చిన్న అర్జున్ (ఫైల్)
సాక్షి, ఆత్మకూరు(నల్లగొండ): బీరుసీసాలతో పొడిచి, ఇనుప రాడ్లతో మోదీ ఓ వ్యక్తిని హత్య చేసిస ఘటన ∙మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నం లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చిన్నం అర్జున్ (32)కు అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి అశోక్‌రెడ్డి మధ్య కొంత కాలంగా పాతకక్షల నేపథ్యంలో గొడవలు జరుగుతుండేవి. ́పాతకక్షలను దృష్టిలో ఉంచుకుని అశోక్‌రెడ్డి అదును చూసి చిన్నం అర్జున్ రెడ్డిని తన ఇంటి నుంచి మద్యం సేవిద్దామని ఈనెల 14న రాత్రి 8గంటలకు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.
మద్యం సేవిస్తుండగా పథకం ప్రకారం... అప్పటికే అక్కడ మాటేసి ఆశోక్‌రెడ్డికి సంబంధించిన వ్యక్తులు పెద్దిరెడ్డి పాడురెడ్డి, సోమేష్‌రెడ్డి, సులోచన, శిరీష, ఉడుత నర్సింహ, చంద్రకళ, నవీన్ చిన్నగూడెం గ్రామానికి చెందిన యాస నరేందర్ రెడ్డి, యాస మహేష్‌రెడ్డి, యాస మల్లారెడ్డి, బండ సురేష్, లగ్గాల రవి ఆదే రోజు రాత్రి అర్జున్‌ను చిత్రహింసలకు గురి చేసి, బీరు సీసాలతో పొడిచి, ఇనుప రాడ్లతో మోదీదారుణంగా హత్యచేశారు. సమాచారం తెలుసుకున్న రామన్నపేట సీఐ మోతిరాం... ఎస్‌ఐ జి.మధు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. పాతకక్షల నేపధ్యంలోనే హత్య జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్‌ఐ జి.మధు తెలిపారు.
పోలీసుల విచారణపై అనుమానం .....
ఈ నెల రాత్రి హత్య జరిగిన ట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే అదే రోజురాత్రి పోలీసులకు తెలిసినప్పటికీ గ్రామపెద్దలకు, రెవెన్యూ అధికారులకు తెలియకుండా శవాని పంచనామా చేయకుండా మరునాడు ఉదయం 4గంటలకు పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ సమాచారం గ్రామస్తులకు తెలియడంతో ఉదయ హత్యకు బాధ్యులై నవారిపై చర్య తీసుకోవాలని, పోలీసుల వైఖరికి నిరసన గా రాయిగిరి–మోత్కూరు రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో రామన్న పేట సీఐ మోతిరాం, ఎస్‌ఐ జి.మధు ఘటన స్థలానికి చేరుకుని ఏడుగురు నిందితులను పట్టుకున్నట్లు, విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళ విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment