
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో తల్లికూతురు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాలు.. అడవితక్కెళ్లపాడులోని రాజీవ్‌గృహకల్పకు చెందిన విజమూరి నాగమణి(45), కుమార్తె శరణ్య(14) రాజీవ్‌గాంధీ కాలనీలోని తమ బంధువులకు పూలను ఇచ్చేందుకు ద్విచక్ర వాహనంపై ఇచ్చేందుకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.
అమరావతి రోడ్డులోని చిల్లీస్ సెంటర్ వద్ద లాడ్జి సెంటర్ నుంచి అమరావతి వెళ్తున్న లారీ మితిమీరిన వేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ ఘటన స్థలంలోనే మృతి చెందారు. నాగమణి భర్త పుల్లయ్య 2014లో అనారోగ్యంతో మృతి చెందటంతో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెకు ఒక కుమారుడు గోపిచంద్, కుమార్తె శరణ్య(14) ఉన్నారు.
గోపిచంద్ బీటెక్ పూర్తి చేసి విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. శరణ్య స్థానికంగా 9వ తరగతి చదువుతోంది. ఘఽటనా స్థలాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్, ఎస్‌ఐ నాగరాజు పరిశీలించారు. మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి మృతుని బంధువులకు అప్పగించారు. ఘటనపై మృతురాలి కొడుకు గోపిచంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment