భార్య గొంతు కోసి పరారైన భర్త
Published Sun, Mar 19 2017 10:44 AM | Last Updated on Tue, Oct 9 2018 5:03 PM
చిలకలూరిపేట(గుంటూరు): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్య గొంతుకోసి పరారైన సంఘటన జిల్లాలోని చిలకలూరిపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని కుమ్మరకాలనీకి చెందిన శిఖ వనజాక్షి(40), మాణిక్యరావు దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసైన మాణిక్యరావు మద్యానికి డబ్బివ్వాలని వనజాక్షిని వేధిస్తున్నాడు.
దీనికి ఆమె నిరాకరించడంతో.. ఆమె నిద్రిస్తున్న సమయంలో కొడవలితో ఆమె గొంతు కోసి, అనంతరం కూరగాయలు కోసే కత్తితో ఆమై పై దాడి చేసి చచ్చిందో లేదో నిర్ధరించుకోవడానికి ఆమె ముఖంపై దిండు వేసి హత్యచేశాడు. ఇది గుర్తించిన ఆమె చిన్న కూతురు తండ్రిని అడ్డుకోబోగా.. చేతిలో ఉన్న కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement