ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు  | Rajkumar Singh a sensation single innings of 10 wickets | Sakshi
Sakshi News home page

ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు 

Published Thu, Dec 13 2018 12:51 AM | Last Updated on Thu, Dec 13 2018 1:03 AM

Rajkumar Singh a sensation single innings of 10 wickets - Sakshi

సాక్షి, అనంతపురం: బీసీసీఐ దేశవాళీ అండర్‌–19 టోర్నీ (కూచ్‌ బెహర్‌ ట్రోఫీ)లో అరుదైన ఘనత నమోదైంది. మణిపూర్‌ లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ రెక్స్‌ రాజ్‌కుమార్‌ సింగ్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇక్కడి ఆర్డీటీ మైదానంలో అరుణాచల్‌ప్రదేశ్‌తో బుధవారం ముగిసిన మ్యాచ్‌లో రెక్స్‌ ఈ రికార్డు సాధించాడు. 9.5 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చిన రెక్స్‌ 10 వికెట్లు తీశాడు.

వీటిలో 6 మెయిడెన్లు ఉన్నాయి. అతని ధాటికి అరుణాచల్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కూడా కూడా రెక్స్‌ 5 వికెట్లు పడగొట్టడంతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ 138కే ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 122కే ఆలౌటై 16 పరుగుల ఆధిక్యం కోల్పోయిన మణిపూర్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 55 పరుగులు చేసి విజయాన్నందుకుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement