చికిత్స పొందుతున్న వేణుగోపాల్‌రెడ్డి
చీమకుర్తి రూరల్: స్థానిక బస్టాండ్‌లో శుక్రవారం సాయంత్రం ఆటో డ్రైవర్ వి. వేణుగోపాల్‌రెడ్డి బ్లేడుతో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేణుగోపాల్‌రెడ్డి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే విధంగా ఆటోను నిలబెట్టాడు. ఇలాంటి ఆటోలను పోలీస్ స్టేషన్‌కు తీసుకురమ్మని పోలీసులు హెచ్చరించారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి ఆటోను పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకుపోయాడు. అయితే అతను మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించి డ్రంక్ అండ్ డ్రైవ్ కింద నమోదు చేశారు. అయితే పోలీసులు వేధింపులు ఎక్కువయ్యాయని, పెనాల్టీలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో మనస్తాపం చెందిన వేణుగోపాల్ రెడ్డి బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు చీమకుర్తిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకుపోయి చికిత్స చేయించటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
గతంలో కేసులున్నాయి..
తాళ్లూరు మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి ప్రతిరోజూ చీమకుర్తి, ఒంగోలుకు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. 2013లో చీమకుర్తి పోలీస్ స్టేషన్లో వాహనాల దొంగతనం ఘటనలో రెండు కేసులు ఉన్నట్లు ఎస్సై జీవీ చౌదరి తెలిపారు. గతంలో ఒంగోలులో కూడా ఓ ప్రమాదానికి కారణంగా నిలిచాడని పోలీసులు తెలిపారు. డ్రైవింగ్‌లో సరైన అనుభవం లేక ప్రమాదాలకు గురికావడం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి
రాచర్ల: నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గురువారం రాత్రి జరిగింది. ఈ సంఘటనలో గుమ్ముళ్ల రమణకు గొంతుపై తీవ్ర గాయాలయ్యాయి. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన గుమ్ముళ్ల రమణ అనే వ్యక్తి గొర్రెల పాక వద్ద నిద్రిస్తుండగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో అదే కాలనీకి చెందిన మండాది ఓబులేసు అనే వ్యక్తి పాత కక్షలు మనసులో పెట్టుకుని రమణ గొంతుపై కత్తితో కోశాడు. దీంతో రమణకు తీవ్ర గాయమైంది. నిద్ర నుంచి తేరుకునేలోగా ఓబులేసు అక్కడ నుంచి పరారయ్యాడు. కత్తి గాయానికి గురైన రమణయ్యను కుటుంబ సభ్యులు గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment