![Bowling Action Became Viral Remember Lagaan Movie Goli Bowling Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/7/Malinga.jpg.webp?itok=3HGV7VtE)
లసిత్ మలింగ నుంచి పాల్ ఆడమ్స్ వరకు చూసుకుంటే వింతైన బౌలింగ్ యాక్షన్‌కు పెట్టింది పేరు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కొత్తలో మలింగ బౌలింగ్ యాక్షన్‌ను క్రీడా ప్రపంచం ఆసక్తికరంగా చూసింది. కానీ అదే మలింగ శ్రీలంక తరపున దిగ్గజ బౌలర్‌గా పేరు పొందాడు. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు 12 ఏళ్ల పాటు సేవలందించిన మలింగ ఆ జట్టు టైటిల్స్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
తాజాగా ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఒక మ్యాచ్‌లో బౌలర్ తన బౌలింగ్ యాక్షన్‌తో మలింగనే మించిపోయాడు. మలింగ ఒక్కడే కాదు టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు జూనియర్ మలింగ.. శ్రీలంక బౌలర్ మతీషా పతీరాణాల బౌలింగ్‌ను కలగలిపి మరీ బౌలింగ్ చేయడం ఆసక్తికరంగా నిలిచింది. లైనప్ తీసుకున్నప్పుడు తన కుడిచేతిని పలుమార్లు తిప్పి బంతిని రిలీజ్ చేయడం.. బ్యాట్స్‌మన్ అతని బౌలింగ్‌కు కన్ప్యూజ్ అయ్యి క్లీన్‌బౌల్డ్ అవ్వడం జరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక 2001లో బాలీవుడ్‌లో వచ్చిన 'లగాన్' చిత్రం గుర్తుంది కదా. ఆ సినిమాలో గోలీ పాత్ర పోషించిన దయా శంకర్ పాండే క్లైమాక్స్‌లో తన గోలీ బౌలింగ్‌తో బ్రిటీషర్లను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న బౌలర్ కూడా అచ్చం అదే తరహాలో బౌలింగ్ చేయడం ఆసక్తిని రేపింది. అది సినిమా కాబట్టి రియాలిటీకి దూరంగా అనిపించింది. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడంతో క్రికెట్ ఫ్యాన్స్ లగాన్‌లోని గోలీ క్రికెటర్‌ను గుర్తుకు తెచ్చాడంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వలేదు.. అక్కడ మాత్రం దుమ్ము రేపాడు!
This puts @alricho21 double twirl to shame. Love it! pic.twitter.com/EHfLvOo9sc
— Charles Dagnall (@CharlesDagnall) June 6, 2022
Comments
Please login to add a commentAdd a comment