సాక్షి, గుంటూరు : జిల్లాలోని అచ్చంపెటలో దారుణం జరిగింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేసి ఆమె కూతురు గొంతుకోశాడు ఓ తాగుబోతు యువకుడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అచ్చంపేటకు చెందిన రాజ్యలక్ష్మీ అనే మహిళ తన కూతురు శివదుర్గతో కలిసి జీవిస్తోంది. ఇటీవల ఆమె భర్త మరణించారు. దీంతో కూలీ పనిచేస్తూ చిన్నారితో కలిసి ఉంటుంది. పక్క గ్రామానికి చెందిన వీరయ్యతో రాజ్యలక్ష్మీ సన్నిహిత సంబంధం ఏర్పడింది.తరచూ వీరయ్య ఆమె ఇంటికి వచ్చి వేళ్లేవాడు.
కాగా మంగళవారం వీరయ్య రాజ్యలక్ష్మీ ఇంటికి వచ్చి మద్యం కోసం డబ్బులు అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. అనంతరం చిన్నారి గొంతు కోసి పారిపోయాడు. స్థానికుల సహాయంతో రాజ్యలక్ష్మీ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తులం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు రాజ్యలక్ష్మీ ఇంటికి వచ్చి పరిశీలించారు. వీరయ్యపై కేసు నమోదు చేసుకొని, గాలింపు చర్యలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment