సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 సోకిందని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గిరిజన గర్భిణి నిమ్మల లాలమ్మను చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించడంతో ఆమె ఆస్పత్రి బయట ప్రసవించిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళతో ఫోన్‌లో మాట్లాడి రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.
ఆమెకు అన్ని రకాల సహాయసహకారాలు అందించాలని సొసైటీని కోరారు. కరోనా సోకిందని ఆస్పత్రుల్లో గర్భిణులను చేర్చుకోకుండా నిరాకరించొద్దన్నారు. ట్వీట్లను ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి, కేంద్ర వైద్యారోగ్య మంత్రుల కార్యాలయాలకు ట్యాగ్ చేసి ఘటనను వారి దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment