drink alcohol
-
జారి పట్టుతప్పినా పడిపోని ఒడుపు
ఫూటుగా తాగిన వ్యక్తి చెరువు గట్టు దిగుతుంటే తూలి పడటం సహజం. ఒకవేళ తూలిపడబోతుంటే తమాయించుకుని నిలబడగలిగితే భలేగా నిలబడ్డాడే అని పక్కన ఉన్నవాళ్లు నవ్వుకుంటూ మెచ్చుకోవడం సహజం. మానవులకు సాధ్యమయ్యే ఇలాంటి పనిని మరమనిషి సైతం సాధించి చూపించింది. మట్టిగట్టుపై నడుస్తూ కాలిజారి గబాలున పడబోతూ రోబోట్ వెంటనే తమాయించుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం అధునాతన రొబోటిక్ సాంకేతికరంగంలో పెద్ద చర్చనీయాంశమైంది. మనిషికి సాధ్యమయ్యే అసంకల్పిత ప్రతీకార చర్యలు మరమనుషులకు సాధ్యమా? అనే చర్చ మొదలైంది. అయితే వీడియో చూసిన వాళ్లలో కొందరు నవ్వు తెప్పించే కామెంట్లు పెట్టారు. ‘‘హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ మనిషిలాగే నడవగలిగే సామర్థ్యం సాధించాలంటే ముందుగా మనిషిలాగా ఇలా జారాలి. వెంటనే సర్దుకొని నిలబడగలగాలి’’అని కామెంట్ చేశారు. ‘పార్టీకి వెళ్లొస్తూ తెల్లవారుజామున నాలుగు గంటలకు నేను ఇలాగే నడుస్తా’అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడీ రోబోలు పిల్లాడిలా నడుస్తున్నాయిగానీ చూస్తుండండి త్వరలో ఇవి తుపాకులు పట్టుకుని మన వెంటే పడతాయి’’అని ఇంకొకరు అన్నారు. ‘‘విమానం మెట్ల మీద, సైకిల్ తొక్కుతూ తరచూ పడిపోయే అమెరికా వృద్ధ అధ్యక్షుడు బైడెన్ కంటే ఈ రోబో చాలా బెటర్. పట్టుతప్పినా పడిపోలేదు’’అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు. – న్యూయార్క్ -
ట్రాఫిక్‌లో కారుపైకి ఎక్కి పెగ్గులేసిన మందుబాబు.. వీడియో వైరల్..
ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు ఎరరికైనా చికాకు వస్తుంది. ఒక్కోసారి బండి ముందుకు కదిలేందుకు చాలా సమయం పడుతుంది. హర్యానా గురుగ్రాంలోనూ ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతని కారు భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. దీంతో సమయం వృథా అవుతుంది అనుకున్నాడేమే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మందు బాటిల్ పట్టుకొని కారుపైకి ఎక్కాడు. ఎంచక్కా పెగ్గు కలుపుకొని హాయిగా మద్యం సేవించాడు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by RTG2😃 (@20degreecelsius) ఇలాంటివి గురుగ్రామ్‌లోనే సాధ్యం అని కొందరు సరదాగా కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం ఈ మందుబాబుపై మండిపడ్డారు. రోడ్డుపై ఇలాంటి న్యూసెన్స్ ఏంటని విమర్శించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు.. -
వైరల్ వీడియో: మద్యం తాగి బస్సు ఎక్కిన వ్యక్తి.. కిందకు తోసేసిన బస్సు కండక్టర్
-
పాముతోనే పరాచకం.. హద్దు మీరి ముద్దు పెట్టి..
అసలే తాచుపాము. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ పాము రోడ్డు దాటుతోంది. ఇంతలో పామును పట్టుకొని, ఓ తాగుబోతు విన్యాసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నవరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి జాంబగుడ వద్ద జాతీయ రహదారిపైకి శుక్రవారం తాచుపాము వచ్చింది. ఎటువెళ్లాలో తెలియక రోడ్డు మధ్య భయంతో బుసలు కొడుతోంది. గమనించిన వాహనదారులు ప్రాణభయంతో దూరంగానే ఉండిపోయారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన మాధవ గౌడ మద్యం మత్తులో అక్కడకు చేరాడు. వెంటనే పాముని పట్టుకున్నాడు. తాగిన మైకంలో విన్యాసాలు ప్రారంభించాడు. హద్దు మీరి ముద్దు పెట్టడంతో పాము మరింత కోపంతో అతని నోటిపై కాటు వేసింది. ఇది చూసిన జనం ఆందోళనతో పామును వదలమని కేకలు వేశారు. మరికొందరు పాముని వదిలితే డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు విసిరారు. కానీ.. ఎవరూ అతని వద్దకు వెళ్లేందుకు సాహసించలేదు. కొంతసేపటికి అతని నోటి నుంచి రక్తం రావడం ప్రారంభమైంది. చివరకు పాముని వదలినా, దాని వెంట పడటం ప్రారంభించాడు. మళ్లీ పాము పడగ ఎత్తి, పలుమార్లు కాలిపై కాటువేసి, అడవిలోకి పారిపోయింది. వెంటనే వాహనదారులు అంబులైన్స్ సమాయంతో మాధవ్‌ను నవరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి.. -
మత్తు వదలరా... మద్యం మానేయాలంటూ హితభోధ!
సాక్షి, హైదరాబాద్: ‘టెన్త్‌లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చామని ముగ్గురం స్నేహితులం కలిసి బీరు కొనుక్కుని అందులో నీళ్లు పోసుకుని ట్యాంక్ బండ్ కింద ఫ్రెండ్ కారులో కూర్చుని తాగాం. అలా మొదలైన జర్నీ 33 సంవత్సరాలు నిరాటంకంగా నడిచింది. ఆఖరి 7 సంవత్సరాల్లో చివరి మూణ్నెళ్లు సూర్యుడ్ని చూడలేదంటే నమ్మండి’ అంటారు నగరానికి చెందిన కె.మూర్తి (62). ఆయనకు 36వ ఏటే హార్ట్ ఎటాక్ వచ్చి బైపాస్ సర్జరీ జరిగినా మద్యం మానని ఆయన ఇప్పుడు వ్యసనాలన్నీ వదిలేసి, అరవైలో ఇరవైలా హాయిగా ఉన్నారు. అంతేకాకుండా తనలాంటి మరికొందరి చేత తాగుడు మానిపించే పనిలో బిజీగా ఉన్నారు. నగరానికి చెందిన ఓ టాప్ లేడీ డాక్టర్...20 ఏళ్ల పాటు మద్యానికి బానిసయ్యారు. అర్జున్‌రెడ్డి సినిమాలో చూపించినట్టు ఆపరేషన్ థియేటర్స్‌కి కూడా తాగి వెళ్లేవారట. అలాంటి మహిళా వైద్యురాలు ఇప్పుడు అరవై ఏళ్ల వయసులో పూర్తిగా మందు మానేసి ఆల్కహాల్ వ్యసనాన్ని దూరం చేసే మందుగా మారారు. ...ఇలా తాగుడు మానాలని అనుకున్నవారు, విజయవంతంగా మానేసిన వారు..కొత్త పాత ఆల్కహాలిక్స్ కొందరు నగరంలో పలు చోట్ల సమావేశం అవుతున్నారు. తమను తాము సంస్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిని కలిపేందుకు వారధిగా మారింది ఆల్కహాలిక్స్ అనానిమస్ ఫెలోషిప్. అమెరికాలో పుట్టి...అంతర్జాతీయంగా మెట్టి... దాదాపుగా 90 ఏళ్ల వయసున్న ఆల్కహాలిక్ అనానిమస్ (ఎఎ) సంస్థ అమెరికాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఆల్కహాలిక్స్ను విముక్తుల్ని చేసేందుకు అవసరమైన చికిత్సలో వైద్యులకు కో థెరపీగా గుర్తింపు పొందింది. దీనిలో భాగంగానే ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. మహిళలు, పురుషులు ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడడానికి స్వచ్ఛందంగా ఇందులో భాగస్తులు అవుతారు. పరస్పరం