![Karbi Anglong SP Gaurav Upadhyay Faces Molestation Charges - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/6/2_0.jpg.webp?itok=BbvK7nnk)
గౌరవ్ ఉపాధ్యాయ్
గువహతి: కంచే చేను మేసిన చందాన రక్షణ కల్పించాల్సిన పోలీసే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అసోం రాష్ట్రంలోని కర్బీఅంగ్‌లాంగ్ పట్టణంలో పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)గా పనిచేస్తున్న గౌరవ్ ఉపాధ్యాయ్ ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అసోంలో కలకలం రేపింది. బాలిక ఫిర్యాదు మేరకు ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్‌పై పోస్కో చట్టం సెక్షన్ 10 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ ఎంపీ గుప్తా తెలిపారు. కాగా 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఉపాధ్యాయ 2019 జనవరి 22 నుంచి కర్బీఅంగ్‌లాంగ్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment