భోపాల్: దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఆయా రాష్ట్రాలు ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఓ జిల్లా యంత్రాంగం వ్యాక్సిన్ తీసుకున్న వారికే మద్యం అమ్మాలని నిర్ణయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో చోటు చేసుకుంది.
రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 230 కి.మీ దూరంలో ఉన్న ఖాండ్వా జిల్లా యంత్రాంగం కొత్త నిబంధనను విధించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు టీకాలు వేసుకున్న వారికే వైన్స్ షాపుల్లో మద్యం విక్రయించనున్నారు. దీనిపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, "ఖచ్చితంగా వాక్సిన్ సర్టిఫికేట్లు చూపించాల్సిన అవసరం లేదు, కేవలం నోటి మాట చెప్తే చాలని, ఎందుకంటే మద్యం తాగే వారు అబద్ధాలు చెప్పరని తెలిపారు. జిల్లాలో ప్రారంభించిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌లో ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో రెండు డోసుల టీకాలు తీసుకోని వారికి మద్యం కూడా అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నారు.
"No vaccination proof is required, verbal assurance of being fully vaccinated is enough. Those who drink don’t lie": RP Kirar, Khandwa district excise officer, on recent order restricting the sale of liquor only to those fully vaccinated. pic.twitter.com/Ltzqsy3GUV
— NDTV (@ndtv) November 19, 2021
Comments
Please login to add a commentAdd a comment