జమ్మికుంట పోలీస్‌స్టేషన్. ఇన్‌సెట్‌లో శశికుమార్ తండ్రి శ్రీనివాస్
సాక్షి, జమ్మికుంట : తండ్రి మద్యపానానికి బానిసయ్యాడు. కుటుంబాన్ని మర్చిపోయాడు. మందే లోకంగా బ్రతుకుతున్నాడు. రోజంతా తాగి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. తాగటానికి డబ్బులు ఇవ్వాలంటూ నానా రచ్చ చేస్తాడు. లేదంటే ఇళ్లు పీకి పందిరేస్తాడు. వద్దంటూ వారిస్తే అంతే చేతికి అందిన వాటితో దాడికి దిగుతాడు. ఇలాంటి తండ్రి చేతిలో దెబ్బలు తిని తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారి హృదయం తల్లడిల్లింది. తనకు నాన్న వద్దంటూ పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్, జమ్మికుంట నగర పంచాయతీలోని మోతుకులగూడెంకు చెందిన శ్రీనివాస్ రోజు తాగొచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. రోజులాగే శుక్రవారం కూడా పీకల దాకా తాగి ఇంటికి వచ్చి కన్న కొడుకు శశికుమార్‌ని చితక బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శశి జమ్మికుంట పోలీసులను ఆశ్రయించాడు. తన తండ్రి రోజు తాగొచ్చి తనను, కుటుంబ సభ్యులను కొడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. రోజు తాగి వచ్చే తండ్రితో ఉండలేనని, తనకు తండ్రి వద్దంటూ పోలీసులకు మొరపెట్టుకున్నాడు. తనకు చదువుకోవాలని ఉందని, కానీ తండ్రి తాగుడు కారణంగా చదువుకోలకపోతున్నాంటూ వాపోయాడు. తనను హాస్టల్‌లో చేర్పించాలని జమ్మికుంట సీఐని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment