రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Published Sun, Oct 20 2013 1:59 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
యడ్లపాడు, న్యూస్‌లైన్: స్థానిక సినిమాహాలు సమీపంలో శుక్రవారంరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వంకాయలపాడుకు చెందిన షేక్ నాయబ్స్రూల్ (34) మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. కార్పెంటర్ పనిచేసే రసూల్ పదేళ్ల క్రితం చిలకలూరిపేటకు చెందిన యువతితో వివాహమయ్యాక అక్కడే అద్దె ఇంట్లో ఉం టున్నాడు. శుక్రవారం తల్లిదండ్రులను చూసేం దుకు వంకాయలపాడు వచ్చి రాత్రి పది గంటల సమయంలో ద్విచక్రవాహనంపై పేట వెళుతుం డగా.. యడ్లపాడు సినిమాహాలు సమీపంలో జాతీయరహదారి పక్కన ఆగివున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టాడు.
తలకు బలమైన గాయాలు కావడంతో రసూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్‌చార్జి ఎస్‌ఐ బి.రాధాకృష్ణ సంఘటన స్థలంలో వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆస్పత్రికివెళ్లి రసూల్ మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. పోస్టుమార్టం నిర్వహిం చిన అనంతరం రసూల్ మృతదేహాన్ని వంకాయలపాడు తీసుకురావడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామ సర్పంచి విప్పర్ల సుమ రసూల్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Advertisement
Advertisement