bowling action
-
సస్పెన్షన్ వేటు.. బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో ఆడుతూ బిజీగా ఉన్న అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది.ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ కైల్ పిలిప్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కైల్ పిలిప్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్యానెల్ పేర్కొంది. కైల్ పిలిప్‌పై విధించిన నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ''ఆర్టికల్ 6.7 రెగ్యులేషన్స్ ప్రకారం.. కైల్ పిలిప్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానముంది. అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించాం. తన బౌలింగ్‌కు సంబంధించిన రీఅసెస్మెంట్ జరిగేవరకు కైల్ పిలిప్‌పై సస్పెన్షన్ కొనసాగుతుంది'' అని ఐసీసీ ప్యానెల్ తెలిపింది. 2021 నుంచి అమెరికా తరపున ఐదు వన్డేలు ఆడిన కైల్ పిలిప్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో అమెరికా తొలి మ్యాచ్ ఆడింది. మ్యాచ్‌లో యూఎస్ఏ ఓడినప్పటికి కైల్ పిలిప్ మూడు వికెట్లు తీశాడు. కాగా టోర్నీలో హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసిన అమెరికా దాదాపు నిష్క్రమించింది. ఇక తనపై నిషేధం పడడంతో కైల్ పిలిప్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న మేజర్ లీగ్ క్రికెట్(MLC) టోర్నీలో ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు కైల్ పిలిప్ను 10వేల యూస్ డాలర్లకు సొంతం చేసుకుంది. చదవండి: 50 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ బాదిన హైదరాబాదీ కుర్రాడు -
సొంత బోర్డు షాకివ్వడంతో.. ఇబ్బందుల్లో ఇంగ్లండ్ క్రికెటర్
ఇంగ్లండ్ క్రికెటర్ ఆడమ్ లిత్‌కు ఈసీబీ షాక్ ఇచ్చింది. ఇకపై ఈసీబీ పరిధిలో జరిగే ఏ మ్యాచ్‌లోనూ ఆడమ్ లిత్ బౌలింగ్ వేయకుండా అతనిపై నిషేధం విధించింది. అతని బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. జూలై 16న విటాలీటి బ్లాస్ట్‌లో భాగంగా లంకాషైర్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడమ్ లిత్ ఒకే ఓవర్ బౌలింగ్ చేసి 15 పరుగులిచ్చాడు. ఆ మ్యాచ్‌కు ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఉన్న డేవిడ్ మిల్న్స్, నీల్ మాలెండర్లు ఆడమ్ లిత్ బౌలింగ్ యాక్షన్‌పై అభ్యంతరం చెప్పారు. లిత్ యొక్క బౌలింగ్ యాంగిల్లో చేయి 15-డిగ్రీల థ్రెషోల్డ్ మార్క్‌ను అధిగమించినట్లుగా కనిపించిదని పేర్కొన్నారు.అంపైర్ల ఫిర్యాదుతో లాఫ్‌బరో యునివర్సిటీలోని గ్రౌండ్లో ఆడమ్ లిత్ బౌలింగ్‌పై ఈసీబీ అధికారులు అసెస్మెంట్ నిర్వహించారు. బౌలింగ్ యాక్షన్ కాస్త తేడాతా అనిపించడంతో ఈసీబీ రెగ్యులేషన్ టీంకు పంపించారు. వారి నివేదిక వచ్చిన అనంతరం.. మరోసారి బౌలింగ్ రీ-అసెస్మెంట్ నిర్వహించే వరకు ఆడమ్ లిత్ బౌలింగపై నిషేధం కొనసాగుతుంది. దీంతో ప్రస్తుతం హండ్రెడ్ టోర్నమెంట్లో ఆడుతున్న ఆడమ్ లిత్ బౌలింగ్ వేయకూడదని ఉత్తర్వులు వచ్చాయి. కాగా ఆడమ్ లిత్ హండ్రెడ్ టోర్నమెంట్లో నార్తన్ సూపర్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం టోర్నీలో మూడు మ్యాచ్‌లు కలిపి 132 పరుగులు చేసిన ఆడమ్ లిత్ టాప్ స్కోరర్‌గా కొనసాగతున్నాడు. ఇక అంతకముందు యార్క్‌షైర్ తరపున కౌంటీ సీజన్లో పాల్గొన్న ఆడమ్ లిత్ 10 మ్యాచ్‌లు కలిపి 608 పరుగులు చేశాడు. అంంతేకాదు విటాలిటీ బ్లాస్ట్ 2022 టోర్నమెంట్లోనూ ఆడమ్ లిత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 16 మ్యాచ్‌లాడి 177 స్ట్రైక్‌రేట్‌తో 525 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో ఏడు టెస్టులు ఆడిన ఆడమ్ లిత్ 265 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ ఉంది. చదవండి: ఏడుసార్లు గెలిచి చరిత్రకెక్కాడు.. ఈసారి మాత్రం అవమానం! CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా.. -
'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు!