ఆల్కహాలిజమ్ కు దూరమయ్యేందుకు సహకరించకుంటారు. ఫీజులు, రుసుములు ఏమీ ఉండవు. వ్యసనం నుంచి బయటపడాలనే ఆకాంక్ష ఒకటే అర్హత. మందులు, ఇతరత్రా ఉపయోగించరు. తాగుడు వ్యసనాన్ని దూరం చేసుకున్నవారిని సోబర్స్గా పిలుస్తారు. ఈ సోబర్స్.. బృందంలో చేరి ఆ విషయాలను విడమరచి చెప్పుకోవడం ఇందులో ప్రధానమైన విశేషం. వీరికి సంబంధించిన సమావేశాలు, ఇతరత్రా విషయాలన్నీ రహస్యంగానే ఉంచుతారు. వ్యసన పరుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువు లు కూడా దీనికి అనుబంధంగా పనిచేస్తుంటారు. ట్విన్ సిటీస్‌లోనూ మీటింగ్స్.. ఈ సంస్థ గురించి తెలిసిన నగరవాసులు గతంలో ముంబై వెళ్లి సమావేశాల్లో పాల్గొనేవారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వారానికి 60, 70 దాకా సమావేశాలు జరుగుతున్నాయి. నగరంలోనూ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్, వైఎంసిఎ నారాయణగూడ, మాదాపూర్, దిల్సుఖ్నగర్, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో వారానికి డజను దాకా సదస్సులు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్లో పీక్స్.. ఈ సంస్థ కార్యకలాపాలు నగరంలో లాక్ డౌన్ టైమ్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆ సమయంలో ఆల్కహాలిక్స్, వారి బంధువుల నుంచి హెల్ప్‌లైన్స్‌కి కాల్స్ వెల్లువెత్తాయి. అయితే మీటింగ్స్ నిర్వహించే అవకాశం లేక పలువురికి సాయం చేయలేకపోయాం అంటున్నారీ గ్రూప్ సభ్యులు. రెగ్యులర్ మెంబర్స్‌కి మాత్రం ఆన్లైన్, ఫోన్ ఇన్, జూమ్ మీటింగ్స్ నిర్వహించామని చెప్పారు. ఈ సంస్థ సహకారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 96664 66118/119 (చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!) -
పుట్టింటికి వెళ్లిన భార్య.. అత్త చెవి కోసిన అల్లుడు..
సాక్షి, ఆదోని(కర్నూలు): తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్తపై కత్తితో దాడి చేసి చెవి కోశాడు. అడ్డు వచ్చిన భార్యనూ గాయపర్చాడు. ఈ ఘటన మంగళవారం ఆదోనిలో చోటు చేసుకుంది. వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ వివరాల మేరకు.. పట్టణంలోని మరాఠగేరికి చెందిన మాధవి.. నిజాముద్దీన్ కాలనీకి చెందిన నరేష్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాగుడుకు బానిస అయిన భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు. భరించలేక ఇటీవలే మాధవి తన భర్తను వదిలి తల్లి సావిత్రమ్మ వద్దకు వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని నరేష్కుమార్ అత్త ఇంటికెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సావిత్రమ్మ ఎడమ చెవి సగం తెగిపోయింది. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఏడుపు విని ఇరుగుపొరుగు వారు రావడంతో నరేష్కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన ఘటనపై మాధవి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తనను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడమే కాక వివాహ సమయంలో తీసుకెళ్లిన రూ.8 లక్షలు, 20 తులాల బంగారం తాగుడుకు ఖర్చు చేసి మళ్లీ ఇప్పుడు డబ్బు కోసం వేధిస్తున్నాడని మాధవి విలపించారు. చదవండి: భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఇల్లాలు -
పూటుగా మద్యం తాగి.. సెల్‌ఫోన్ కోసం గొడవ..
సాక్షి, జగద్గిరిగుట్ట (హైదరాబాద్): సెల్‌ఫోన్ కోసం జరిగిన వివాదంలో ఒకరు ప్రాణం కోల్పోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్న శశి వైన్స్ వద్ద సోమవారం భూక్య భీమా(45), తన స్నేహితుడు ఫుల్‌గా మద్యం సేవించారు. తాగిన మత్తులో వారిద్దరి మధ్య సెల్‌ఫోన్ కోసం గొడవ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి వైన్స్ షాపు సెక్యూరిటీ గార్డ్ తెలిపాడు. వైన్స్ మూసేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ భోజనం చేయడానికి పక్కకు వెళ్లగా ఒక పెద్ద బండరాయి శబ్ధం రావడంతో తిరిగి వైన్స్ వద్దకు చేరుకొని చూడగా ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య చేయబడ్డాడని గమనించి వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హత్య కాబడ్డ వ్యక్తి జేబులో ఉన్న బుక్‌ను చెక్ చేయగా అతడి పేరు భూక్య భీమాగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని సీఐ సైదులు తెలిపారు. చదవండి: న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులు -
నవ్వొద్దు.. ఏడ్వొద్దు.. తాగొద్దు.. ఉల్లంఘిస్తే ఖతమే!
North Korea Banned Laughing: ఓవైపు నియంత పాలన.. మరోవైపు ఆకలి కేకలతో నిత్యం నరకం అనుభవించే కొరియన్లపై జాలి చూపించడం తప్ప ప్రపంచం చేయగలిగింది ఏం లేదు. ఈ మధ్యే అధ్యక్షుడిగా పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు అతనిలోని మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలిచాయి. ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ వర్దంతి వేడుకల్ని శుక్రవారం(డిసెంబర్ 11) నుంచి 11 రోజులపాటు దేశవ్యాప్తంగా నిర్వహించాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1994 నుంచి 2011(చనిపోయేవరకు) ఉత్తర కొరియాను పాలించిన నియంతాధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఇల్ చిన్న కొడుకే.. ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఈ తరుణంలో వర్ధంతి వేడుకల సందర్భంగా ఉత్తర కొరియాలో విధించిన ఆంక్షల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. సినుయిజు సిటీలోని ఫ్రీ ఏషియా రేడియో నెట్వర్క్ అందించిన కథనం ప్రకారం.. ఈ పదకొండు రోజులు ఏ పౌరుడు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. మద్యం కూడా తాగ కూడదు. ఎవరూ పుట్టినరోజులు జరుపుకోకూడదు. బహిరంగంగా నవ్వడానికి, ఏడవడానికీ వీల్లేదు. ఎటువంటి వేడుకలు చేసుకోవడానికి, వాటిల్లో పాల్గొనకూడదు. చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోయినా కన్నీళ్లు పెట్టుకోకూడదు. వర్ధంతి రోజైన శుక్రవారం.. నిత్యావసరాల దుకాణాల ముందు జనాలెవరూ క్యూ కట్టడానికి వీల్లేదు. విషాద దినాల్లో మాజీ అధ్యక్షుడి నివాళి సమావేశానికి అందరూ హాజరవ్వాలి. వీటిని ఎవరు ఉల్లంఘించినా(కిమ్ కుటుంబం, పేషీ తప్ప) వాళ్లు నేరగాళ్ల కిందే లెక్క. శిక్షగా వాళ్లు మళ్లీ కనిపించకుండా పోతారు(అయితే మరణశిక్ష లేదంటే జీవితకాలం బానిస బతుకు). ఈ పదేళ్లలో ఇలాంటి ఉత్తర్వులు జారీ కావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈ ఆదేశాల్ని జనాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇందుకోసం వాళ్లను నిద్ర కూడా పోకూడదన్న ఆదేశాలు జారీ చేసిందట కిమ్ కార్యాలయం. కొత్తేం కాదుగా.. - ఈ ఏడాది మొదట్లో కిమ్ కార్యాలయం.. జనాలను టైట్ జీన్స్ వేయకూడదని, స్టయిల్‌గా రెడీ కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. - క్యాపిటలిస్టిక్ లైఫ్‌స్టయిల్ కొరియా యువత మీద ప్రతికూల ప్రభావం చూపెడుతోందన్న ఉద్దేశంతో పాప్ కల్చర్‌ను బ్యాన్ చేశాడు. - తన స్టయిల్‌ను కాపీ కొట్టకూడదనే ఉద్దేశంతో ఆ తరహా లెదర్ జాకెట్లను నిషేధించాడు. - స్క్విడ్ గేమ్ దక్షిణ కొరియా సిరీస్ కావడంతో.. దానిని సర్క్యులేట్ చేసిన ఓ వ్యక్తిని కాల్చి చంపడంతో పాటు ఓ స్కూల్ ప్రిన్స్‌పాల్, టీచర్, ఐదుగురు పిల్లలకు బానిస శిక్షను అమలు చేశాడు. చదవండి: ఉత్తర కొరియా: కిమ్ వర్సెస్ కిమ్! -
విధులకు డుమ్మా కొట్టి.. విందులో చిందులు
కొండపాక(గజ్వేల్): పనివేళల్లో విధులకు డుమ్మా కొట్టి విందులు, వినోదాల్లో మునిగితేలారు సిద్దిపేట జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది. జిల్లాలోని 22 మండలాల పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు శుక్రవారం కొండపాక శివారులోని ఓ మామిడి తోటలో సమావేశమై విందులు చేసుకుంటూ చిందులు వేశారు. ఈ వ్యవహారం కాస్తా టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీరియస్ అయ్యారు. కొండపాక ఎంపీడీఓ రాజేశ్‌ను కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) నర్సింగరావును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. చదవండి: Coronavirus: ‘ప్రైవేటు’లో టీకాల జోరు! -
వెయ్... చిందెయ్...
వారంతా ఉపాధి సిబ్బంది. నాలుగు రోజుల కిందట ఓ విందు కార్యక్రమానికి వెళ్లి అక్కడ మద్యం సేవించి భోజనం ఆరగించారు. తరువాత అక్కడ నుంచి కార్యాలయానికి వచ్చి మద్యం మత్తులో వేయ్...చిందేయ్....అంటూ గంతులేశారు. అక్కడితో ఆగకుండా వాటిని తమ సెల్ఫోన్లలో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లోకి అప్లోడ్ చేశారు. అది కాస్త ఆలస్యంగానైనా శుక్రవారం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో చిందులేసిన ఆరుగురు సస్పెండ్‌కు గురయ్యారు. విజయనగరం జిల్లా / గరుగుబిల్లి: విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో ఉండాల్సిన సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాలలో చిందులు వేస్తూ సామాజిక మాధ్యమాలకు చిక్కారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలకు సస్పెండ్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది ఈ నెల 12న మండలంలోని సంతోషపురంలో జరిగిన ఓ విందు కార్యక్రమంలో అధికారులతో పాటు పాల్గొన్నారు. విందు ముగించుకొన్న తరువాత ఉపాధి హామీ కార్యాలయానికి తిరిగి చేరుకొన్నారు. విందులోనే మద్యం సేవించి ఉండటం కారణంగా కార్యాలయానికి వచ్చిన తరువాత కార్యాలయంలో ఉన్నతాధికారులు ఎవ్వరూ లేకపోవడంతో సిబ్బంది సెల్ఫోన్లో హుషారు అయిన పాటలు వేసుకొని డ్యాన్సులు చేసి చిందులు వేసి తమలో దాగివున్న కళను ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా ఓ అడుగు ముందుకు వేసి ఈ దృశ్యాలను ఉపాధి సిబ్బందిలో ఒకరు సామాజిక మాధ్యమాలలో ఒకటైన ఫేస్బుక్లో పెట్టారు. ఈ వీడియో క్లిప్పింగ్ మీడియా ప్రతినిధులకు చిక్కింది. ఈ మేరకు వీడియోను లీక్ చేయకుండా ఉండాలంటే కొంత మొత్తం ఇవ్వాలని మీడియా ప్రతినిధులు(సాక్షి కాదు) ఉపాధి సిబ్బందికి డిమాండ్ చేశారు. దీనికి ఉపాధి సిబ్బంది అంగీకరించకపోవడంతో విషయం కాస్త ఆలస్యంగా శుక్రవారం బయటకొచ్చింది. ఆరుగురు ఉద్యోగులు సస్పెన్షన్ మండల కేంద్రంలోని స్థానిక ఉపాధి హామీ పథకంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఆరుగురు సిబ్బంది విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు విజయనగరం జిల్లా నీటియాజమాన్య సంస్థ పధక సంచాలకులు ఆర్.రాజగోపాలరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో జి.పార్వతి తెలిపారు. ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ విధులను నిర్వహిస్తున్న సమయంలో మద్యంను సేవించి, చిందులు వేసినట్లు వచ్చిన ఆరోపణలు భాగంగా ప్రాథమిక విచారణ ఆధారంగా తొలగించినట్టు పేర్కొన్నారు. సస్పెండ్‌కు గురైన వారిలో ఏపీవో టి.రామకృష్ణనాయుడు, సాంకేతిక సహయకులు పి.పోలారావు, సిహెచ్.వెంకటేష్, ఎం.రమణ, కంప్యూటర్ ఆపరేటర్ ఎ.శంకరరావు, జేఈ వైఆర్‌డీ ప్రసాద్‌లున్నారు. ఇదిలా వుండగా విధులలో బాధ్యతా రహితంగా వ్యవహరించిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు సస్పెండ్ కొనసాగుతుందని ఎంపీడీవో తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్, సాంకేతిక సహాయకులు చిందులు వేసినప్పటికీ, సిబ్బందిని క్రమశిక్షణలో ఉంచలేని ఏపీవో, జేఈలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. -
ఫోన్ పోయింది.. వెతికివ్వండి లేకపోతే...
ధర్పల్లి(నిజామాబాద్ రూరల్): తప్పతాగిన మైకంలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. తాళ్ల సాయంతో కిందికి దించి సురక్షితం గా ఇంటికి చేర్చారు పోలీసులు. మండలంలోని దమ్మన్నపేట్ గ్రామానికి చెందిన పెయింటర్‌గా పని చేస్తున్న తులసీనారాయణస్వామి అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం తప్పతాగిన మైకంలో ధర్పల్లి గ్రామ శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వెనుక గల వాటర్ ట్యాంక్‌ను ఎక్కి హల్చల్ చేశాడు. ట్యాంక్ సమీపంలోని హోటల్ వద్దకు ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి టీ తాగుతున్నారు. నా సెల్‌ఫోన్ పోయిందని మీరే వెతికి పెట్టాలని కానిస్టేబుళ్ల వద్ద తాగిన మైకంలో తుల్లుతూ తులసీనారాయణస్వామి అనే వ్యక్తి అడిగారు. కానిస్టేబుళ్లు వెతికి పెట్టుతాములే టీ తాగు అని అతడికి టీ ఇప్పించారు. వ్యక్తి టీ తాగి పక్కనే గల వాటర్ ట్యాంక్ ఎక్కాడు. కానిస్టేబుల్ మాన్సింగ్ చాకచక్యంగా ట్యాంక్‌పైకి ఎక్కి వ్యక్తిని పట్టుకొని ఇతర వ్యక్తుల సహాయంతో పాటు తాళ్లతో బం ధించి కిందికి దించారు. ట్యాంక్ కిందికి దించే సమయంలో స్వామి జై తెలంగాణ.. అంటూ నినాదాలు చేశాడు. పరిస్థితిని ధర్పల్లి సీఐ ప్రసాద్, ఎస్ఐ పాండేరావు పరిశీలించారు. ఇదే వాటర్ ట్యాంక్‌పై నుంచి గతంలో ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమై వ్యక్తిని సురక్షితంగా రక్షించారు. పెయింటర్ స్వామిని పోలీసు లు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి దమ్మన్నపేట్ గ్రామానికి తీసుకెళ్లారు. స్వామి 25 ఏళ్ల క్రితం దమ్మన్నపేట్‌కు వచ్చి పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడికి భార్య, పిల్లలు లేనట్లు పోలీసులు తెలిపారు. -
మద్యం మత్తులో యువకులను ఢీకొట్టిన యువతులు
సాక్షి, హైదరాబాద్ : మద్యం మత్తులో యువతులు హద్దులు మీరుతున్నారు. ముగ్గురు యువతులు తప్ప తాగి శనివారం అర్థరాత్రి ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్లారు. ఆ సమయంలో రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని బయోడైవర్సిటీ వద్ద అటుగా వస్తున్న ఇద్దరు యువకులను ఢీకొట్టారు. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి స్థానికి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సీఏ చదువుతున్న జెన్నీ జాకబ్ మద్యం సేవించి వాహనం నడిపిందని తెలిసింది. చనిపోయిన వ్యక్తిని చిరంజీవి(20)గా, చికిత్స పొందుతున్న వ్యక్తి సాయి కుమార్(22)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పతాగి వీరంగం సృష్టించిన ట్రాఫిక్ పోలీస్
-
మత్తు వదిలించిన మహిళలు
అజ్జాడ (బలిజిపేట), న్యూస్‌లైన్: ఆ ఊరికి పట్టిన మద్యం మత్తును వదిలించేందుకు ఆ గ్రామ మహిళలు ముందుకు వచ్చారు. గ్రామంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నియంత్రించి, సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో గ్రామస్తులంతా అంగీకరించారు. గ్రామంలోని బె ల్టు షాపును ఎత్తివేయాల్సిందేనని ఇకపై గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించినా, తాగినా కఠిన చర్యలుంటాయని తీర్మానించారు. బలిజిపేట మండలం అజ్జాడలో సర్పంచ్ లక్కెన ఎల్లంనాయుడు, కో ఆపరేటివ్ అధ్యక్షుడు అక్కెన జగన్నాథం నాయుడు, గ్రామ పెద్దలు ఐకమత్యంతో బుధవారం నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని గ్రామంలో విధించారు. తొలుత గ్రామ మహిళలు బెల్టుషాపు ఎతివేసి పూర్తిగా మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలని కోరుతూ పురవీధుల్లో ర్యాలీ చేశారు. అనంతరం గ్రామ పెద్దలు, ప్రజల సహా యంతో బెల్టుషాపును ఎత్తివేయించారు. గ్రామంలో మద్యం అమ్మకాలు చేసిన వారికి జరిమానాతో పాటు కఠిన చర్యలు విధిస్తామని మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో మద్యాని కి చాలా మంది బానిసలు కావడంతో వారి కుటుంబాలు పలుఇబ్బందులు పడుతున్నాయన్నారు. గ్రామంలో బెల్టుషాపు ఉన్నందు న విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరగడంతో పెద్ద, చిన్న తారతమ్యం లేకుండా, పక్కగ్రామల నుంచి వచ్చి మరీ మద్యం తాగుతున్నారన్నారు. గ్రామంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలుపుదల చేయాలం టూ పలుశాఖల ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేశామని మహిళా సంఘ సభ్యులు పలగర నారాయణమ్మ, కె.నారాయణమ్మ, సింహాచలం,అన్నపూర్ణ, తెర్లి మంగమ్మ, ఆర్ జగదీశ్వరి తెలిపారు.