prisioners
-
పరారీకి యత్నం.. 129 మంది ఖైదీలు మృతి
కిన్సాసా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో విషాద ఘటన జరిగింది. జైలులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి 129 మంది ఖైదీలు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగో అంతర్గత వ్యవహారాల మంత్రి షబానిలుకో మంగళవారం(సెప్టెంబర్3) ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.ఖైదీల్లో 24 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. మకాల జైలు నుంచి తప్పించుకొనేందుకు ఖైదీలు ప్రయత్నించారని, దీంతో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో జైలులో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. తొక్కిసలాటకు తోడు జైలు కిచెన్‌లో చెలరేగిన మంటల్లో మొత్తం 129 మంది మరణించారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని.. తప్పించుకొనేందుకు ప్రయత్నించినవారు మరణించారని జైలు అధికారులు చెప్పారు. జైలు నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. -
ఖైదీలకు తాత్కాలిక బెయిల్!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో పరిస్థితులు, మధ్యంతర బెయిల్‌పై ఖైదీల విడుదల తదితర అంశాలపై చర్చించేందుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ (లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్), జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి (హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్), హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, జైళ్ల శాఖ డీజీ మహ్మద్ అసన్ రెజాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమావేశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన ఈ కమిటీ పలు తీర్మానాలు చేసింది. ప్రాథమికంగా 90 రోజుల పాటు.. ఏడేళ్లు అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసే సమయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా డీజీపీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి సూచనలు ఇవ్వాలి. జిల్లా జడ్జీలంతా ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని మేజిస్ట్రేట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లకు సూచనలు చేయాలి. గత ఏడాది కమిటీ తీర్మానాల మేరకు మధ్యంతర బెయిల్‌పై విడుదలై తిరిగి జైలుకు చేరిన ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలి. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో జైల్లో ఉన్న అర్హులైన ఖైదీలను, అండర్ ట్రయిల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలి. విడుదలైన తరువాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటామని వారు హామీ ఇవ్వాలి. దీన్ని ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేసి కస్టడీలోకి తీసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో సొంత ప్రాంతాలకు చేరుకునేలా హోంశాఖ, జైళ్ల శాఖ తగిన రవాణా సదుపాయం కల్పించాలి. ప్రాథమికంగా మధ్యంతర బెయిల్ 90 రోజులకు మంజూరు చేయాలి. బెయిల్ బాండ్ల మొత్తం సమంజసంగా ఉండాలి. వెబ్సైట్లో వివరాలుంచాలి.. దీనికి సంబంధించి హైకోర్టులో ఓ బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రార్ జనరల్ తీర్మానాల కాపీని ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలి. ఈ మొత్తం వ్యవహారంపై సుమోటో పిటిషన్‌ను సిద్ధం చేయాలి. రాష్ట్రంలో జైళ్ల సామర్థ్యం, ఎంత మంది ఖైదీలున్నారన్న విషయాలను జైళ్ల శాఖ వెబ్సైట్లో పొందుపరచాలి. ఈ వివరాలను ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీతో పంచుకోవాలి. ఉన్నత స్థాయి కమిటీ గత ఏడాది చేసిన అన్ని తీర్మానాలను లీగల్ సర్వీసెస్ అథారిటీ, హోంశాఖ, హైకోర్టు వెబ్సైట్లలో పొందుపరచాలి. జైళ్లలో వేగంగా వ్యాక్సినేషన్ ఖైదీలు, సిబ్బంది విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, వైద్య సాయం, రోజూ శానిటేషన్ తదితర వివరాలను ఉన్నత స్థాయి కమిటీకి జైళ్ల శాఖ వివరించింది. ఇప్పటి వరకు 643 మంది ఖైదీలు, సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు జైళ్ల శాఖ డీజీ వివరించారు. మిగిలిన 6 వేల మంది ఖైదీలు, సిబ్బందికి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 27న మరోసారి సమావేశం కావాలని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. -
1600మంది ఖైదీలకు విముక్తి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంజీ రామచంద్రన్, జయలలితల జయంతి సందర్భంగా తమిళనాడు జైళ్లలోని 1,600 మంది యావజ్జీవ ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించనున్నది. ఎంజీఆర్ జయంత్యుత్సవాలను ఈనెల 17వ తేదీన, వచ్చే నెల 25న జయలలిత జయంతిని నిర్వహించనున్నారు. ఈ సందర్భాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో పదేళ్లకుపైగా యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అన్ని జైళ్లలోని జాబితాను కలుపుకుంటే 1,900 మంది ఖైదీల విడుదలకు జైళ్లశాఖ నుంచి సిఫార్సులు అందాయి. వీరిలో 1,600 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
జైల్లో మద్యం లభ్యం
చర్లపల్లి సెంట్రల్ జైల్లో మధ్యం లభ్యమైంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ ఖైదీ వద్ద మద్యం బాటిళ్లను కనుగొన్నారు. రమేశ్ అనేఖైదీ వద్ద ఉన్న మూడు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. పటిష్టమైన భద్రతా వలయం దాటుకుని మ్యదం లోపలకి ఎలా వచ్చిందనే అంశంపై జైలు అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ హెడ్ వార్డర్ సహకారంతోనే మధ్యం జైల్లోకి వచ్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
పోలీసుల కళ్లు గప్పి ఖైదీలు పరారీ
ప్రకాశం(గిద్దలూరు): ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల కేంద్రలో సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు... విజయవాడ సబ్ జైలుకు చెందిన ఇద్దరు ఖైదీలను విచారణ నిమిత్తం అనంతపురం కోర్టులో హాజరు పర్చారు. వీరిని తిరిగి మంగళవారం విజయవాడ జైలుకు తరలిస్తుండగా గిద్దలూరు మండల కేంద్రం సమీపంలో ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు పరారైన వారి కోసం గాలింపు చర్యులు చేపట్టారు. పరారైన ఖైదీలు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వారిగా సమాచారం.