న్యూఢిల్లీ: అవితినీకి పాల్పడితే గొంతు కోస్తానంటూ కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని ఆర్రా స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సింగ్ శనివారం తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఏ కాంట్రాక్టరైనా అవినీతికి పాల్పడితే అలాంటివారి గొంతుకోసి, కేసు పెట్టి, జైలుకు పంపిస్తా’ అని హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment