drinker
-
తాగుబోతు టీచర్లు...
-
ఫ్రెండ్లీ పోలీస్...సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
-
ట్రాఫిక్‌లో కారుపైకి ఎక్కి పెగ్గులేసిన మందుబాబు.. వీడియో వైరల్..
ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు ఎరరికైనా చికాకు వస్తుంది. ఒక్కోసారి బండి ముందుకు కదిలేందుకు చాలా సమయం పడుతుంది. హర్యానా గురుగ్రాంలోనూ ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతని కారు భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. దీంతో సమయం వృథా అవుతుంది అనుకున్నాడేమే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మందు బాటిల్ పట్టుకొని కారుపైకి ఎక్కాడు. ఎంచక్కా పెగ్గు కలుపుకొని హాయిగా మద్యం సేవించాడు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by RTG2😃 (@20degreecelsius) ఇలాంటివి గురుగ్రామ్‌లోనే సాధ్యం అని కొందరు సరదాగా కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం ఈ మందుబాబుపై మండిపడ్డారు. రోడ్డుపై ఇలాంటి న్యూసెన్స్ ఏంటని విమర్శించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు.. -
తాగుబోతు భర్తకు గుణపాఠం..చైన్లతో కట్టేసి..
సాక్షి, దొడ్డబళ్లాపురం: తాగుడుకి బానిసై నిత్యం వేధిస్తున్న భర్తతో విసిగిపోయిన భార్య అతడ్ని చైన్లతో కట్టేసిన సంఘటన చిత్రదుర్గలోని హొసహళ్లి గ్రామంలో వెలుగు చూసింది. హిరియూరు తాలూకా పర్తికోట గ్రామానికి చెందిన రంగనాథ్‌కు హొసహళ్లికి చెందిన అమృత అనే యువతితో వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన రంగనాథ్ నిత్యం తాగివచ్చి భార్యను హింసించేవాడు. తాగుడు వల్ల అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో అమృత తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని కాళ్లకు గొలుసు వేసి తాళం వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని అతన్ని బంధ విముక్తున్ని చేశారు. భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా భార్య సాహసాన్ని ఇరుగుపొరుగు అభినందించారు. (చదవండి: ఇడియట్స్ అని తిడుతూ..కాంట్రాక్టర్ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే) -
నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం
మద్యం సేవించే అధికారికంటే రిక్షా తొక్కేవాడిని, కూలీలను పెళ్లిచేసుకోవడం సముచితమని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు తమ కుమార్తెలు, సోదరీమణులకు మద్యపానం చేసేవారితో అస్సలు వివాహం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యపానం డి అడిక్షన్‌పై జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ...తాను ఎంపీగా తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా తమ కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయినప్పుడూ..సామాన్య ప్రజలను ఎలా కాపాడగలనంటూ భావోద్వేగానికి గురయ్యారు. "తన కొడుకు ఆకాష్ తన స్నేహితులతో మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. మానిపించేందుకు డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాం. ఆ అలవాటు మానుకుంటాడని పెళ్లి కూడా చేశాను కానీ అతను పెళ్లైన తర్వాత కూడా తాగడం ప్రారంభించాడు. క్రమంగా అది అతని మరణానికి దారితీసింది. దీంతో అతడి భార్య వితంతువుగా మారింది. పైగా వారికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు." అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. అందువల్ల దయచేసి మీరు మీ కుమార్తెలను, సోదరీమణులను ఇలాంటి వ్యసనపరులకు కట్టబెట్టకుండా రక్షించండి. ఈ తాగుడు వ్యసనం కారణంగా ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎంపీ కూడా 80 శాతం క్యాన్సర్ మరణాలకు కేవలం పొగాకు, సిగరెట్లు, బీడీల వ్యసనమే కారణమని అన్నారు. ఈ డీ అడిక్షన్ కార్యక్రమంలో ప్రజలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావాలని కుటుంబాలను రక్షించుకోవాలని ఆయన కోరారు. అలాగే జిల్లాను వ్యసన రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్‌ను అన్ని పాఠశాలలకు తీసుకువెళ్లాలని, పైగా ఉదయం ప్రార్థన సమయంలో పిల్లలకు దీని గురించి చెప్పాలని కేంద్ర మంత్రి కౌశల్ అధికారులను ఆదేశించారు. (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
మందుబాబును బస్సు నుంచి తోసేసిన కండక్టర్.. వీడియో వైరల్..
చెన్నై: తమిళనాడు ఆర్టీసీ బస్సు కండక్టర్ ఓ మందుబాబుతో విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. ఫుల్లుగా మద్యం తాగి బస్సు ఎక్కిన వ్యక్తిని తిట్టి బస్సు నుంచి కిందకు తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో బస్సు ఎక్కిన వ్యక్తి తూలుతూ కన్పించాడు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు. అతన్ని బస్సు దిగిపోవాలని కండక్టర్ వారించాడు. దీంతో ఆ వ్యక్తి ఆపసోపాలు పడుతూ కిందకు దిగడానికి ప్రయత్నిస్తుండగా.. కండక్టర్ అతనిపై బాటిల్‌తో నీళ్లుపోశాడు. అనంతరం మెట్లపై నుంచి తోసేశాడు. ఫలితంగా అమాంతం అతడు కిందపడిపోయాడు. అయితే అతనికి గాయాలయ్యయా, పరిస్థితి ఎలా ఉందని కూడా చూడకుండా కండక్టర్ బస్సును పోనివ్వమన్నాడు. #government #TamilNadu #TamilnaduNews #bus #conductor pic.twitter.com/rGI9BMv1Rv — MAHES ARUN AMD (@mahes_arun_amd) November 19, 2022 తిరవన్నమళైలో జరిగిన ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే ఆ వ్యక్తి బస్సులోనే మద్యం తాగుతున్నాడని, ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తూ రచ్చ చేయడం వల్లే బస్సు నుంచి దించేసినట్లు కండక్టర్ వివరించాడు. ప్రయాణికులకు అసౌకర్యం కలగవద్దనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. చదవండి: ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత.. -
పట్టాలపై నిలబడి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురెళ్లిన యువకుడు.. చివరికి!
సాక్షి, చెన్నై: మద్యం మత్తులో ఓ యువకుడు రైలు పట్టాలపై నిలబడి రైలును అడ్డగించాడు. ఈ విషయం గుర్తించిన లొకోపైలెట్ రైలును ఆపి వేశాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి చెన్నైకి వస్తున్న లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం యథావిధిగా బెంగుళూరు నుంచి బయలు దేరింది. రైలు ఉదయం 10.45 గంటల సమయంలో తిరుపత్తూరు జిల్లా వాని యంబాడి రైల్యేస్టేషన్‌లో నిలిచేందుకు తక్కువ వేగంతో వస్తుంది. రైలు న్యూటౌన్ రైల్యే గేటు వద్దకు రాగానే సుమారు 35 ఏళ్ల వ్యక్తి రైలు పట్టాలపై నిలబడి ఉన్నాడు. వీటిని గమనించిన రైలు ఇంజిన్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, రైలు ను నిలిపి వేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే రైలు పట్టాలపైకి వెళ్లి, యువకుడిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు యు వకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
లోకం తెలియని చిన్నారులు.. రోజూ నరకమే.. అందుకే వచ్చేశాం..
సాక్షి, అమరావతి బ్యూరో: లోకం తెలియని చిన్నారులు వాళ్లు. తాగుబోతు నాన్న పెట్టే బాధలు భరించలేకపోయారు. రోజూ తాగి వచ్చి అమ్మను, తమను కొట్టడాన్ని తట్టుకోలేకపోయారు. ఇంకా అక్కడ ఉంటే తమకు రోజూ నరకమేనన్న భావనకొచ్చారు. ఎలాగోలా అక్కడ నుంచి బయట పడాలనుకున్నారు. ఏదో రైలెక్కి విజయవాడ వచ్చేశారు. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై దీనంగా ఉన్న వీరిని క్లీనింగ్ సిబ్బంది చూసి చైల్డ్‌లైన్ ప్రతినిధులకు అప్పగించారు. చదవండి: ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో.. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వేంకటేశ్వరస్వామి గుడి ప్రాంతానికి చెందిన వీరు తమ పేర్లు మస్తానీ (9), మౌలాలీ (7) గా చెబుతున్నారు. తండ్రి ఎల్లప్ప కూలింగ్ నీళ్లు అమ్మే పని చేస్తుంటాడని, తల్లి శ్యామల కుర్చీలకు వైర్లు అల్లుతుందని అంటున్నారు. ‘నాన్న ఇంట్లో డబ్బులివ్వడు. ఇవ్వకపోగా రోజూ మందు (మద్యం) తాగడానికి అమ్మను డబ్బుల కోసం సతాయిస్తుంటాడు. ఇవ్వకపోతే కొడతాడు. ఇచ్చాక తాగి వచ్చాక అమ్మను, మమ్మల్ని కొడుతూ ఉంటాడు. అందుకే తమ్ముడు, నేను, ఇల్లు వదిలి నాన్నకు దూరంగా వచ్చేశాం. ఇక మార్కాపురం నాన్న దగ్గరకు వెళ్లం.’ అని మస్తానీ చెబుతోంది. పోలీసులకు సమాచారం ఇచ్చాం ఈ చిన్నారులు గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్లో ఉండగా అక్కడ క్లీనింగ్ సిబ్బంది మాకు అప్పగించారు. వెంటనే మైక్‌లో అనౌన్స్మెంట్ చేయించాం. వారి కోసం ఎవరూ రాలేదు. తదుపరి సంరక్షణ కోసం జీఆర్పీ స్టేషన్లో హాజరు పరిచాం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో బాలుడిని విజయవాడ ఎస్కేసీవీ చి్రల్డన్ ట్రస్టు వసతి గృహంలోను, బాలికను ప్రజ్వల బాలికల వసతి గృహంలోనూ తాత్కాలికంగా ఉంచాం. పిల్లలు చెప్పిన వివరాలతో ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చాం. – కళ్లేపల్లి శ్రీకాంత్, కో–ఆర్డినేటర్, రైల్వే చైల్డ్‌లైన్, విజయవాడ -
తాగిన మత్తులో నోరు జారాడు.. మైకం నుంచి తేరుకునే లోపే..
హోసూరు(బెంగళూరు): హోసూరులో గత రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హతుడు హోసూరు సీతారామ్‌దిన్న కాలేకుంట ప్రాంతానికి చెందిన యారబ్. కొన్ని సంవత్సరాల క్రితం శ్యానసంద్రంకి చెందిన సంతోష్ (20) సోదరి అశ్వినిని అదే ప్రాంతానికి చెందిన అవాస్‌ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నేళ్లకు హత్య చేసి జైలుకెళ్లాడు. గత శుక్రవారం రాత్రి సంతోష్‌తో కలిసి మద్యం తాగుతూ యారబ్ మీ అక్క అశ్వినిని హత్య చేసేందుకు తాను సహకరించానని చెప్పాడు. దీంతో ఆవేశానికి గురైన సంతోష్ యారబ్ మైకం నుంచి తేరుకునే లోపు ఆ పరిసరాల్లోని బండరాతితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. సంతోష్‌ను పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరో ఘటనలో.. సైబర్ మోసగాడు అరెస్టు హోసూరు: ఈ–మెయిల్‌ని హ్యాక్ చేసి ఎలక్ట్రికల్ షాపు యజమానికి రూ. 65 వేలు అబేస్ చేసిన వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరుకు దినేష్‌కుమార్ (38) బస్టాండు వద్ద ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెల 21వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు అతని ఈమెయిల్ ఐడిని హ్యాక్ చేసి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఖాతాలోని 65 వేలను కొట్టేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి బెంగళూరు వద్ద అత్తిపల్లికి చెందిన కాంతరాజ్ (24) అనే యువకున్ని అరెస్ట్ చేశారు. చదవండి: చదువు కోసం మేకలు అమ్మి ఫోన్ కొనిచ్చిన తల్లి! ఆ కొడుకేమో.. -
రోడ్డు ప్రమాదం.. నిందితుడిని అరెస్టు చేయరా?
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): మద్యం మత్తులో అదుపు తప్పిన వేగంతో దూసుకెళ్తూ.. ఇద్దరి యువకుల మరణానికి కారకుడైన నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం పట్ల నగరానికి చెందిన ఓ యువతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదేం తీరు అంటూ పోలీసులకు ట్వీట్ చేసింది. వివరాలివీ... ఉప్పల్‌కు చెందిన బజార్ రోహిత్‌గౌడ్ తన స్నేహితులు వేముల సాయి సోమన్, నాగోలు అలకాపురి కాలనీకి చెందిన బిల్డర్ కోసరాజు వెంకటేష్(28)లు ఈ నెల 6న తెల్లవారుజామున జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మద్యం సేవించి మత్తులో పోర్షే కారులో దూసుకెళ్తూ బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని రెయిన్బో ఆస్పత్రి ఎదురుగా రోడ్డు దాటుతున్న ఆయోధ్యరాయ్, దేవేంద్రకుమార్ దాస్‌లను ఢీకొట్టారు. ఈ ఘటనలో అయోధ్యారాయ్, దాస్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురూ కలిసి కారులో ఘటన స్థలం నుంచి పరారయ్యారు. పోలీసులకు చాకచక్యంగా ఈ కారును గుర్తించి అదే రోజు రోహిత్‌గౌడ్, సాయి సోమన్‌లను అదుపులోకి తీసుకోగా పోలీసులకు కట్టు కథలు చెప్పి వెంకటేష్ పరారయ్యాడు. నాలుగు రోజుల క్రితం మరింత సమాచారం కోసం బంజారాహిల్స్ పోలీసులు రోహిత్‌గౌడ్, సాయి సోమన్‌లను కస్టడీలోకి తీసుకోగా విచారణలో తమతో పాటు కారులో ఘటన జరిగినప్పుడు వెంకటేష్ కూడా ఉన్నాడని తెలిపారు. దీంతో వెంకటేష్‌పై కూడా పోలీసులు ఐపీసీ సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేశారు. ఇంత వరకు వెంకటేష్‌ను అరెస్ట్ చేయకపోవడం లేదేమిటంటూ ఆమె ట్వీట్ చేశారు. సామాన్యులకు ఒక న్యాయం, సంపన్నులకు ఇంకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. వెంకటేష్‌ను అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలేంటంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. -
భార్య డబ్బులు ఇవ్వలేదని... కొడుకుని చితకబాధిన తండ్రి!!
తూప్రాన్: మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని ఆవేశంతో మూడేళ్ల కొడుకును విచక్షణ రహితంగా చితకబాదాడొక తండ్రి. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లాంపూర్‌లో బెడ బుడగ జంగాల కాలనీకి చెందిన గణేశ్, పుష్ప దంపతులకు ఇద్దరు కొడుకులు. దంపతులిద్దరూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. గణేశ్ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ భార్య పుష్పతో నిత్యం గొడవ పడేవాడు. (చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!) ఈ క్రమంలోనే తనకు రూ.5 వేలు కావాలని, ఇందుకోసం ఆమె వెండి పట్టీ గొలుసులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన గణేశ్ భార్యపై రాయితో దాడి చేసేందుకు యత్నించాడు. ఆమె తప్పించుకోవడంతో ఎదురుగా ఉన్న మూడేళ్ల కొడుకు హర్షవర్ధన్‌ను కర్రతో పైశాచికంగా చితకబాదాడు. బాలుడి వీపు, ముఖం, శరీర భాగాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. భార్యను సైతం చంపుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. చుట్టు పక్కల వారితో కలిసి బిడ్డను పట్టణ ప్రభుత్వాస్పత్రికి చికిత్సకు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి ఇంటికి వెళ్తే తిరిగి ఎక్కడ కొడతాడోనని భయంతో పుష్ప మాసాయిపేటలోని పుట్టింటికి ఇద్దరు పిల్లలతో వెళ్లింది. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: ప్రియాంక గాంధీ డ్యాన్స్ వీడియో వైరల్) -
‘అది చూపించక్కర్లేదు.. తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తాది’
భోపాల్: దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఆయా రాష్ట్రాలు ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఓ జిల్లా యంత్రాంగం వ్యాక్సిన్ తీసుకున్న వారికే మద్యం అమ్మాలని నిర్ణయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 230 కి.మీ దూరంలో ఉన్న ఖాండ్వా జిల్లా యంత్రాంగం కొత్త నిబంధనను విధించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు టీకాలు వేసుకున్న వారికే వైన్స్ షాపుల్లో మద్యం విక్రయించనున్నారు. దీనిపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, "ఖచ్చితంగా వాక్సిన్ సర్టిఫికేట్లు చూపించాల్సిన అవసరం లేదు, కేవలం నోటి మాట చెప్తే చాలని, ఎందుకంటే మద్యం తాగే వారు అబద్ధాలు చెప్పరని తెలిపారు. జిల్లాలో ప్రారంభించిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌లో ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో రెండు డోసుల టీకాలు తీసుకోని వారికి మద్యం కూడా అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నారు. "No vaccination proof is required, verbal assurance of being fully vaccinated is enough. Those who drink don’t lie": RP Kirar, Khandwa district excise officer, on recent order restricting the sale of liquor only to those fully vaccinated. pic.twitter.com/Ltzqsy3GUV — NDTV (@ndtv) November 19, 2021 చదవండి: ఇంట్లో మకాం వేసిన కొండచిలువ.. ఇంటి యజమానిని చూసి.. -
కన్న తండ్రిపై అమానుషం.. పీకల దాక మద్యం తాగి.. ఆపై నూనె చల్లి..
సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్): మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతో తండ్రిపై నూనె చల్లి నిప్పంటించాడు ఓ కిరాతకుడు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోటిపల్లి దుర్గారావు (55), భార్య, పెద్ద కొడుకు నాగబాబు (35)తో కలిసి ఇందిరానగర్‌లో అద్దెకు ఉంటున్నారు. దురలవాట్లకు బానిస కావడంతో నాగబాబుకు పెళ్లి కాలేదు. దీంతో నిత్యం మద్యం తాగి తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. దుర్గారావు ఆస్తమాతో బాధపడుతూ ఐదు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. మంగళవారం తల్లి కూలీ పనులకు వెళ్లగా నాగబాబు పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో డబ్బులు ఇవ్వాలని తండ్రితో గొడవపడ్డాడు. దుర్గారావు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో తండ్రిమీద, మంచం, దుప్పట్లు, కిటికీల మీద నూనె చల్లి నిప్పంటించి బయటనుంచి తలుపు గడియ పెట్టి వెళ్లిపోయాడు. గది నుంచి పొగరావడం గమనించిన స్థానికులు తలుపులు పగులగొట్టి దుర్గారావును బయటకు తెచ్చారు. పోలీసులకు సమాచారం అందించడంతో బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తరువాత దుర్గారావు మృతి చెందాడు. నాగబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘రెస్టారెంట్ వల్లే అంత తాగాను’.. 40 కోట్ల నష్టపరిహారం రాబట్టాడు
నిజంగానే ఇదో క్రేజీ కేసు మరి!. అతనో పచ్చి తాగుబోతు. అలవాటు ప్రకారం ఫుల్‌గా మందేసి.. ఆ మత్తులో బయట మరో తాగుబోతుతో కొట్లాడి గాయపడ్డాడు. మత్తు దిగాక కోర్టులో తనకు మందు పోసిన బార్పైనే కేసు వేసి మరీ దాదాపు 40 కోట్ల భారీ నష్టపరిహారం రాబట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టెక్సాస్‌కు చెందిన డానియల్ రాల్స్.. 2019 మే నెలలో ఓరోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుల్‌గా తాగాడు. ఆపై కార్క్ పార్కింగ్ దగ్గర ఓ వ్యక్తితో గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో రాల్స్ తలకు గాయం అయ్యింది. కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక సరాసరి కోర్టులో బార్ మీద కేసు వేశాడు డానియల్ రాల్స్. ఆ రెస్టారెంట్ వల్లే తాను టూమచ్‌గా తాగానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని ఆరోపించాడు. ఆ బార్ పరిసరాల్లో జరిగిందని, వాళ్లు నిర్లక్ష్యంతో తనకు ఫుల్‌గా తాగించారని, ఇలాంటి నేరాలు జరిగే అవకాశ ఉందని తెలిసి మరీ తనకు మందు టూమచ్‌గా సర్వ్ చేశారని, పైగా ఘర్షణ టైంలోనూ బార్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదని, గాయపడ్డాక కనీసం ఆంబులెన్స్‌ను కూడా పిలవలేదని.. లాంటి ఆరోపణలు చేశాడు. బార్ ఓనర్‌తో పాటు తనకు సర్వ్ చేసిన బార్టెండర్ను నిందితులుగా పేర్కొన్నాడు. అయితే రాల్స్ పచ్చి తాగుబోతు. 2019 ఫిబ్రవరిలో పబ్లిక్‌గా తాగి.. న్యూసెన్స్ క్రియేట్ చేసి జైలుకు వెళ్లాడు. ఈ ఏడాది మేలోనూ ఓ వ్యక్తితో గొడవ పడి అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాల్ని బార్ ఓనర్ తరపు న్యాయవాది వాదనలుగా వినిపించినప్పటికీ.. కోర్టు పట్టించుకోలేదు. ఆ తాగుబోతుకు సపోర్ట్‌గా తీర్పు ఇస్తూ.. 5 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం, కోర్టు నోటీసులకు సరిగా స్పందించనందుకు మరో అర మిలియన్ డాలర్లను కలిపి రాల్స్‌కు చెల్లించాలని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఆదేశించింది ఆండ్రూస్ కౌంటీ 109వ న్యాయస్థానం. ఇది చదవండి: కంపించిన నేల.. 1300 మరణాలు -
బీరుసీసాలతో పొడిచి, ఇనుప రాడ్లతో ఘాతుకం
సాక్షి, ఆత్మకూరు(నల్లగొండ): బీరుసీసాలతో పొడిచి, ఇనుప రాడ్లతో మోదీ ఓ వ్యక్తిని హత్య చేసిస ఘటన ∙మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నం లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చిన్నం అర్జున్ (32)కు అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి అశోక్‌రెడ్డి మధ్య కొంత కాలంగా పాతకక్షల నేపథ్యంలో గొడవలు జరుగుతుండేవి. ́పాతకక్షలను దృష్టిలో ఉంచుకుని అశోక్‌రెడ్డి అదును చూసి చిన్నం అర్జున్ రెడ్డిని తన ఇంటి నుంచి మద్యం సేవిద్దామని ఈనెల 14న రాత్రి 8గంటలకు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. మద్యం సేవిస్తుండగా పథకం ప్రకారం... అప్పటికే అక్కడ మాటేసి ఆశోక్‌రెడ్డికి సంబంధించిన వ్యక్తులు పెద్దిరెడ్డి పాడురెడ్డి, సోమేష్‌రెడ్డి, సులోచన, శిరీష, ఉడుత నర్సింహ, చంద్రకళ, నవీన్ చిన్నగూడెం గ్రామానికి చెందిన యాస నరేందర్ రెడ్డి, యాస మహేష్‌రెడ్డి, యాస మల్లారెడ్డి, బండ సురేష్, లగ్గాల రవి ఆదే రోజు రాత్రి అర్జున్ను చిత్రహింసలకు గురి చేసి, బీరు సీసాలతో పొడిచి, ఇనుప రాడ్లతో మోదీదారుణంగా హత్యచేశారు. సమాచారం తెలుసుకున్న రామన్నపేట సీఐ మోతిరాం... ఎస్ఐ జి.మధు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. పాతకక్షల నేపధ్యంలోనే హత్య జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్ఐ జి.మధు తెలిపారు. పోలీసుల విచారణపై అనుమానం ..... ఈ నెల రాత్రి హత్య జరిగిన ట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే అదే రోజురాత్రి పోలీసులకు తెలిసినప్పటికీ గ్రామపెద్దలకు, రెవెన్యూ అధికారులకు తెలియకుండా శవాని పంచనామా చేయకుండా మరునాడు ఉదయం 4గంటలకు పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సమాచారం గ్రామస్తులకు తెలియడంతో ఉదయ హత్యకు బాధ్యులై నవారిపై చర్య తీసుకోవాలని, పోలీసుల వైఖరికి నిరసన గా రాయిగిరి–మోత్కూరు రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో రామన్న పేట సీఐ మోతిరాం, ఎస్ఐ జి.మధు ఘటన స్థలానికి చేరుకుని ఏడుగురు నిందితులను పట్టుకున్నట్లు, విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళ విరమించారు. -
ఫుల్‌గా తాగేసి.. కరెంట్ పోల్ ఎక్కేశాడు!
-
క్వార్టర్ మందు ఇస్తేనే పోల్ దిగుతా!
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్‌లో మందుబాబు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో సంగీత్ డీమార్ట్ సమీపంలోని ఓ వీధి స్తంభం ఎక్కి కిందకు దూకుతానని బెదిరించాడు. అతన్ని ఇలియాజ్‌గా స్థానికులు గుర్తించారు. కిందకు దిగాలని స్థానికులు, పోలీసులు అతనికి సర్దిచెప్పే యత్నం చేసినా వినిపించుకోలేదు. తనకు క్వార్టర్ మద్యం ఇస్తేనే స్తంభం దిగుతానని, లేదంటే పైనుంచి దూకుతానంటూ బేరానికి వచ్చాడు. చివరికి అతని ‘డిమాండ్’ మేరకు మద్యం సీసా తీసుకొచ్చి చూపించడంతో పోల్ దిగేందుకు అంగీకరించాడు. స్ట్రీట్ లైట్స్ బిగించేందుకు ఉపయోగించే క్రేన్ సాయంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అతన్ని కిందకు దించారు. -
మందుబాబులకు మెట్రో గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : మందుబాబులకు హైదరాబాద్ మెట్రో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని మద్యం సేవించి ఇళ్లకు వెళ్లేవారికి మెట్రో తీపి కబురు చెప్పింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. రాత్రి ఒంటి గంటవరకు మెట్రో సేవలు పొడిగిస్తున్నట్టు తెలిపారు. అలాగే మద్యం సేవించిన వారికి మెట్రోలో అనుమతిస్తామని చెప్పారు. అయితే మందుబాబులు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని మెట్రో అధికారులు సూచించారు. పలువురు డిసెంబర్ 31న రాత్రి పార్టీల్లో ఫుల్‌గా మద్యం సేవించి.. ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరుగుతుండటంతో మెట్రో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు.. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎంఎంటీఎస్ రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 1.15 గంటలకు లింగపల్లి నుంచి హైదరాబాద్‌కు, అలాగే అర్ధరాత్రి 1.30 గంటలకు లింగపల్లి నుంచి ఫలక్‌నుమాకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. -
అతడి వాలకం చూసి.. పెళ్లి వద్దన్న వధువు
భువనేశ్వర్: కాబోయే భర్త మద్యానికి బానిసయ్యాడని తెలిసిన ఓ వధువు ఆ పెళ్లిని నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈ వివాహం చేసుకోనని తెగేసి చెప్పడంతో ఆఖరి నిమిషంలో వివాహం రద్దు అయ్యింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఒడిశాలో మంగళవారం జరిగింది. పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా జుజుమురా సమితి గోవర్ధన్ బడమల్ గ్రామంలో మంగళవారం ఓ వివాహం జరుగుతోంది. వరుడు పూటుగా మద్యం తాగి వచ్చాడు. అతను తూలిపోతూ కనీసం తాళి కూడా కట్టలేకపోయాడు. ఇది చూసిన వధువు అతనితో పెళ్లి వద్దని పీటల మీద నుంచి లేచి వచ్చేసింది. దీంతో అబ్బాయి తరఫు వారు వధువుని కాసేపు బతిమలాడారు. కానీ వధువు మాత్రం పెళ్లి సమయంలో ఇలా తాగివచ్చిన వాడితో తాను జీవితాన్ని పంచుకోలేనని స్పష్టం చేసింది. చేసేదేమిలేక చివరి నిమిషంలో పెళ్లిని రద్దు చేశారు. వరుడు, అతడి కుటుంబ సభ్యులు తమకు ఇచ్చిన కట్నకానులను తిరిగిచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాగుబోతును పెళ్లి చేసుకోనని కరాకండీగా చెప్పేసిన వధువును పలువురు అభినందించారు. -
మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని.. దారుణం
-
దారుణం : చిన్నారి గొంతు కోసిన యువకుడు
సాక్షి, గుంటూరు : జిల్లాలోని అచ్చంపెటలో దారుణం జరిగింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేసి ఆమె కూతురు గొంతుకోశాడు ఓ తాగుబోతు యువకుడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అచ్చంపేటకు చెందిన రాజ్యలక్ష్మీ అనే మహిళ తన కూతురు శివదుర్గతో కలిసి జీవిస్తోంది. ఇటీవల ఆమె భర్త మరణించారు. దీంతో కూలీ పనిచేస్తూ చిన్నారితో కలిసి ఉంటుంది. పక్క గ్రామానికి చెందిన వీరయ్యతో రాజ్యలక్ష్మీ సన్నిహిత సంబంధం ఏర్పడింది.తరచూ వీరయ్య ఆమె ఇంటికి వచ్చి వేళ్లేవాడు. కాగా మంగళవారం వీరయ్య రాజ్యలక్ష్మీ ఇంటికి వచ్చి మద్యం కోసం డబ్బులు అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. అనంతరం చిన్నారి గొంతు కోసి పారిపోయాడు. స్థానికుల సహాయంతో రాజ్యలక్ష్మీ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తులం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు రాజ్యలక్ష్మీ ఇంటికి వచ్చి పరిశీలించారు. వీరయ్యపై కేసు నమోదు చేసుకొని, గాలింపు చర్యలు ప్రారంభించారు. -
మద్యం మత్తులో పక్కింటి తలుపు కొట్టి ప్రాణాలు కోల్పోయాడు
మీర్‌పేట: మద్యం మత్తులో పక్కింటి తలుపు కొట్టిన వ్యక్తిని చితక బాదడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనంకు చెందిన మొగిలి గోపాల్ (45) కూలీగా పని చేసేవాడు. ఆదివారం మద్యం సేవించిన అతను తన సోదరిని కలిసేందుకు అమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. సోదరి ప్లాట్ అనుకొని పక్కనే ఉన్న అంజలి అనే మహిళ ప్లాట్‌కు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. దీంతో అంజలి బయటికి రాగా తాను పొరబడినట్లు తెలుసుకున్న గోపాల్ మంచినీళ్లు కావాలని అడిగాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పడంతో అక్కడికి వచ్చిన ఆమె సోదరుడు ఆనంద్ గోపాల్‌పై దాడికి దిగాడు. గోపాల్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆనంద్ వెనుక నుంచి బలంగా తన్నడంతో అతను మొదటి అంతస్తు మెట్లపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన గోపాల్‌ను అతని సోదరి కవిత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చుక్కపడితే కాలు కింద నిలవదట!
తమిళనాడు, సేలం: మందుబాబులకు మద్యంతో పాటు మరికొన్ని అలవాట్లు ఉండడం చూస్తుంటాం. అటువంటి వారిలో కొందరు మద్యం సేవించినప్పుడు డ్యాన్స్ చేయడం, పాటలు పాడుతుంటారు. మరికొందరు ఎవరో ఒకరిపై కయ్యానికి కాలుదువ్వి గొడవలకు దిగుతుంటారు. అయితే సేలంలో సూరమంగళంలోని ఓ మందుబాబు మద్యం సేవించాడంటే కాలు కింద నిలవదట. ఎత్తయిన గోడలు, ట్యాంకర్ లారీలు వంటి వాటిపైకి ఎక్కి కూర్చుంటాడట. అసలు విషయానికి వస్తే.. సేలం సూరమంగళం సమీపంలోని జాగీర్ అమ్మాపాళయం ప్రాంతానికి చెందిన వ్యక్తి జేమ్స్ (60) మంగళవారం ఉదయం 11.30 గంటల మద్యం సేవించాడు. తర్వాత ధర్మానగర్‌లో ఉన్న ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై ఎక్కి కూర్చున్నాడు. అయితే, అదృష్టవశాత్తు అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ కోత కారణంగా కరెంటు లేదు. ఆ సమయంలో అటువైపు వెళుతున్నవారు జేమ్స్‌ను గమనించి వెంటనే విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఫోన్‌చేసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వవద్దని విషయం తెలిపారు. తర్వాత జేమ్స్‌ను తిట్టి కిందకి లాగారు. ఇంతలో సమాచారం అందుకున్న సూరమంగళం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. జేమ్స్‌కు మద్యం సేవించినప్పుడు గోడలు, ట్యాంకర్ లారీలు వంటి ఎత్తయిన వాటిపై ఎక్కి కూర్చునే అలవాటు ఉందని, ఆ విధంగానే మద్యం మత్తు ఎక్కువ కావడంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై ఎక్కినట్టు జేమ్స్ తెలిపాడు. అతడి మాటలు విని పోలీసులు విస్తుపోయారు. అనంతరం జెమ్స్‌ను హెచ్చరించి పంపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
ఈ తాగుబోతు నాన్న నాకొద్దు..
సాక్షి, జమ్మికుంట : తండ్రి మద్యపానానికి బానిసయ్యాడు. కుటుంబాన్ని మర్చిపోయాడు. మందే లోకంగా బ్రతుకుతున్నాడు. రోజంతా తాగి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. తాగటానికి డబ్బులు ఇవ్వాలంటూ నానా రచ్చ చేస్తాడు. లేదంటే ఇళ్లు పీకి పందిరేస్తాడు. వద్దంటూ వారిస్తే అంతే చేతికి అందిన వాటితో దాడికి దిగుతాడు. ఇలాంటి తండ్రి చేతిలో దెబ్బలు తిని తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారి హృదయం తల్లడిల్లింది. తనకు నాన్న వద్దంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్, జమ్మికుంట నగర పంచాయతీలోని మోతుకులగూడెంకు చెందిన శ్రీనివాస్ రోజు తాగొచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. రోజులాగే శుక్రవారం కూడా పీకల దాకా తాగి ఇంటికి వచ్చి కన్న కొడుకు శశికుమార్‌ని చితక బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శశి జమ్మికుంట పోలీసులను ఆశ్రయించాడు. తన తండ్రి రోజు తాగొచ్చి తనను, కుటుంబ సభ్యులను కొడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. రోజు తాగి వచ్చే తండ్రితో ఉండలేనని, తనకు తండ్రి వద్దంటూ పోలీసులకు మొరపెట్టుకున్నాడు. తనకు చదువుకోవాలని ఉందని, కానీ తండ్రి తాగుడు కారణంగా చదువుకోలకపోతున్నాంటూ వాపోయాడు. తనను హాస్టల్లో చేర్పించాలని జమ్మికుంట సీఐని కోరాడు. -
తాగుబోతు రేంజర్.. ఫారెస్టుకే డేంజర్..
అదొక అటవీ కార్యాలయం.. ఆ తాగుబోతుకు నిలయం.. అక్కడొక రేంజర్.. అతడొక డేంజర్.. డ్యూటీకి వచ్చాడు.. బాటిల్ తెరిచాడు.. పీకలదాకా తాగాడు.. పడిపోయేలా తూలాడు.. నోట్లో కుక్కేసాడు.. భళ్లున కక్కేసాడు.. సిగ్గూఎగ్గూ ఒగ్గేసాడు.. మూత్రం వదిలేసాడు.. వద్దంటే వినడు.. ‘పంచాంగం’ విప్పాడు.. ఊరుకోమంటే ఊరుకోడు.. సారొస్తున్నారంటే ఉరికాడు.. కారేపల్లి: కారేపల్లిలలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని అక్కడి రేంజర్.. మద్యం దుకాణంగా మార్చేశాడు. డ్యూటీకని రావడం.. అక్కడే పీకలదాకా మద్యం పుచ్చుకోవడం.. తినడం.. తలకు మద్యం మత్తు ఎక్కాక తాగుబోతులా మారడం.. ఎవరినిపడితే వారిపై అంతెత్తున లేవడం.. బూతుల పంచాంగం వినిపించడం.. తానేం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఎక్కడపడితే అక్కడ మూత్రం విసర్జించడం.. ‘సారూ, ఇదేమి తీరు’ అంటూ సున్నితంగా వారించబోయిన సిబ్బందిపై నోరు జారడం.. తూగుతూ–తూలుతూ పడిపోవడం.. చివరికిలా అలసిసొలసి, సిబ్బంది చేతి సాయంతో జీపెక్కడం.. ఇంటికెళ్లడం..! ⇒ ‘ఇదంతా ఏమిటి?’ అనుకుంటున్నారా..? కారేపల్లిలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో తరచూ జరిగే తంతు. బుధవారం కూడా ఇక్కడ ఇదే దృశ్యం కనిపించింది. ⇒ ఆయన పేరు శ్రీహరి ప్రసాద్. ఫారెస్ట్ రేంజర్. కారేపల్లిలోని అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఈయనకు మద్యం అలవాటు ఉంది. ఇంటి వద్దనో, మరెక్కడో తాగితే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ, ఆయన ఏకంగా తన అధికారిక కార్యాలయాన్నే ‘మద్యం దుకాణం’గా మార్చేశాడు. మందు బాటిళ్లు తెచ్చుకోవడం, తాగడం, తిండి తినడం, తందనాలాడడం (సిబ్బందిపై, చుట్టుపక్కల దుకాణాల నిర్వాహకులపై నోరు జారడం) అలవాటుగా మారింది. ⇒ బుధవారం కూడా ఇలాగే చేశాడు. పీకలదాకా మద్యం పట్టించాడు. మత్తులో తూలుతూ బయటికొచ్చాడు. రేంజ్ కార్యాలయ ఆవరణలోగల ఓ సెక్షన్ ఆఫీసర్‌కు చెందిన ద్విచక్ర వాహనం వద్దకు వెళ్లాడు. అప్పటికే విచక్షణాజ్ఞానం కోల్పోయాడేమో...! సిబ్బంది, చుట్టుపక్కల దుకాణాలవారు, జనం.. ఇలా అందరూ చూస్తుండగానే ఆ వాహనంపై మూత్రం విసర్జించాడు. అక్కడే భళ్లున వాంతులు చేసుకున్నాడు. ఇదంతా చూసిన కొందరు.. ‘ఛీఛీ’ అని చీదరించుకున్నారు. విలేకరులకు సమాచారమిచ్చారు. ⇒ స్థానిక విలేకరులు అక్కడకు చేరుకునేసరికి ఆ ఆఫీసర్ తన కార్యాలయంలోని సీట్లో కూర్చుని ఉన్నాడు. మద్యం మత్తు దిగలేదేమో... కళ్లు మూసి తెరుస్తూ నిద్ర మత్తులో ఉన్నట్టుగా తూగుతున్నాడు. ఆ దృశ్యాన్ని విలేకరులు ఫొటో తీస్తున్నారు. ⇒ ఆ హడావుడితో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. తన ముందున్నది విలేకరులని, ఫొటోలు తీస్తున్నారని గ్రహించాడు. అసలే మద్యం మత్తులో ఉన్నాడు. ఫొటోలు తీస్తుండేసరికి చిర్రెత్తుకొచ్చింది. ఒక్క ఉదుటున లేచేందుకు ప్రయత్నించాడు, పాపం.. లేవలేకపోయాడు. తిట్ల దండకం అందుకున్నాడు. విలేకరులు వెంటనే డీఎఫ్ఓ (డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్)కు ఫోన్ చేసి చెబుతుండగా విన్నట్టున్నాడు. అతి కష్టంగా లేచి, అక్కడి నుంచి ఉడాయించాడు. ⇒ పోతూ పోతూ.. తాను తెచ్చుకున్న మద్యం బాటిల్‌ను తన చాంబర్ బీరువాలో నుంచి తీసుకెళ్లడం మరిచిపోయాడు. ⇒ డీఎఫ్ఓ సునీల్ హెరామత్ ఆదేశాలతో ఎఫ్డీఓ (ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్) సిహెచ్.ప్రకాశ్‌రావు వెంటనే వచ్చారు. రేంజర్ చాంబర్‌ను తనిఖీ చేశారు. బీరువాలోగల మద్యం బాటిల్‌ను స్వాధీనపర్చుకున్నారు. ⇒ రేంజర్ శ్రీహరి ప్రసాద్ వ్యవహారంపై విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులైన అక్కడి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది నుంచి వివరాలను లిఖితపూర్వకంగా సేకరించారు. ⇒ ‘‘రేంజర్ సారు ఆల్కహాల్ తీసుకున్నారు. రిపోర్టర్లపై తిరగబడ్డారు’’ అని అక్కడి అధికారులు. సిబ్బంది తాము చూసింది చూసినట్టుగా చెప్పారు. ⇒ విలేకరులతో ఎఫ్డీఓ సిహెచ్.ప్రకాశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి రేంజర్‌పై తక్షణ చర్యలు ఉంటాయి. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తాను’’ అని చెప్పారు. గత ఏడాది నవంబర్ 1న ఇలాగే... ఈ రేంజర్ సారు గత ఏడాది నవంబర్ 1వ తేదీన కూడా ఇలాగే ప్రవర్తించారు. ఫుల్‌గా తొగి ఆఫీసుకొచ్చారు. ఆ తరువాత ఆఫీస్‌లో మరో ‘రౌండ్’ వేశారు. మద్యం మత్తులో ఆఫీస్‌లోని బెంచ్‌పై కాసేపు బొర్లారు. ఆ తరువాత ఆఫీస్ మెట్లు దిగలేక.. దిగలేక.. సిబ్బంది సహాయంతో అతి కష్టంగా దిగి, జీపు వరకు వెళ్లారు. అందులో ఎక్కేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా అప్పుడు పత్రికల్లో సచిత్రంగా ప్రచురితమైంది. అయినప్పటికీ అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించలేదు. ఈయన గారి తీరు కూడా మారలేదు. ‘‘ఈ తాగుబోతు రేంజర్.. ‘ఫారెస్టు’కే డేంజర్ అనే వాస్తవాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు ఎందుకు గుర్తించడం లేదు? తమ శాఖ పరువును బజారున బట్టబయలు చేస్తున్న ఈ తాగుబోతు రేంజర్‌ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు..?’’ అనే ప్రశ్నలు ఇక్కడి ప్రజల్లో తలెత్తుతున్నాయి. వీటికి సమాధానాల కోసం వారు ఎదురుచూస్తున్నారు.