ప్రేమించి పెళ్లి చేసుకొని కాపురానికి తీసుకెళ్లడం లేదని పీఎస్ ఎదుట ధర్నాకు దిగింది ఓ ట్రైనీ ఎస్సై భార్య. ఈ ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు గుంటూరు పీఎస్ ఎదుట బైఠాయించారు. ఆమెను భర్త ఇంట్లోకి రానీవకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.