక్కడే ఉన్న దంపతులకు ధైర్యం చెప్పారు. ఒంటి గంట తర్వాత పడవలో వారిని ఇవతలి ఒడ్డుకు తీసుకొచ్చారు. కాగా, తాము అర్ధరాత్రి వరకు నరకయాతనను అనుభవించామని దంపతులు తెలిపారు. ఆపదలో ఉన్న తమను కాపాడటానికి కృషి చేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. -
అచ్చంపేట ఆస్పత్రిలో దారుణం
అచ్చంపేట రూరల్: వైద్య నిర్లక్ష్యానికి తల్లి కడుపులోని బిడ్డ కడుపులోనే కన్నుమూసింది. మరికొద్ది నిమిషాల్లో భూమ్మీదకు రావాల్సిన గర్భస్థ శిశువు రెండు ముక్కలై ప్రాణాలు విడిచింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ గర్భిణికి వైద్యులు సాధారణ ప్రసవం చేస్తుండగా శిశువు తల భాగం మొండెం నుంచి వేరుపడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన సాయిబాబు భార్య స్వాతి ఈ నెల 18న ఉదయం ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో చేరింది. గర్భిణి రిపోర్టులను పరిశీలించిన అనంతరం అదే రోజు ఉదయం 11 గంటలకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, వైద్యులు సుధారాణి, సిరాజుద్దీన్ ఆమెకు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతుండటం, శిశువు తలభాగం బయటకు కనిపించడంతో బయటకు లాగేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మొండెం నుంచి తల వేరుపడగా మొండెం మాత్రం గర్భిణి కడుపులోనే ఉండిపోయింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన వైద్యులు శిశువు పొట్ట నీరుతో నిండి ఉండటంతో బయటకు రావట్లేదని, మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. అప్పటికే గర్భిణి పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌లోని జజ్జిఖాన ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు. శిశువు తలభాగం లేకపోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తమకు విషయం చెప్పకుండా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ తీసుకెళ్లాకే తెలిసింది.. బాధితురాలి భర్త సాయిబాబు మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిల్లో తన భార్యకు పరీక్షలు చేయించినప్పుడు అందరూ బాగానే ఉందన్నారని చెప్పారు. అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మాత్రం తన భార్యకు సీరియస్‌గా ఉందని చెప్పడంతోనే హైదరాబాద్‌కు తీసుకెళ్లామన్నారు. కానీ అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లు చెబితేనే శిశువుకు తల లేని విషయం తెలిసిందన్నారు. తల్లి ప్రాణం కాపాడటానికే రెఫర్ చేశాం.. తల్లి గర్భంలో శిశువు పొట్ట లావుగా ఉందని రిపోర్టులలో చూశాక తెలిసిందని, ఆ విషయం కుటుంబ సభ్యులకు ముందుగానే చెప్పామని వైద్యులు సుధారాణి, తారాసింగ్ చెప్పారు. స్కానింగ్ రిపోర్టులో కూడా శిశువు బరువుగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పామన్నారు. మహిళకు మొదటిసారి అబార్షన్ జరగ్గా ప్రస్తుతం రెండో కాన్పుకు ఆస్పత్రికి వచ్చిందన్నారు. గర్భంలోని శిశువు తలభాగం మెత్తగా ఉండటంతోనే లాగే సమయంలో బయటకు వచ్చిందని చెబుతున్నారు. కాగా, శిశువు తల భాగం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి పరిసరాల్లోనే ఉందని స్థానికులు అంటున్నారు. కలెక్టర్ విచారణ.. ఇద్దరిపై వేటు ఈ సంఘటనపై నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ విచారణ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆస్పత్రిలోనే ఉన్న కలెక్టర్... ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులతో వేర్వేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, డాక్టర్ సుధారాణిని సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎంపీ,ఎమ్మెల్యేను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
-
మొక్కలు తిన్న ఎద్దు.. యజమానికి జరిమానా
సాక్షి, లింగాల (అచ్చంపేట): మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో రోడ్డుకు ఇరువైపుల నాటిన హరితహారం మొక్కలను ఎద్దు తిన్నందుకు దాని యజమానికి జరిమానా విధించినట్లు పంచాయతీకార్యదర్శి పవన్ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇటీవల రోడ్డుకు ఇరువైపుల మొక్కలను నాటగా అదే గ్రామానికి చెందిన ఈడిగ ఏమయ్య అనే రైతుకు చెందిన ఎద్దు సోమవారం మేసింది. యజమాని నిర్లక్ష్యంగా ఎద్దును మొక్కకు కట్టి ఉంచగా అది చుట్టు పక్కల నాటిన మొక్కలను తినేసింది. ఈ విషయాన్ని కార్యదర్శి ఎంపీడీఓ రాఘవులు దృష్టికి తీసుకవెళ్లగా ఆయన ఆదేశాల మేరకు యజమానికి జరిమానా విధించినట్లు కార్యదర్శి తెలిపారు. -
ఆడబిడ్డ పుట్టిందని .. తండ్రి ఆత్మహత్య
సాక్షి, నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆడబిడ్డ పుట్టిందని ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అచ్చంపెట పట్టణ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఆంజనేయులు(24) చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుని భార్య శుక్రవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మనోవేదనతో ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడు. -
గుట్టుగా లింగ నిర్ధారణ!
సాక్షి, అచ్చంపేట రూరల్: మహిళలు పురుషులతో సమానంగా అన్నింటా ముందుంటున్న రోజులివి.. చదువు, ఉద్యోగం, వ్యాపార రంగాల్లోనూ వారిదే అగ్రస్థానం.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు గుట్టుగా సాగిపోతున్నాయి. ఆడ శిశువు భూమి మీద పడగానే కొందరు మొగ్గ దశలోనే తుంచేస్తుండగా.. మరికొందరు కడుపులోనే చిదిమేస్తున్నారు.. ఇలాంటివే అచ్చంపేటలోనూ చోటుచేసుకుంటున్నాయి.. కానీ ఈ విషయం గురించి పట్టించుకొనే నాథుడే కరువయ్యారు.. ఈ క్రమంలో ఆడపిల్లల కోసం ఎన్ని చట్టాలు వస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నీరుగారిపోతున్నాయి.. అనుమతి ఒకరిది.. నిర్వహణ? అచ్చంపేట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. గతంలో కొన్నింటికి అనుమతి ఇవ్వగా రెన్యువల్ చేసుకోకుండా అవే పాత మిషన్లతో స్కానింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టుగా లింగ నిర్ధారణ చేస్తూ డబ్బులను దండుకుంటున్నారు. అనర్హులు సైతం స్కానింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఒకరి పేరు మీద అనుమతి తీసుకుని మరొకరు నిర్వహిస్తున్నారు. ఇదంతా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే స్కానింగ్ సెంటర్లను సక్రమంగా నిర్వహిస్తే ఇలా జరగడానికి వీలుండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తనిఖీల జాడేదీ? జిల్లాస్థాయి అధికారులు మొదట్లో అక్కడక్కడ తనిఖీలు చేసి హల్చల్ చేసి పోతారు. పెద్దగా పేరులేని స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేసి తమ పని అయిపోయిందన్నట్లు ఊరుకుంటున్నారు. అసలు దొంగలను మాత్రం విడిచి పెడుతున్నారు. వారు అప్పుడప్పుడు అమ్యామ్యాలు పంపిస్తారని బహిరంగంగానే చర్చ జరుగుతుంది. ఫిర్యాదులు అందితే తప్ప తనిఖీ చేయరని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులపై రాత పూర్వకంగా ఫిర్యాదు అందించినా పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. చట్టాలు ఏం చెబుతున్నాయి.. సుప్రీంకోర్టు 2001లో పీసీ, పీఎన్డీటీ యాక్టు కింద లింగ నిర్ధారణ నేరమని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. పీసీపీఅండ్డీటీ యాక్టు 1994, రూల్స్ 1996 ప్రకారం ఆస్పత్రుల్లో జిల్లా వైద్యాధికారి అనుమతితో ఆల్ట్రాస్కానింగ్ యంత్రాలను ఉపయోగించాలి. అయినప్పటికీ ప్రైవేటు క్లీనిక్‌లు నిబంధనలు పాటించడం లేదు. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహిస్తూ ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అచ్చంపేటలో రోజురోజుకు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆస్పత్రులు ఇదే తీరును కనబరుస్తున్నాయి. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. స్కానింగ్ సెంటర్ సీజ్ అచ్చంపేటలోని లింగాల రోడ్డుకు సమీపంలో ఉన్న శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలో గత కొన్నేళ్లుగా స్కానింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. 2012లో స్కానింగ్ సెంటర్ నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకోగా 2017 వరకు అనుమతి ఇచ్చారు. 2017లో మళ్లీ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటి అధికారులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఈ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని అధికారుల దృష్టిలో ఉండటంతో తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని గతంలో 2014 అక్టోబర్ 4న శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. అయినప్పటికీ అప్పటి నుంచి మళ్లీ యథేచ్ఛగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. స్కానింగ్‌ను సోనాలజిస్టు, రేడియాలజిస్టు, గైనిక్ మాత్రమే నిర్వహించాల్సి ఉంది. కాగా ఈ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ వైద్యురాలు బుచ్చమ్మ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం జిల్లా వైద్యాధికారులు ఆకస్మికంగా దాడి చేసి స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి అచ్చంపేట రూరల్: నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి దశరథ్ అన్నారు. మంగళవారం అచ్చంపేట సివిల్ కోర్టులో జడ్జి ముందు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అచ్చంపేటలోని శ్రీరాం (సర్రాం) ఆస్పత్రి గురించి లాయర్ ద్వారా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. సెక్షన్–18 ఆర్/23 ఆఫ్ పీసీ అండ్ పీఎన్డీటీ కేసు నమోదు చేశామన్నారు. నల్లమల ప్రాంతంలో అనుమతి లేని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని, లింగ నిర్ధారణ చేస్తే కఠినంగా శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు. చర్యలు తీసుకుంటాం జిల్లాలో అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. అచ్చంపేటలోని శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్‌ను అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని తెలుసుకుని కలెక్టర్ అనుమతితో సీజ్ చేశాం. అలాగే జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటాం. - దశరథ్, జిల్లా వైద్యాధికారి, నాగర్‌కర్నూల్