స్వరూపరాణి మృతదేహం
తూర్పుగోదావరి ,ఏలేశ్వరం: కలకాలం కలిసి ఉంటానని ప్రమాణం చేసి పెళ్లాడిన ఆ భర్త.. కట్టుకున్న భార్యను మూడు నెలలకే కడతేర్చాడు. నిద్రపోతున్న భార్య పీకను కత్తితో కోయడంతో ఆమె అక్కడిక్కడే తనువు చాలించింది. పోలీసుల కథనం ప్రకారం అడ్డతీగల గ్రామానికి చెందిన రొట్టా బాపనయ్య, వరలక్ష్మి దంపతుల కుమారై గ్రంధి స్వరూపరాణి (20)ని వరలక్ష్మి అన్న గ్రంధి అప్పారావు కుమారుడు ఈశ్వరరావుకు ఇచ్చి గత మే నెలలో వివాహం చేశారు. ఇతడు కోళ్ల మాంసం విక్రయిస్తుంటాడు.
పెళ్లయిన దగ్గర నుంచి వారి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో ఆమె వేధింపులు ఎక్కువయ్యాయి. అనేకసార్లు తల్లికి పరిస్థితిని ఆమె చెప్పింది. అయితే తల్లి సర్దిచెబుతూ వచ్చిం ది. సోమవారం తెల్లవారు జామున నిద్రలో ఉన్న ఆమెను భర్త కత్తితో పీక కోశాడు. సమాచారం అందుకున్న సీఐ అద్దంకి శ్రీనివాసరావు, ఎస్సైలు ఏలేశ్వరం, ప్రత్తిపాడు, అన్నవరం ఎం.అప్పలనాయుడు, అశోక్, పార్థసారథి, తహసీల్దార్ రవీంద్రకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాల సేకరించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment