
బొలివియా: బొలివియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 37 మంది ప్రయాణీకులు మృతిచెందారు. అలాగే, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై బొలివియా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బొలివియాలోని ఉయుని సమీపంలో బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 37 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. అయితే, లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఉత్సావాల్లో ఒకటైన ప్రఖాత ఒరురో కార్నివాల్‌కు బస్సులు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, సహాయక బృందం చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో డ్రైవర్లు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఒక బస్సు డ్రైవర్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వీరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు.
Dos autobuses chocaron en Bolivia y dejaron al menos 37 muertos y decenas de heridos. El incidente ocurrió en horas de la madrugada de hoy, en una ruta en la región andina de Uyuni. pic.twitter.com/DkMSqx7562
— Chikistrakiz (@chikistrakiz) March 1, 2025