
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. వివిధ కారిడార్‌లలో ఆఖరి సర్విసు రాత్రి 12.15 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున ఒంటిగంటకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుంది.
నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే నగరవాసులు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుకొనేందుకు వీలుగా సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మద్యం సేవించి మెట్రో రైళ్లలో, స్టేషన్‌లలో ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
పోలీసులతో పాటు,మెట్రో సెక్యూరిటీ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తారని చెప్పారు. మెట్రో రైళ్ల నిర్వహణకు ప్రయాణికులు సహకరించాలని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్ సీఈవో కేవీబీ రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment