
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హైదరాబాద్ మెట్రో రైలులో సందడి చేశారు. సీసీఎల్ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన సుదీప్ మెట్రోలో ప్రయాణించారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్‌లో తన టీమ్‌తో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను హైదరాబాద్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఏడాది సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియంతో రెండు రోజుల పాటు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ నగరానికి చేరుకుంది. ఉప్పల్ స్డేడియం వెళ్లేందుకు మెట్రోలో ప్రయాణించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. కిచ్చా సుదీప్ కర్ణాటక బుల్డోజర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఉప్పల్ స్డేడియంలో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై రైనోస్‌తో తలపడతారు. మరో మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్- తెలుగు వారియర్స్‌ను ఢీకొట్టనుంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫైనల్స్ మార్చి 2న జరగనుంది. ఇక సినిమాల విషయానికొస్తే కిచ్చా సుదీప్ చివరిసారిగా మాక్స్ మూవీలో కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment