rajkumar singh
-
స్టాండింగ్ కమిటీకి ‘విద్యుత్’ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి వీలు కల్పించే వివాదాస్పద విద్యుత్ సవరణ బిల్లు–2022ను విస్తృత సంప్రదింపుల కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. రైతు వ్యతిరేక బిల్లు అన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చుతూనే బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ లోక్‌సభలో ప్రకటించారు. సోమవారం ముందుగా లోక్‌సభలో విపక్ష పార్టీల తీవ్ర వ్యతిరేకత మధ్య ఈ బిల్లును సింగ్ ప్రవేశపెట్టారు. దీనిని విపక్షాలు వ్యతిరేకించాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుధ్ధం: అధిర్ రంజన్ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. బిల్లుతో కేంద్ర పెత్తనం పెరిగి రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతోంది. తెలంగాణ, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌తో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ బిల్లును ఉపసంహరించుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)కు కేంద్రప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడేమో మాట తప్పి బిల్లును ప్రవేశపెట్టారు’ అని అ«ధిర్ రంజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి సింగ్ ‘రైతులకు ఉచిత విద్యుత్ ఇకపైనా కొనసాగుతుంది. ఈ బిల్లు రైతు సంక్షేమ, ప్రజాహిత బిల్లు. బిల్లుపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని విద్యుత్ మంత్రి సింగ్ అన్నారు. మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు ఓటింగ్‌కు డిమాండ్ చేశాయి. అయితే స్పీకర్ ఓం బిర్లా సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చుంటే ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. దీంతో పలువురు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వెంటనే బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కోరగా, స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. మూజువాణి ఓటుతో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపేందుకు కేంద్ర మంత్రి అనుమతి కోరగా, స్పీకర్ అనుమతి ఇచ్చారు. దీనికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. విద్యుత్‌రంగ ఉద్యోగుల నిరసన బాట విద్యుత్‌రంగ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమవారం లక్షలాది మంది విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజనీర్లు సోమవారం నిరసన గళం వినిపించారు. దేశంలోని అన్ని విద్యుదుత్పాదక సంస్థల ఉద్యోగులు, ఇంజనీర్లుసహా మొత్తం దాదాపు 27 లక్షల మంది సోమవారం విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారని అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే రాయితీలకు చరమగీతం పాడే, రైతులు, అణగారిన వర్గాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారిన బిల్లులోని అంశాలను వెంటనే తొలగించాలని ఏఐపీఈఎఫ్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే డిమాండ్‌చేశారు. ‘బిల్లులోని నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతి ఇస్తారు. ప్రభుత్వ నెట్‌వర్క్‌ను వాడుకుంటూ కొత్త ప్రైవేట్ సంస్థ లాభాలు తెచ్చే వాణిజ్య వినియోగదారులు, పరిశ్రమలకే విద్యుత్ అందించే ప్రమాదముంది. మొండి బకాయిలుగా మారే ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ఇవ్వాలా వద్దా అనేది వారి ఇష్టం. ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం అందరికీ సరఫరా చేయాల్సిందే. దీంతో ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నష్టాలపాలవుతాయి’ అని దూబే అన్నారు. -
5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూలమైన హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని 2030 నాటికి 5 మిలియన్ టన్నుల స్థాయికి పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందుకోసం ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్ పంపిణీపై పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర చార్జీల నుంచి మినహాయింపు లభించనుంది. జాతీయ హైడ్రోజన్ విధానం తొలి భాగాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. కొత్త విధానాన్ని వివరించేందుకు త్వరలో పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. హరిత హైడ్రోజన్, అమోనియాల వినియోగం పెరిగితే పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. సాధారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ కోసం చమురు రిఫైనరీలు మొదలు, ఉక్కు ప్లాంట్ల వరకూ చాలా సంస్థలకు హైడ్రోజన్ అవసరమవుతుంది. ప్రస్తుతం సహజ వాయువు లేదా నాఫ్తా వంటి శిలాజ ఇంధనాల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు వెలువడి కాలుష్య కారకంగా మారుతున్నందున పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి హరిత హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగానే తాజా విధానాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. రెండో విడతలో దశలవారీగా ప్లాంట్లు హరిత హైడ్రోజన్, హరిత అమోనియా వినియోగించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా ప్లాంటు..: కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం.. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను కంపెనీలు దేశంలో ఎక్కడైనా సొంతంగానైనా లేదా డెవలపర్ ద్వారానైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్సే్చంజీల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ విద్యుత్‌ను హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్లాంటు వరకు ట్రాన్స్మిషన్ గ్రిడ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేయవచ్చు. ఇందుకోసం పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర చార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. 2025 జూన్ 30 లోగా ఏర్పాటైన ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. అలాగే వినియోగించుకోని పునరుత్పాదక విద్యుత్‌ను గ్రీన్ హైడ్రోజన్, అమోనియా తయారీదారులు.. 30 రోజుల పాటు పంపిణీ సంస్థ వద్దే అట్టే పెట్టుకుని, అవసరమైనప్పుడు తిరిగి పొందవచ్చు. -
ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు
సాక్షి, అనంతపురం: బీసీసీఐ దేశవాళీ అండర్–19 టోర్నీ (కూచ్ బెహర్ ట్రోఫీ)లో అరుదైన ఘనత నమోదైంది. మణిపూర్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ రెక్స్ రాజ్‌కుమార్ సింగ్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇక్కడి ఆర్డీటీ మైదానంలో అరుణాచల్‌ప్రదేశ్‌తో బుధవారం ముగిసిన మ్యాచ్‌లో రెక్స్ ఈ రికార్డు సాధించాడు. 9.5 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చిన రెక్స్ 10 వికెట్లు తీశాడు. వీటిలో 6 మెయిడెన్లు ఉన్నాయి. అతని ధాటికి అరుణాచల్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కూడా కూడా రెక్స్ 5 వికెట్లు పడగొట్టడంతో ప్రత్యర్థి ఇన్నింగ్స్ 138కే ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 122కే ఆలౌటై 16 పరుగుల ఆధిక్యం కోల్పోయిన మణిపూర్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసి విజయాన్నందుకుంది. -
అవినీతి కాంట్రాక్టర్ల గొంతు కోస్తా!
న్యూఢిల్లీ: అవితినీకి పాల్పడితే గొంతు కోస్తానంటూ కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని ఆర్రా స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సింగ్ శనివారం తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఏ కాంట్రాక్టరైనా అవినీతికి పాల్పడితే అలాంటివారి గొంతుకోసి, కేసు పెట్టి, జైలుకు పంపిస్తా’ అని హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకొచ్చింది. -
చట్టబద్ధత లేని కమిటీల ఆటలు చెల్లవు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చట్టబద్ధత లేని కమిటీల ఆటలు ఇక చెల్లవని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ అన్నారు. ఏలూరులో శనివారం ఏలూరు, అమలాపురం, రాజమండ్రి, బాపట్ల, నరసరావుపేట, మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాల బీజేపీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్గతంగా జరిగిన ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆయన దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 73, 74 రాజ్యాంగ సవరణలను ధిక్కరించిందని, గ్రామాల్లో ప్రముఖులతో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం టీడీపీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలను వేసి ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు. వారు సూచించిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. దీనివల్ల బీజేపీకి దక్కాల్సిన క్రెడిట్ దక్కకుండా పోతోందన్నారు. తాము సూచించిన వారికి సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు. అలాగే అర్హులైన వారికి కూడా రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు నిరాకరిస్తుండడంతో బీజేపీపై ప్రజలకు సానుకూల దృక్పథం రావడం లేదన్నారు. దీనిపై రాజ్‌కుమార్ సింగ్ స్పందిస్తూ ఇకపై జన్మభూమి కమిటీల ప్రాబల్యాన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ బీజేపీని సొంతంగా బలపడేలా స్థానిక నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ కేంద్ర నాయకత్వం ఆశయాల మేరకు క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు మౌలిక వసతులు సమీకరించుకోవాలని, కార్యకర్తలను మరింతగా పెంచుకోవడానికి నాయకులు కృషి చేయాలని, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ పార్టీని బూత్‌ల వారీగా బలోపేతం చేయాలని, కేవలం పనిచేసే వారితోనే బూత్ కమిటీలు నిర్మాణం జరిగితే పార్టీకి ప్రయోజనముంటుందని పేర్కొన్నారు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మాట్లాడుతూ 6 నియోజకవర్గాల ఇన్చార్జ్గా ఉన్న ఆర్కే సింగ్ ప్రతీ నెలలో కనీసం రెండు నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తే పార్టీ మరింత బలపడే అవకాశముందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ బ్యాంకర్లు అర్హులకు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, తాను చెప్పినా వారు అంగీకరించకపోవడం బాధిస్తోందన్నారు. దీనిపై రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించి బ్యాంకర్లకు తగిన ఆదేశాలు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వై మాలకొండయ్య, కృష్ణాజిల్లా అధ్యక్షుడు సీహెచ్ కుమరస్వామి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకట్రావు, ప్రకాశం జిల్లా నేత పీవీ.కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర మీడియా కో–ఆర్డినేటర్ తురగా నాగభూషణం, ఏలూరు నగర అధ్యక్షుడు నాగం శివ, పలువురు జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. పార్టీలో చేరికలు.. నగరానికి చెందిన వ్యాపారవేత్త శీర్ల భాస్కరరావు కేంద్ర మంత్రి సమక్షంలో 300 మంది అనుచరులు, ముస్లిం మహిళలతో పార్టీలో చేరారు. వారికి కేంద్ర మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ నంది బాలసత్యనారాయణ పార్టీలో చేరారు. వందలాది మంది బీజేవైయం నాయకులతో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. -
పోర్న్ వీడియోలు చూపించి రేప్.. ఆపై హత్య
-
పోర్న్ వీడియోలు చూపించి రేప్.. ఆపై హత్య
గోవా పెర్ఫ్యూమర్ మోనికా ఘర్డే హత్యకేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాజ్‌కుమార్ సింగ్ ఆమెకు ముందుగా ఫోన్లో మూడు పోర్న్ వీడియో క్లిప్స్ చూపించి, ఆపై అత్యాచారం చేసి హతమార్చినట్లు గోవా పోలీసులు వెల్లడించారు. ఇంతకుముందు భావించినట్లుగా ఇది ఏదో అనుకోకుండా చేసిన హత్య కాదని.. ముందుగానే అతడు ప్లాన్ చేసుకుని మరీ హతమార్చాడని గోవా డీఐజీ విమల్ గుప్తా తెలిపారు. ఆరోజు జరిగిన పరిణామాలను ఆయన మీడియాకు వెల్లడించారు. సెక్యూరిటీ సూపర్వైజర్గా నటించి అక్కడకు వచ్చిన రాజ్‌కుమార్ సింగ్ తలుపు తట్టాడు. మోనిక తలుపు తీయగానే బలవంతంగా లోనికి వచ్చి ఆమెను కత్తితో బెదిరించాడు. ఆమె అరిచేలోపే ఆమె నోరు నొక్కేసి.. బాత్రూంలోకి తీసుకెళ్లాడు. దాంతో ఆమె తీవ్రంగా భయపడి దాదాపుగా సగం స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెను మంచం మీద పడుకోబెట్టి రెండు చేతులు, కాళ్లు కట్టేశాడు. ఆమె ఏమీ చేయలేదని నిర్ధారించుకున్న తర్వాత డబ్బులు డిమాండ్ చేశౄడు. పర్సులో 4వేలు ఉండటంతో అవి తీసుకొమ్మని ఆమె చెప్పింది. అది చాలదని, మరింత ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తన ఏటీఎం కార్డు తీసుకొమ్మని చెప్పడంతో పాటు పిన్ నెంబరు కూడా చెప్పేసింది. తర్వాత ఆమె సెల్‌ఫోన్ లాక్కుని, దాని పాస్వర్డ్ అడిగాడు. ఫోన్ తెరిచిన తర్వాత ఆమెకు బలవంతంగా మూడు పోర్న్ వీడియో క్లిప్స్ చూపించాడని డీఐజీ వెల్లడించారు. తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడన్నారు. ఆ తర్వాత తాను ఆమెకు బాగా తెలుసు కాబట్టి పోలీసులకు ఫిర్యాదుచేస్తుందన్న భయంతో ఆమె పీక పిసికి, దిండుతో ఆమె ముఖం మీద కూడా నొక్కి చంపేసినట్లు గుప్తా తెలిపారు. మొట్టమొదటిసారిగా జూన్ 7వ తేదీన ఈ అపార్టుమెంటులో ఏవైనా ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయా అని అడిగేందుకు మోనికా ఘర్డే అక్కడకు వచ్చారని, అప్పుడు ఆమెకు ఫ్లాట్ల వివరాలు చెప్పేటప్పుడే ఆమె పట్ల రాజ్‌కుమార్ సింగ్ ఆకర్షితుడయ్యాడని చెప్పారు. అప్పటినుంచి ఆమెను జాగ్రత్తగా గమనిస్తూ.. ఒక్కరే ఉంటున్నట్లు తెలుసుకున్నాడన్నారు. తన కారు కడిగేందుకు మోనిక అతడిని నియమించినప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం పెంచాడు. అప్పటినుంచి ఆమె ఫ్లాట్‌లో అణువణువూ అతడికి తెలుసన్నారు. జూలై 22న అతడిపై మోనిక సహా పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో అతడిని ఉద్యోగం నుంచి తీసేశారు. దాంతోపాటు రెండు నెలల జీతం కూడా ఇవ్వలేదు. ఆమె కారణంగానే ఇదంతా జరిగిందని కక్ష పెంచుకుని.. ఆమె పట్ల వ్యామోహం, కక్ష రెండింటితో ఇలా చేశాడని పోలీసులు వివరించారు.