ఉగ్రవాద ఉన్మాదానికి ఎస్ పీ బలి
ఉగ్రవాద ఉన్మాదానికి ఎస్ పీ బలి
Published Fri, Jun 6 2014 11:56 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
అస్సాంలో ఉగ్రవాదులు ఒక జిల్లా ఎస్ పీ ని పొట్టనబెట్టుకున్నారు. అస్సాం లోని కార్బిఆంగ్లాంగ్ జిల్లాలోని వేర్పాటువాదులు హామ్రెన్ పోలీస్ జిల్లా ఎస్పీ నిత్యానంద గోస్వామిని జిల్లాలోని రాంథాంగ్ అడవుల్లో చంపేశారు.
ఉగ్రవాదులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల బృందానికి గోస్వామి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో గోస్వామి, ఆయన అంగరక్షకుడు చనిపోయారు. వారి భౌతికకాయాలను శుక్రవారం ఉదయం పోలీసులు జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు.
కార్బి ఆంగ్లాంగ్ జిల్లా స్వయంశాసిత రాష్ట్రం కావాలన్న డిమాండ్ తో కార్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ అన్న ఉగ్రవాద సంస్థ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతూ వస్తోంది. 2010 లో దీని ఏర్పాఉట జరిగింది. ప్రస్తుతం అస్సాంలో ఈ సంస్థను అణచివేసేందుకు ఆపరేషన్స్ నిర్వహిస్తోంది.
అసొంలో 1996 లో తిన్ సుకియా జిల్లా ఎస్ పీని ఉగ్రవాదులు చంపేశారు. ఆ తరువాత ఎస్ పీ స్థాయి అధికారి చనిపోవడం ఇదే తొలిసారి. గతేడాది జార్ఖండ్ లోని పాకుర్ జిల్లా ఎస్పీ అమర్ జిత్ బలిహార్ ను మావోయిస్తులు పొట్టన బెట్టుకున్నారు.
Advertisement