cilakaluripeta
-
అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి
చిలకలూరిపేట: ఆరేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మరోవైపు బాలుడి బంధువులు ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. చిలకలూరిపేట రూరల్ సీఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం గణపవరానికి చెందిన కొండెబోయిన చెన్నయ్యకు సుమారు పదేళ్ల కిందట ముప్పాళ్ల మండలం పాలపాడుకు చెందిన బుచ్చెమ్మతో వివాహం జరిగింది. ఇద్దరు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. చిన్నవాడు కొండెబోయిన అయ్యప్ప (6) ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆడుకునేందుకు ఇంటినుంచి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఇంటికి చేరుకోకపోవడంతో బంధువులతో కలిసి కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించగా ఇంటికి అరకిలోమీటరు దూరంలో తుప్పల్లో విగతజీవిగా పడిఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అక్రమ సంబంధమే కారణమా...! వివాహానికి ముందు నుంచి ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన లక్ష్మణ అనే వ్యక్తితో బుచ్చెమ్మకు పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా భర్త, పిల్లలను వదిలి తనతో వచ్చేయాలని లక్ష్మణ ఫోన్ల ద్వారా బుచ్చెమ్మను వేధిస్తున్నట్లు బంధువులు తెలిపారు. తనతో రానిపక్షంలో పిల్లలను హతమారుస్తానని పలుమార్లు బెదిరించగా బుచ్చెమ్మ నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలుడు అనుమానస్పదస్థితిలో మృతి చెందడం, నోటినుంచి నురగ కారి ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ విషయమై రూరల్‌సీఐ శోభన్‌బాబు మాట్లాడుతూ మృతి చెందిన బాలుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. నోటినుంచి నురగ కారి ఉన్నందున ఏదైన పాముకాటు లేదా విషప్రయోగం అనేది పోస్టుమార్టం అనంతరం తెలిసే అవకాశం ఉందన్నారు. మృతిచెందిన బాలుడి తల్లి బుచ్చెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
భార్య గొంతు కోసి పరారైన భర్త
చిలకలూరిపేట(గుంటూరు): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్య గొంతుకోసి పరారైన సంఘటన జిల్లాలోని చిలకలూరిపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని కుమ్మరకాలనీకి చెందిన శిఖ వనజాక్షి(40), మాణిక్యరావు దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసైన మాణిక్యరావు మద్యానికి డబ్బివ్వాలని వనజాక్షిని వేధిస్తున్నాడు. దీనికి ఆమె నిరాకరించడంతో.. ఆమె నిద్రిస్తున్న సమయంలో కొడవలితో ఆమె గొంతు కోసి, అనంతరం కూరగాయలు కోసే కత్తితో ఆమై పై దాడి చేసి చచ్చిందో లేదో నిర్ధరించుకోవడానికి ఆమె ముఖంపై దిండు వేసి హత్యచేశాడు. ఇది గుర్తించిన ఆమె చిన్న కూతురు తండ్రిని అడ్డుకోబోగా.. చేతిలో ఉన్న కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టికెట్ ఇస్తారా...లేదా..?
ప్రధానపార్టీలకు ఆశావహుల బెదిరింపులు నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పార్టీ పెద్దలకు కంటి నిండా కునుకు కరవైంది. టికెట్ ఇస్తారా..లేదా..వేరే పార్టీ వాళ్లు పోటీ చేయమని అడుగుతున్నారు..అంటూ ప్రధాన పార్టీల అధినేతలకు బెదిరింపులు మొదలయ్యాయి. ఇలా పట్టణంలోని పలువురు అభ్యర్థులు నామినేషన్‌కు ఒక్కరోజే సమయం ఉండడంతో వేరేపార్టీల వైపు చూస్తున్నారు. కొంతమంది ఆయా పార్టీలు బి.ఫారం ఇవ్వకపోయినా స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నారు. తరువాత ఆయా పార్టీల నుంచి పిలుపు వస్తే టికెట్ ఇస్తే బరిలో ఉండడం లేకపోతే నామినేషన్ ఉపసంహరణ సమయంలో ఏదో ఒక బేరానికి రాకపోతారా? అన్న ఆశతో ఉన్నారు. ఇలా రెండు ప్రధాన పార్టీల వద్ద బేరసారాలు నడిపి రెంటికీ చె డిన ఇద్దరు వ్యక్తులు చివరకు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. -న్యూస్‌లైన్,చిలకలూరిపేట -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
యడ్లపాడు, న్యూస్‌లైన్: స్థానిక సినిమాహాలు సమీపంలో శుక్రవారంరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వంకాయలపాడుకు చెందిన షేక్ నాయబ్స్రూల్ (34) మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. కార్పెంటర్ పనిచేసే రసూల్ పదేళ్ల క్రితం చిలకలూరిపేటకు చెందిన యువతితో వివాహమయ్యాక అక్కడే అద్దె ఇంట్లో ఉం టున్నాడు. శుక్రవారం తల్లిదండ్రులను చూసేం దుకు వంకాయలపాడు వచ్చి రాత్రి పది గంటల సమయంలో ద్విచక్రవాహనంపై పేట వెళుతుం డగా.. యడ్లపాడు సినిమాహాలు సమీపంలో జాతీయరహదారి పక్కన ఆగివున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలు కావడంతో రసూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్చార్జి ఎస్ఐ బి.రాధాకృష్ణ సంఘటన స్థలంలో వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆస్పత్రికివెళ్లి రసూల్ మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. పోస్టుమార్టం నిర్వహిం చిన అనంతరం రసూల్ మృతదేహాన్ని వంకాయలపాడు తీసుకురావడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామ సర్పంచి విప్పర్ల సుమ రసూల్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.