ప్రకాశం(గిద్దలూరు): ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల కేంద్రలో సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు... విజయవాడ సబ్ జైలుకు చెందిన ఇద్దరు ఖైదీలను విచారణ నిమిత్తం అనంతపురం కోర్టులో హాజరు పర్చారు. వీరిని తిరిగి మంగళవారం విజయవాడ జైలుకు తరలిస్తుండగా గిద్దలూరు మండల కేంద్రం సమీపంలో ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు పరారైన వారి కోసం గాలింపు చర్యులు చేపట్టారు. పరారైన ఖైదీలు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వారిగా సమాచారం.