Karbi Anglong
-
వేర్పాటువాదులతో శాంతి ఒప్పందం
న్యూఢిల్లీ: అస్సాంలోని కార్బీ అంగ్లాంగ్ ప్రాంతంలో హింసకు చరమగీతం పాడి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా అదే రాష్ట్రానికి చెందిన ఐదు వేర్పాటువాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై కేంద్రం, అస్సాం ప్రభుత్వం సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తాజా ఒప్పందంతో కార్బీ అంగ్లాంగ్లో ఇక శాశ్వతంగా శాంతి నెలకొంటుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంపై కార్బీ లోంగ్రీ నార్త్ చచార్ హిల్స్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్స్ డెమొక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ కార్బీ లోంగ్రీ, యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, కార్బీ పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ తదితర వేర్పాటువాద సంస్థలు సంతకాలు చేశాయి. ఆయా సంస్థలకు చెందిన 1,000 మంది వేర్పాటువాదుల తమ ఆయుధాలతో సహా ఇప్పటికే లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. హింసకు తావులేని సౌభాగ్యవంతమైన ఈశాన్య భారతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని, ఆ దిశగా కార్బీ అంగ్లాంగ్Š అగ్రీమెంట్ ఒక కీలకమైన ముందడుగు అని అమిత్ షా వివరించారు. -
ఛీఛీ.. బాలికపై పోలీస్ బాస్ లైంగిక దాడి
గువహతి: కంచే చేను మేసిన చందాన రక్షణ కల్పించాల్సిన పోలీసే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అసోం రాష్ట్రంలోని కర్బీఅంగ్‌లాంగ్ పట్టణంలో పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)గా పనిచేస్తున్న గౌరవ్ ఉపాధ్యాయ్ ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అసోంలో కలకలం రేపింది. బాలిక ఫిర్యాదు మేరకు ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్‌పై పోస్కో చట్టం సెక్షన్ 10 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ ఎంపీ గుప్తా తెలిపారు. కాగా 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఉపాధ్యాయ 2019 జనవరి 22 నుంచి కర్బీఅంగ్‌లాంగ్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చదవండి: 'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు' చదవండి: రైలులో చిన్న వివాదం ఎంత పనిచేసింది? -
ఉగ్రవాద ఉన్మాదానికి ఎస్ పీ బలి
అస్సాంలో ఉగ్రవాదులు ఒక జిల్లా ఎస్ పీ ని పొట్టనబెట్టుకున్నారు. అస్సాం లోని కార్బిఆంగ్లాంగ్ జిల్లాలోని వేర్పాటువాదులు హామ్రెన్ పోలీస్ జిల్లా ఎస్పీ నిత్యానంద గోస్వామిని జిల్లాలోని రాంథాంగ్ అడవుల్లో చంపేశారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల బృందానికి గోస్వామి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో గోస్వామి, ఆయన అంగరక్షకుడు చనిపోయారు. వారి భౌతికకాయాలను శుక్రవారం ఉదయం పోలీసులు జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. కార్బి ఆంగ్లాంగ్ జిల్లా స్వయంశాసిత రాష్ట్రం కావాలన్న డిమాండ్ తో కార్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ అన్న ఉగ్రవాద సంస్థ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతూ వస్తోంది. 2010 లో దీని ఏర్పాఉట జరిగింది. ప్రస్తుతం అస్సాంలో ఈ సంస్థను అణచివేసేందుకు ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. అసొంలో 1996 లో తిన్ సుకియా జిల్లా ఎస్ పీని ఉగ్రవాదులు చంపేశారు. ఆ తరువాత ఎస్ పీ స్థాయి అధికారి చనిపోవడం ఇదే తొలిసారి. గతేడాది జార్ఖండ్ లోని పాకుర్ జిల్లా ఎస్పీ అమర్ జిత్ బలిహార్ ను మావోయిస్తులు పొట్టన బెట్టుకున్నారు. -
అసోంలో భూకంపం
అసోంలోని కర్బి అంగల్లాంగ్లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించిందని గౌహతిలోని భారత వాతావరణ కేంద్రం ఉన్నతాధికారులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఈ రోజు ఉదయం 9.46 గంటలకు ఈ భూకంపం చోటు చేసుకుందని తెలిపారు. కొన్ని సెకన్లు పాట్లు భూమి కంపించిందన్నారు. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.5 గా నమోదు అయిందని చెప్పారు. భూకంపం వల్ల తలుపులు, కిటికిలు కొన్ని సెకన్ల పాటు గట్టిగా కదిలాయని పేర్కొన్నారు. అయితే భూకంప ఘటన వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం సంభవించినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపారు. -
'తెలంగాణ' ఏర్పాటు సరైన చర్య కాదు: ప్రమోద్ బోరా
తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటు సరైన చర్య కాదని అల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్యు) అధ్యక్షుడు ప్రమోద్ బోరా మంగళవారం రాటలో జరిగిన విలేకర్ల సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఓ విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేలు కలసి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఏబీఎస్యు ఇచ్చిన 15 వందల గంటల బంద్ నిరాటంకంగా సాగుతోంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలం అంటూ యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దాంతో దేశంలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తున్న వివిధ సంస్థలకు ఊపిరిలూదినట్లు అయింది. అందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తమ ప్రాంతాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులకుపైగా నిత్య నిరసనలు, తీవ్ర ఆందోళనలతో అసోం రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజ జీవనం అస్తవ్యస్తమైంది. కార్బి అంగ్లాంగ్ జిల్లాను ప్రత్యేక రాష్టంగా ఏర్పాటు చేయాలని రెండు సంఘాలు 64 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ఆ రాష్ట్రంలోని అన్నిపార్టీల నేతలు యూపీఏ చైర్మన్ సోనియాగాందీ, ప్రధాని మన్మోహన్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసేందుకు న్యూఢిల్లీ పయనమైయ్యారు. అయితే జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా అంత సవ్యంగానే ఉందని కార్బి అంగలాంగ్ జిల్లా అధికారులు తెలిపారు. దాంతో ఆరుగంటలపాటు కర్ఫ్యూ ను సడలించినట్లు చెప్పారు. జిల్లాలోని మంజలో పారెస్ట్ కార్యాలయన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను భద్రత దళాలు అరెస్ చేసినట్లు చెప్పారు. బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని యూడీపీఎఫ్ సోమవారం పిలుపు నిచ్చింది. దాంతో దిగువ అసోంలోని అయిదు జిల్లాలు పూర్తిగా ప్రజాసేవలు నిలిచిపోయాయి. దాంతో జనాలు ఇళ్లకే పరిమితమైనారు. అయితే ఈద్ పండగ నేపథ్యంలో బంద్ పాక్షికంగా నిర్వహించాలిన 60 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీఎస్‌యూ నిర్ణయించింది. అలాగే 11 రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే వెల్లడించింది. అలాగే రాజధాని, సరయిగాట్,కామరుప్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు బ్రహ్మపుత్ర మెయిల్ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికార ప్రతినిధి పేర్కొన్నారు.