Kannada Producer MN Kumar Accuses Kichcha Sudeep Of Remuneration, Deets Inside - Sakshi
Sakshi News home page

Kicha Sudeep Remuneration Controversy: సుదీప్‌ చేసిన మోసాన్ని బయటపెట్టిన నిర్మాత

Published Tue, Jul 4 2023 11:57 AM | Last Updated on Wed, Jul 5 2023 2:34 PM

Kannada Producer MN Kumar Accuses Kichcha Sudeep Of Remuneration - Sakshi

కిచ్చా సుదీప్ టాలీవుడ్‌ వారికి సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఇటీవల విక్రాంత్‌ రోణాతో తెలుగులో కూడా మెప్పించాడు. తాజాగా ఆయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న కిచ్చా46 సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

(ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్‌ అర్థమేంటి?) 

తాజాగా సుదీప్‌పై కన్నడ నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ పలు ఆరోపణలు చేశాడు. తన బ్యానర్‌లో సినిమా చేస్తానని రెమ్యూనరేషన్ తీసుకుని మూవీ చేయకుండా మోసం చేశాడని ఆయన తెలుపుతున్నాడు. ప్రాజెక్ట్‌ కోసం సుదీప్‌కు రూ. 9 కోట్ల రూపాయలు ఇచ్చానని, కానీ డేట్స్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని నిర్మాత ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఫిర్యాదు చేశానన్నారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి ఇద్దరి మధ్య పరస్పరం అంగీకారం కుదిరనట్లు తెలిపాడు. కానీ ఇప్పటి వరకు డేట్స్ కేటాయించడంలో సుదీప్‌ విఫలమయ్యారని నిర్మాత పేర్కొన్నారు. 

సినిమాకు సంబంధించిన పూర్తి రెమ్యూనరేషన్ రూ. 9 కోట్లతో పాటు.. మరో రూ. 10 లక్షలు తన వంట గది రెనోవేషన్‌ కోసం సుదీప్‌ తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. సినిమా కోసం దర్శకుడు నంద కిషోర్‌కి అడ్వాన్స్ చెల్లించడంతో పాటు ఈ చిత్రానికి  'ముత్తట్టి సత్యరాజు' అనే టైటిల్‌ను కూడా ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేశామన్నారు. కానీ తమ బ్యానర్‌లో సినిమా చేయకుండా ఇప్పుడు, ఒక తమిళ నిర్మాతతో సుదీప్‌ మూవీ ప్రకటించారు.

(ఇదీ చదవండి: 'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్)

తన వద్ద డబ్బు  తీసుకున్న తర్వాత ఇప్పటికే వివిధ నిర్మాతలతో సుదీప్‌ నాలుగు సినిమాలు చేశాడు. కానీ తన బ్యానర్‌లో చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. దీంతో తాను సుదీప్‌ను సంప్రదించడానికి చాలా రకాలుగా ప్రయత్నించానని, అయితే అతని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్‌కి సమస్యను తీసుకెళ్లానని, అతను మాట్లాడితే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement