![Man Drinks Alcohol On Car Roof In Gurugram Traffic Viral Video - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/9/gurugram.jpg.webp?itok=bRYSSk3p)
ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు ఎరరికైనా చికాకు వస్తుంది. ఒక్కోసారి బండి ముందుకు కదిలేందుకు చాలా సమయం పడుతుంది. హర్యానా గురుగ్రాంలోనూ ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతని కారు భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది.
దీంతో సమయం వృథా అవుతుంది అనుకున్నాడేమే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మందు బాటిల్ పట్టుకొని కారుపైకి ఎక్కాడు. ఎంచక్కా పెగ్గు కలుపుకొని హాయిగా మద్యం సేవించాడు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇలాంటివి గురుగ్రామ్‌లోనే సాధ్యం అని కొందరు సరదాగా కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం ఈ మందుబాబుపై మండిపడ్డారు. రోడ్డుపై ఇలాంటి న్యూసెన్స్ ఏంటని విమర్శించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు..
Comments
Please login to add a commentAdd a comment