
సాక్షి, లింగాల (అచ్చంపేట): మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో రోడ్డుకు ఇరువైపుల నాటిన హరితహారం మొక్కలను ఎద్దు తిన్నందుకు దాని యజమానికి జరిమానా విధించినట్లు పంచాయతీకార్యదర్శి పవన్ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇటీవల రోడ్డుకు ఇరువైపుల మొక్కలను నాటగా అదే గ్రామానికి చెందిన ఈడిగ ఏమయ్య అనే రైతుకు చెందిన ఎద్దు సోమవారం మేసింది. యజమాని నిర్లక్ష్యంగా ఎద్దును మొక్కకు కట్టి ఉంచగా అది చుట్టు పక్కల నాటిన మొక్కలను తినేసింది. ఈ విషయాన్ని కార్యదర్శి ఎంపీడీఓ రాఘవులు దృష్టికి తీసుకవెళ్లగా ఆయన ఆదేశాల మేరకు యజమానికి జరిమానా విధించినట్లు కార్యదర్శి తెలిపారు.