సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని శనివారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుపనున్నట్లు హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని వివిధ మెట్రో కారిడార్‌లలో తెల్లవారు జామున ఒంటిగంటకు ప్రారంభ స్టేషన్ నుంచి చివరి రైలు బయలుదేరి 2 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మరోవైపు వేడుకలను దృష్టిలో ఉంచుకొని మెట్రో స్టేషన్లు, రైళ్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఇళ్లకు చేరుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు...
నూతన సంవత్సరం సందర్భంగా కల్వరి టెంపుల్‌లో జరిగే వేడుకలకు వెళ్లే భక్తుల కోసం శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వివిధ రూట్లలో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ తెలిపారు. నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. న్యూ ఇయర్ విషెస్ ఇలా తెలియజేయండి మీ సన్నిహితులకు
Comments
Please login to add a commentAdd a comment