
గౌహతి: అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. కన్నకూతురిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి కోర్టు ప్రాంగణంలోనే తన భార్యను గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు. నిందితుడు పూర్ణ నహర్ కన్నకూతురును అత్యాచారం చేశాడనే ఆరోపణలతో 9 నెలలు జైళ్లో గడిపి ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చాడు. విచారణ నిమిత్తం శుక్రవారం కోర్టుకు హాజరైన అతను అకస్మాత్తుగా భార్య రీటా నహర్‌పై దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.