కాచిగూడ (హైదరాబాద్): పురిటి నొప్పులు పడుతున్న గర్భిణికి బస్సులోనే డెలివరి చేసి ఆర్టీసీ సిబ్బంది మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నగరానికి చెందిన శ్వేతారత్నం అనే గర్భిణి ఆరాంఘర్‌లో ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సులో (టీఎస్‌వో 2జెడ్ 0341) శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎక్కారు. ఆ బస్సులో డ్రైవర్ ఎం.అలీ, కండక్టర్ బి.సరోజ విధుల్లో ఉన్నారు.
బస్సు బహదూర్‌పురా వద్దకు రాగానే శ్వేతారత్నంకు నొప్పులు రావడంతో బస్సు డ్రైవర్ బస్సును పక్కనే ఆపి ప్రయాణికులను దించాడు. బస్సు కండక్టర్ బి.సరోజ తోటి ప్రయాణికుల సహాయంతో శ్వేతారత్నంకు డెలివరీ చేశారు. శ్వేతారత్నం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని జజ్జిఖానాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అడ్మిట్ చేశారు. మహిళకు పురుడు పోసిన కండక్టర్ సరోజను పలువురు ప్రయాణికులు అభినందించారు.
ముషీరాబాద్ ఇన్‌చార్జి డీఎం రఘు అలీ, సరోజలను అభినందించారు. ఆర్టీసీ హైదరాబాద్ సిటీ రీజినల్ మేనేజర్ వరప్రసాద్, డిప్యూటీ ఆర్‌ఎంఓ జగన్, కాచిగూడ డీఎం, ముషీరాబాద్ డిపో ఇన్‌చార్జి డీఎం రఘు, బర్కత్‌పుర డీఎం వేణుగోపాల్, ముషీరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ కళ్యాణి తదితరులు డ్రైవర్, కండక్టర్‌లను అభినందించి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment