అసోంలో భూకంపం | Moderate quake rocks Assam | Sakshi
Sakshi News home page

అసోంలో భూకంపం

Published Wed, Nov 6 2013 11:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

Moderate quake rocks Assam

అసోంలోని కర్బి అంగల్లాంగ్లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించిందని గౌహతిలోని భారత వాతావరణ కేంద్రం ఉన్నతాధికారులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఈ రోజు ఉదయం 9.46 గంటలకు ఈ భూకంపం చోటు చేసుకుందని తెలిపారు. కొన్ని సెకన్లు పాట్లు భూమి కంపించిందన్నారు.

 

భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్పై 5.5 గా నమోదు అయిందని చెప్పారు. భూకంపం వల్ల తలుపులు, కిటికిలు కొన్ని సెకన్ల పాటు గట్టిగా కదిలాయని పేర్కొన్నారు. అయితే భూకంప ఘటన వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం సంభవించినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement