సాక్షి, హైదరాబాద్ : మందుబాబులకు హైదరాబాద్ మెట్రో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని మద్యం సేవించి ఇళ్లకు వెళ్లేవారికి మెట్రో తీపి కబురు చెప్పింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. రాత్రి ఒంటి గంటవరకు మెట్రో సేవలు పొడిగిస్తున్నట్టు తెలిపారు. అలాగే మద్యం సేవించిన వారికి మెట్రోలో అనుమతిస్తామని చెప్పారు. అయితే మందుబాబులు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని మెట్రో అధికారులు సూచించారు. పలువురు డిసెంబర్ 31న రాత్రి పార్టీల్లో ఫుల్‌గా మద్యం సేవించి.. ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరుగుతుండటంతో మెట్రో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు..
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎంఎంటీఎస్ రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 1.15 గంటలకు లింగపల్లి నుంచి హైదరాబాద్‌కు, అలాగే అర్ధరాత్రి 1.30 గంటలకు లింగపల్లి నుంచి ఫలక్‌నుమాకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment