
ఢాకా: బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. గత ఏడాది(2024) జూలై-ఆగస్టులలో బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చెలరేగిన సమయంలో జైళ్ల నుంచి తప్పించుకున్న దాదాపు 700 మంది ఖైదీలు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం గతంలో వివిధ జైళ్ల నుంచి పరారైన ఖైదీలకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. సుమారు 700 మంది ఖైదీలు జైళ్ల నుంచి పరారయ్యారని బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి ఢాకాలో విలేకరులకు తెలిపారు. వారిని వెదికి పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
దేశంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్న వారి వివరాలను పూర్తిగా వెల్లడించకుండానే.. ఈ తరహా ఖైదీలలో కొందరిని అరెస్ట్ చేశామని, మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. గత ఏడాది ఆగస్టు ఐదు తర్వాత సాధారణ క్షమాభిక్ష కింద ఏ దోషి కూడా జైలు నుండి విడుదల కాలేదని అన్నారు. అయితే బెయిల్‌పై విడుదలైన వారు ఏదైనా నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే, వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా దాదాపు 700 మంది ఖైదీలు, దోషులుగా తేలిన ఇస్లామిక్ ఉగ్రవాదులు, మరణశిక్ష పడిన ఖైదీలు పరారీలో ఉన్నారని గతంలో బంగ్లాదేశ్ జైలు అధికారులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్ మీడియాలో చక్కర్లు
Comments
Please login to add a commentAdd a comment