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చాలానే ఉంటాయి. ఆటగాళ్ల తమ చర్యలతో ఒక్కోసారి విపరీతమైన నవ్వు తెప్పిస్తుంటారు. ఇక బౌలర్లయితే తమ బౌలింగ్ యాక్షన్‌తో దృష్టిని మొత్తం తమవైపు తిప్పుకుంటారు. మలింగ, బుమ్రా, పాల్ ఆడమ్స్ ఇలాంటి కోవకే చెందినవారే. తాజాగా విలెజ్ క్రికెట్ లీగ్‌లో స్పిన్ బౌలర్ అయిన జార్జ్ మెక్‌మెనెమీ యూనిక్ బౌలింగ్ యాక్షన్‌తో అదరగొట్టాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలాంటి బౌలింగ్ ఇంతకముందు ఎప్పుడు చూసి ఉండరు. మాములుగా స్పిన్నర్ లేదా ఫాస్ట్ బౌలర్ ఎంతో కొంత లైనఫ్ తీసుకొని బౌలింగ్ చేయడం సహజం. ఇప్పుడు మనం చెప్పుకునే బౌలర్ మాత్రం కాస్త వినూత్న పద్దతిని అనుసరించాడు. క్రీజుకు ముందు నిలబడి పరిగెత్తుకు వచ్చినట్లుగా రెండు చేతులను తిప్పాడు. ఆ తర్వాత కాసేపు ఆగి చేతిలోని బంతిని పెట్టుకొని ముందుకు, వెనక్కి జరిగాడు. అనంతరం బంతిని విసిరాడు. అప్పటికే బౌలింగ్‌తో కన్ఫ్యూజ్ అయిన బ్యాటర్ డిఫెన్స్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అయితే తన బౌలింగ్‌పై జార్జ్ మెక్‌మెనెమీ స్వయంగా స్పందిస్తూ.. ''చూడడానికి మీకు సిల్లీగా అనిపించొచ్చు. ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌ను అయ్యుండొచ్చు. కానీ ఈ క్రికెట్ నా జీవితాన్ని కాపాడింది. మానసిక సమస్యల నుంచి బయటపడేలా చేసిన క్రికెట్‌కు కృతజ్ఞతలు. నా ప్రదర్శన పట్ల మా అమ్మ గర్వంగా ఫీలవుతుంది. లవ్ యూ క్రికెట్'' అంటూ ట్వీట్ చేశాడు. Folks I might be a fool, I might even be the worst cricketer in the world but this sport has saved my life, enriched my mental health and given me a platform to be happy once more and try to make my incredible Mummy proud up in heaven. Cricket I love you. #cricket #CricketTwitter pic.twitter.com/o46qOuAzA5 — George McMenemy🏏 (@McMcMenemy) June 20, 2022 చదవండి: Carlos Braithwaite: 'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్ Michael Rippon: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్ క్రికెటర్ -
మలింగ, బుమ్రాను మించిపోయాడు.. ఎవరీ 'గోలీ' క్రికెటర్!
లసిత్ మలింగ నుంచి పాల్ ఆడమ్స్ వరకు చూసుకుంటే వింతైన బౌలింగ్ యాక్షన్‌కు పెట్టింది పేరు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కొత్తలో మలింగ బౌలింగ్ యాక్షన్‌ను క్రీడా ప్రపంచం ఆసక్తికరంగా చూసింది. కానీ అదే మలింగ శ్రీలంక తరపున దిగ్గజ బౌలర్‌గా పేరు పొందాడు. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు 12 ఏళ్ల పాటు సేవలందించిన మలింగ ఆ జట్టు టైటిల్స్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఒక మ్యాచ్‌లో బౌలర్ తన బౌలింగ్ యాక్షన్‌తో మలింగనే మించిపోయాడు. మలింగ ఒక్కడే కాదు టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు జూనియర్ మలింగ.. శ్రీలంక బౌలర్ మతీషా పతీరాణాల బౌలింగ్‌ను కలగలిపి మరీ బౌలింగ్ చేయడం ఆసక్తికరంగా నిలిచింది. లైనప్ తీసుకున్నప్పుడు తన కుడిచేతిని పలుమార్లు తిప్పి బంతిని రిలీజ్ చేయడం.. బ్యాట్స్‌మన్ అతని బౌలింగ్‌కు కన్ప్యూజ్ అయ్యి క్లీన్‌బౌల్డ్ అవ్వడం జరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక 2001లో బాలీవుడ్లో వచ్చిన 'లగాన్' చిత్రం గుర్తుంది కదా. ఆ సినిమాలో గోలీ పాత్ర పోషించిన దయా శంకర్ పాండే క్లైమాక్స్‌లో తన గోలీ బౌలింగ్‌తో బ్రిటీషర్లను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న బౌలర్ కూడా అచ్చం అదే తరహాలో బౌలింగ్ చేయడం ఆసక్తిని రేపింది. అది సినిమా కాబట్టి రియాలిటీకి దూరంగా అనిపించింది. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడంతో క్రికెట్ ఫ్యాన్స్ లగాన్‌లోని గోలీ క్రికెటర్‌ను గుర్తుకు తెచ్చాడంటూ కామెంట్స్ చేశారు. చదవండి: ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వలేదు.. అక్కడ మాత్రం దుమ్ము రేపాడు! This puts @alricho21 double twirl to shame. Love it! pic.twitter.com/EHfLvOo9sc — Charles Dagnall (@CharlesDagnall) June 6, 2022 -
ఇదేం బౌలింగ్ యాక్షన్రా బాబు.. చూస్తే వావ్ అనాల్సిందే.. వీడియో వైరల్
Womens T20 Challenge: మహిళల టీ20 ఛాలెంజ్‌లో భాగంగా మంగళవారం సూపర్‌నోవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ స్పిన్నర్ సోనావానే ప్రత్యేక బౌలింగ్ యాక్షన్‌తో ఆకట్టుకుంది. సోనావానే డెలివరీ వేసేటప్పడు తన తలను బాగా కిందకు ఉంచి బౌలింగ్ చేస్తుంది. సోనావానే బౌలింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సోనావానే బౌలింగ్ యాక్షన్‌ను మాజీ దక్షిణాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్‌తో అభిమానులు పోల్చుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్‌నోవాస్‌పై 7 వికెట్ల తేడాతో వెలాసిటీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్నోవాస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. నోవాస్ బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక వెలాసిటీ బౌలర్లలో క్రాస్ రెండు వికెట్లు, దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలా వికెట్ సాధించారు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెలాసిటీ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. వెలాసిటీ బ్యాటర్లలో షఫాలీ వర్మ(51),లారా వోల్వార్డ్ట్(51) పరుగులతో రాణించారు. చదవండి: IPL 2022: 'నాకు రాజస్తాన్ ఒక కుటుంబం వంటిది.. వార్న్ సార్ ఆశీస్సులు నాకు ఉన్నాయి' Debut for 23 year old leg spinner from Maharashtra, Maya Sonawane#My11CircleWT20C#WomensT20Challenge2022 pic.twitter.com/IRylJ62EGx — WomensCricCraze🏏( Womens T20 Challenge) (@WomensCricCraze) May 24, 2022 -
తండ్రికి తగ్గ తనయుడు.. అచ్చంగా దించేశాడు
కొలంబొ: ముత్తయ్య మురళీధరన్.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు( అన్ని ఫార్మాట్లు కలిపి 1374 ) తీసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేగాక టెస్టు క్రికెట్లో 800 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా, వన్డేల్లో 534 వికెట్లతో చరిత్రకెక్కిన ఈ లంక స్పిన్ దిగ్గజం మరో దిగ్గజం షేన్ వార్న్‌తో పోటీ పడి వికెట్లు తీశాడు. అయితే అతని బౌలింగ్ యాక్షన్‌పై ఫీల్డ్ అంపైర్లు చాలాసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన మురళీధరన్ బౌలింగ్‌ను 'చక్కర్' అంటూ పిలవడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇలా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా తన వైవిధ్యమైన బౌలింగ్‌తో క్రికెట్లో తన పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. తాజాగా మురళీధరన్ కొడుకు నరేన్ బౌలింగ్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అచ్చం తండ్రి బౌలింగ్ యాక్షన్‌ను దింపిన నరేన్ వీడియో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోనూ స్వయంగా మురళీధరన్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..'' ఇట్స్ ఫాదర్ అండ్ సన్ టైమ్.. వీడియో క్రెడిట్స్ టూ సన్‌రైజర్స్ '' అంటూ కామెంట్ చేశాడు. ఇక మురళీధరన్ లంక తరపున 133 టెస్టుల్లో 800 వికెట్లు, 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. అటు టెస్టులతో పాటు వన్డేల్లోనూ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. Father and Son Time! Video credits @SunRisers pic.twitter.com/Jv8fYOAZcp — Muthiah Muralidaran (@Murali_800) July 15, 2021 -
నిన్న హెల్మెట్‌తో ఫీల్డింగ్.. ఇవాళ భజ్జీలా బౌలింగ్
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్లు తీయడంలో చెమటోడుస్తున్నా.. ఎంటర్టైన్మెంట్లో మాత్రం ముందంజలో ఉంది. రిషబ్ పంత్, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు మైదానంలో ఫన్ క్రియేట్ చేయడంలో ఎప్పుడు ముందుంటారు. తొలిరోజు ఆటలో స్లిప్‌లో హెల్మెట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేసిన రోహిత్ కొత్త ట్రెండ్‌కు తెరతీశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో నవ్వులు పూయించింది. తాజాగా ఎలాగు మెయిన్బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో కోహ్లి బౌలింగ్ చేంజ్కోసం టీ విరామానికి ముందు పార్ట్‌టైమర్ రోహిత్‌తో రెండు ఓవర్లు బౌలింగ్ వేయించాడు. అలా బంతి అందుకున్న రోహిత్‌కు వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తున్న పంత్.. రోహిత్ భయ్యా.. అచ్చం భజ్జీలా బౌలింగ్ చేయ్ అంటూ గట్టిగట్టిగా అరిచాడు. దీనికి రోహిత్ బదులిస్తూ అలాగే సార్ అంటూ చమత్కరించాడు. రెండో ఓవర్ చివరి బంతిని అచ్చం హర్భజన్ శైలిలో ఆఫ్‌స్పిన్ వేయగా..బంతి ఫుల్‌టాస్ పడడంతో జో రూట్ సింగిల్ తీశాడు.అలా పంత్‌కిచ్చిన మాటను రోహిత్ నెరవేర్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... తొలిరోజు ఆటలో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిన ఇంగ్లండ్ రెండో రోజు తన జోరును కొనసాగించింది. ముఖ్యంగా జో రూట్ టీమిండియా పాలిట కొరకరాని కొయ్యగా మారి డబుల్ సెంచరీ సాధించాడు. రూట్‌కు ఆల్‌రౌండర్ స్టోక్స్ జతకలవడంతో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడానికి నానాతంటాలు పడ్డారు. ఇంగ్లండ్ జోరుతో దాదాపు రెండు సెషన్లు ఇప్పటికే తుడిచిపెట్టుకుపోగా మూడో సెషన్లో మాత్రం టీమిండియా మరో మూడు వికెట్లు తీయగలిగింది. 218 పరుగులు చేసిన రూట్ నదీమ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 165 ఓవర్లలో 6 వికెట్లె నష్టానికి 505 పరుగులు భారీ స్కోరు సాధించింది. జాస్ బట్లర్ 22, డొమినిక్ బెస్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: 100వ టెస్టులో డబుల్ సెంచరీ, వాటే బ్యాటింగ్! 'నా పేరు వాషింగ్టన్.. డీసీకి వెళ్లాలనుకుంటున్నా' హెల్మెట్‌తో స్లిప్ ఫీల్డింగ్.. సూపర్ అంటున్న నెటిజన్లు Rohit Sharma's Harbhajan Singh impression is what I'm here for 😂pic.twitter.com/09q0n4zIvv — Arjun (@ArjunNamboo) February 6, 2021 -
ఆరు బంతులు.. ఆరు రకాలుగా
దుబాయ్ : జస్ప్రీత్ బుమ్రా.. వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్‌కు పెట్టింది పేరు. మలింగ తర్వాత యార్కర్ల వేయడంలో బుమ్రా సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్లో సెస్టెంబర్ 19న చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ముంబై ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను తన ట్విటర్లో షేర్ చేసింది. (చదవండి : పంత్.. సిక్సర్ల మోత!) ఈ సందర్భంగా ప్రాక్టీస్ సమయంలో బుమ్రా ఆరు బంతులను ఆరు రకాలుగా సంధించాడు. ఫన్నీ మూమెంట్లో సాగిన ప్రాక్టీస్‌లో బుమ్రా.. ప్రతి బాల్‌ను ఇతర బౌలర్లకు సంబంధించిన యాక్షన్‌ను ఇమిటేట్ చేస్తూ ఆరు బంతులును వేశాడు. బుమ్రా వేసినవాటిలో మాజీ బౌలర్‌తో పాటు ప్రస్తుత బౌలర్లకు సంబంధించిన బౌలింగ్ యాక్షన్స్ ఉన్నాయి. ఈ వీడియోను ముంబై తన ట్విటర్లో షేర్ చేస్తూ.. బుమ్రా వేసిన ఆరు బంతులు ఎవరిని ఇమిటేట్ చేస్తూ సంధించాడో చెప్పగలరా అంటూ క్యాప్షన్ జత చేసింది. ముంబై ఇండియన్స్ షేర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషలల్ మీడియాలో వైరల్‌గా మారింది. 📹 Can you guess all 6️⃣ bowlers Boom is trying to imitate? 🤔 PS: Wait for the bonus round 😉 #OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @Jaspritbumrah93 pic.twitter.com/RMBlzeI6Rw — Mumbai Indians (@mipaltan) September 7, 2020 మునాఫ్ పటేల్, గ్లెన్ మెక్‌గ్రాత్, మిచెల్ స్టార్క్, కేదార్ జాదవ్, శ్రేయాస్ గోపాల్, అనిల్ కుంబ్లే బౌలింగ్ యాక్షన్‌ను బుమ్రా అనుకరించాడంటూ ఎక్కువ మంది అభిమానులు కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం లసిత్ మలింగ, షేన్ వార్న్‌లను ఇమిటేట్ చేసినట్లు పేర్కొన్నారు. బుమ్రా నీలో ఇలాంటి కళలు కూడా ఉన్నాయా అంటూ జోకులు పేల్చారు. మరోవైపు వ్యక్తిగత కారణాల రిత్యా ఐపీఎల్ 2020 నుంచి తప్పుకుంటున్నట్లు యార్కర్ కింగ్, స్టార్ బౌలర్ లసిత్ మలింగ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మలింగ గైర్హాజరీలో బుమ్రా ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్‌లో పెద్దన్న పాత్ర వహించనున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్లో బుమ్రా ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో వేచి చూద్దాం. 2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన బుమ్రా 82 వికెట్లు పడగొట్టాడు. -
ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను: బుమ్రా
టీమిండియా స్టార్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో అతడి బౌలింగ్ యాక్షన్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా అతడి బౌలింగ్ యాక్షన్‌ను చిన్నా పెద్దా అని తేడా లేకుండా అనేకమంది అనుకరించే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన బౌలింగ్‌ను అనుకరించిన 15 నెలల పాపకు పెద్ద ఫ్యాన్ అయ్యానని పేర్కొంటూ బుమ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన కూతురు సమైరాతో సరదాగా ఆడుకుంటున్నారు. ఈ సమయంలో రోహిత్ సతీమణి రితికా బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడని సమైరాను అడిగింది. దీంతో వెంటనే బుమ్రా యాక్షన్‌ను అనకరించడంతో రోహిత్, రితికాలు గట్టిగా నవ్వుకున్నారు. ఈ వీడియోను బుమ్రా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘నా కంటే సమైరానే బాగా చేసిందనుకుంటున్నా. ఆమె నన్ను అభిమానించే కంటే నేనే ఎక్కువగా ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను’అని పేర్కొన్నాడు. ఇక కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీమిండియా ఆటగాళ్లు లైవ్‌చాట్‌లో కలుసుకుంటున్నారు. రోహిత్-బుమ్రా, కోహ్లి-పీటర్సన్లు లైవ్‌చాట్‌లో అనేక విషయాలు ముచ్చటించుకున్న విషయం తెలిసిందే. I think she does it better than me @ImRo45 @ritssajdeh!I can safely say I am a bigger fan of hers than she is of me. 😇 pic.twitter.com/rHP5g52e20 — Jasprit Bumrah (@Jaspritbumrah93) April 3, 2020 చదవండి: ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా? యువీ, భజ్జీ.. సాయం చేయండి: మాజీ క్రికెటర్ -
అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా
-
అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా
ఆక్లాండ్ : టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 26 ఏళ్ల బుమ్రా తన వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్‌తో అన్ని ఫార్మాట్లలో రాణిస్తూ ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో కివీస్‌కు చెందిన ఒక కుర్రాడు అచ్చం బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను దించేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీడియోలో ఆ కుర్రాడు అచ్చం బుమ్రా తరహాలోనే బంతిని పట్టుకొని స్లోరన్అప్తో బౌలింగ్ వేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కివీస్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ కుర్రాడి బౌలింగ్‌ను వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశాడు. తర్వాత ఆ కుర్రాడిని దగ్గరకు పిలిచి అచ్చం బుమ్రాలాగే బౌలింగ్ వేశావంటూ అభినందించాడు. కాగా టీమిండియా ప్రసుత్తం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం రెండో వన్డే ప్రారంభానికి ముందు నెట్స్‌లో బౌలింగ్ సాధన చేస్తున్న బుమ్రా, యుజువేంద్ర చాహల్ వద్దకు కివీస్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ వచ్చి కుర్రాడి బౌలింగ్ వీడియో క్లిప్పింగ్‌ను చూపించాడు.ఆ వీడియో చూసి బుమ్రా నవ్వుకోగా, చాహల్ మాత్రం ' అరె!అచ్చం బుమ్రా బౌలింగ్‌ను దించేశాడు. బుమ్రా కంటే ఈ కుర్రాడి బౌలింగే బాగుంది' అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. -
'బుమ్రా బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం'
ముంబై : టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యమని, అతడు వేసే యార్కర్లు, బౌన్సర్లు తనను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ఆడటం ఎంతో కష్టమని పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం వార్నర్ మాట్లాడుతూ... 'బ్రెట్‌లీ లాంటి బౌలర్ కొంత తడబడుతూ 150 కి.మీ వేగంతో బంతులు వేయడాన్ని నేను ఊహించలేను. అందుకు అలవాటు పడాలంటే కాస్త సమయం అవసరం. బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యం. అతడి బౌన్సర్లు, యార్కర్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. బుమ్రా బౌలింగ్ చేసే సమయంలో అతను తన యాక్షన్‌లో చేసే మార్పు నాకు కష్టంగా అనిపిస్తుంది. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ గంటకు 140 కి.మీ వేగంతో స్వింగ్ చేసినప్పుడు ఎదుర్కొనేందుకు కొంత ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు బుమ్రా విషయంలో కూడా అలాగే ఇబ్బందులకు గురవుతున్నా. అయితే క్రీజులో నిలదొక్కుకోవడంతోనే పరుగులు చేశా' అని తెలిపాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే మైదానంలో టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ భారత జట్టుపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వార్నర్ (112 బంతుల్లో 128 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 110 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో ఆసీస్ వికెట్ కోల్పోకుండా సునాయాస విజయాన్ని అందుకుంది. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం రాజ్‌కోట్‌లో జరగనుంది. (వార్నర్ సరికొత్త రికార్డు) (బుమ్రాను హిట్ చేశా.. కానీ ఔట్ చేశాడు!) -
‘ఆమె మరో హర్భజన్ సింగ్’
హైదరాబాద్: అభిమానులు తమకు నచ్చిన ఆటగాళ్లను, నటీనటులను అనుకరించడడం సర్వసాధారణం. వారిలా నటించడం, డైలాగ్‌లు చెప్పడం, డ్యాన్స్‌లు చేయడం అభిమానులకు పరిపాటిగా మారింది. అయితే ఈ మధ్యకాలంలో క్రికెటర్ల శైలిని అనుకరిస్తూ వారిలా బ్యాటింగ్/బౌలింగ్ చేసుందకు కొంత మంది అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. గతంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ బుడ్డోడు జస్ప్రిత్ బుమ్రాలా బౌలింగ్ చేయడం.. శ్రీలంకకు చెందిన యువ ఆటగాడు లసిత్ మలింగా శైలిలో బౌలింగ్ చేయడం చూశాం. తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ శైలిని అనుకరిస్తూ ఓ అభిమాని బౌలింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆయితే ఆ అభిమాని ఓ బాలిక కావడం విశేషం. హర్భజన్ సింగ్ శైలితో పాటు జస్ప్రిత్ బుమ్రా యాక్షన్ ఆ బాలిక బౌలింగ్‌లో మేళవింపై ఉన్నాయి. అయితే ఈ వీడియోను టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన ట్విటర్లో పోస్ట్ చేయడం మరో విశేషం. ‘ఈమెను చూస్తేంటే నిన్నే(హర్భజన్ సింగ్) ఆదర్శంగా తీసుకున్నట్టుంది. భవిష్యత్‌లో దేశానికి మరో నాణ్యమైన స్పిన్నర్ దొరికే అవకాశం ఉంది’ అంటూ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం చోప్రా షేర్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘ఆమె మరో హర్భజన్ సింగ్’అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక హర్భజన్, ఆకాశ్ చోప్రాలిద్దరూ క్రికెట్ వ్యాఖ్యాతలుగా వ్యవహిరస్తున్న విషయం తెలిసిందే. భారత్-దక్షిణాఫ్రికా మూడో టెస్టు సందర్భంగా జాంటీ రోడ్స్‌తో హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాంచీ టెస్టులో జాంటీ రోడ్స్ బ్యాటింగ్‌కు దిగితేనైనా దక్షిణాఫ్రికా మెరుగైన స్కోర్ సాధిస్తుంది అంటూ అతడితో భజ్జీ చమత్కరించాడు. అయితే ఈ వ్యాఖ్యలను జాంటీ రోడ్స్ చాలా సరదాగా తీసుకున్నాడు. -
బూమ్ బూమ్ బ్లాస్ట్!
‘ప్రపంచంలో ఎవరు వేగంగా పరుగెత్తగలరో చూద్దాం అంటూ చిరుత, శునకాల మధ్య పందెంకు రంగం సిద్ధమైంది... పోటీ ప్రారంభమైనా చిరుత మాత్రం ఒక్క అడుగు కదపకుండా తన స్థానంలోనే ఉండిపోయింది. దాంతో ప్రేక్షకులు ఏమైందంటూ నిర్వాహకులను అడిగారు. ‘అందరికంటే అత్యుత్తమమని నిరూపించుకునే ప్రయత్నం చేయడం కూడా కొన్నిసార్లు పరువు తక్కువగా భావించాలి’... సరిగ్గా వారం క్రితం జస్ప్రీత్ బుమ్రా ఈ ట్వీట్ చేశాడు. బుమ్రా ఆంతర్యం ఏమిటో స్పష్టంగా అంతు పట్టకపోయినా... కొత్తగా దూసుకొచ్చిన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను ఆకాశానికెత్తడం, అతడితో తనను పోలుస్తుండటంపైనే ఈ ట్వీట్ అని క్రికెట్ ప్రపంచం అర్థాన్ని అన్వయించుకుంది. ఈ ట్వీట్‌తో ‘బుల్స్ ఐ’ ఇమోజీ కూడా జత చేసిన బుమ్రా ఆదివారం సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించాడు. భారత అభిమానులతో సహా అంతా యాషెస్ ఉత్కంఠను అనుభవిస్తున్న సమయంలో తన సత్తా చూపిస్తూ అత్యద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రికార్డులు తిరగరాశాడు. నార్త్ సౌండ్: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్... ఈ నాలుగు దేశాల్లోనే బుమ్రా టెస్టులు ఆడాడు. కానీ నాటి ఇమ్రాన్ ఖాన్ నుంచి నేటి రవిచంద్రన్ అశ్విన్ వరకు ఆసియా దిగ్గజ బౌలర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనతను అతను అందుకున్నాడు. ఈ నాలుగు దేశాల్లోనూ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డును బుమ్రా నెలకొల్పాడు. ఇవన్నీ తన తొలి పర్యటనలే కావడం విశేషం. దీనిని అందుకునేందుకు అతనికి 11 టెస్టులే సరిపోయాయి. వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ అతని విలువేమిటో మరోసారి చూపించింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 75 పరుగుల ఆధిక్యం మాత్రమే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో విజయం కోసం భారత్ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్యం కష్టసాధ్యమే అయినా... సొంతగడ్డపై కొంతయినా పోరాడగలదని అంతా భావించారు. కానీ మరీ ఘోరంగా ఒక సెషన్ లోపు కేవలం 26.5 ఓవర్లు మాత్రమే ఆడి 100 పరుగులకే జట్టు కుప్పకూలింది. ఇదంతా బుమ్రా చలవే! టెస్టుల్లో తొలిసారి బుమ్రాను ఎదుర్కొన్న విండీస్ బ్యాట్స్‌మెన్‌కు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే కథ ముగిసిపోయింది. బుమ్రా ‘మ్యాజిక్ బంతులు’ తమను దెబ్బ తీశాయంటూ ప్రత్యర్థి కెప్టెన్ హోల్డర్ వాపోయాడు. అవుట్ స్వింగర్లతో... బంతి విసిరేందుకు తీసుకునే రనప్ చిన్నదే కావచ్చు... స్పీడ్‌గన్‌లో లెక్క కడితే బంతి వేగం సాధారణంగానే కనిపించవచ్చు. కానీ బుమ్రా వేసే బంతులు అంకెలకు మించి ప్రమాదకరమైనవి. ఒకనాటి అసలు సిసలు ఫాస్ట్ బౌలర్ల ఆలోచనా ధోరణి అతనిలో కనిపిస్తుంది. తాజా టెస్టులో అతను తన బౌలింగ్ దూకుడును చూపించాడు. చాలా మంది తరహాలో ఆఫ్ స్టంప్ బయటకు వేస్తూ కీపర్ లేదా స్లిప్ వైపు క్యాచ్ వచ్చే అవకాశం సృష్టించే ప్రయత్నం చేయలేదు. పూర్తిగా ఆఫ్ స్టంప్స్ లక్ష్యంగానే బంతులు విసిరాడు. అతని ఐదు వికెట్లలో నాలుగు క్లీన్‌బౌల్డ్‌లు ఉన్నాయంటేనే ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా గతంలో పెద్దగా వాడని ‘అవుట్ స్వింగర్’ను బుమ్రా ప్రయోగించాడు. వరల్డ్ కప్ తర్వాత ఈ సిరీస్‌కు ముందు లభించిన విరామంలో అతను దీనిపై ప్రత్యేక సాధన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ప్రసారకర్త ‘సోనీ’ అంకెల ప్రకారం కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బుమ్రా వేసిన ప్రతీ పది బంతుల్లో ఏడు అవుట్ స్వింగర్లే ఉన్నాయి! వెన్నునొప్పితో తొలి ఇన్నింగ్స్‌లో పూర్తి వేగంతో బౌలింగ్ చేయలేకపోయిన జస్ప్రీత్... రెండో ఇన్నింగ్స్‌లో స్వింగ్‌కు కొంత అనుకూలంగా కనిపించిన వాతావరణాన్ని పూర్తిగా వాడుకున్నాడు. 8–4–7–5 బుమ్రా వేసిన 48 బంతులు విండీస్ బ్యాట్స్‌మెన్ పాలిట బుల్లెట్లలా మారాయి. అతని తొలి ఓవర్ మూడో బంతిని వెంటాడి బ్రాత్‌వైట్ ఔట్ కావడంతో విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా తర్వాతి ఓవర్లో దూసుకొచ్చిన బంతి క్యాంప్‌బెల్ స్టంప్స్‌ను పడగొట్టింది. మరుసటి ఓవర్లో స్లిప్‌లో కోహ్లి క్యాచ్ వదిలేయకపోతే మరో వికెట్ అప్పుడే దక్కేది. కానీ అతని నాలుగో ఓవర్లో హైలైట్ బంతి వచ్చింది. అద్భుతమైన స్వింగ్‌కు బ్రేవో ఆఫ్ స్టంప్ ఎగిరి ‘బండి చక్రం’లా గిరగిరా తిరిగింది! తొలి ఐదు ఓవర్లలో విండీస్ బ్యాట్స్‌మెన్ చచ్చీ చెడి ఏడు సింగిల్స్ తీయగలిగారు. కానీ కథ అంతటితో ముగియలేదు. బుమ్రా ఆరో ఓవర్ తొలి బంతికి హోప్ స్టంప్ బద్దలైంది. ఎంతో కొంత పోరాడగలడని భావించిన హోల్డర్‌కు కూడా బుమ్రా బంతి అర్థం కాలేదు. ఫలితం మరో సారి ఆఫ్‌స్టంప్‌పై ఎర్రబంతి దాడి! ఇక విరామం అంటూ కోహ్లి 8 ఓవర్ల స్పెల్ తర్వాత ఆపడంతో ఈ తుఫాన్ ఆగింది. మరో అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ఫాస్ట్ బౌలర్ల గడ్డపై తొలి టెస్టును సంతృప్తిగా ముగించాడు. 5/7ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టిన సందర్భంలో అతి తక్కువ పరుగులు ఇచ్చిన భారత్ బౌలర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. 1990లో వెంకటపతిరాజు 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. 4 బుమ్రా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది నాలుగోసారి కాగా నాలుగు వేర్వేరు జట్లపైనే సాధించాడు. గతంలో ఇన్స్వింగర్లు ఎక్కువగా వేసేవాడిని. అయితే అనుభవం వస్తున్న కొద్దీ అవుట్ స్వింగర్లు కూడా బాగా వేయగలననే విశ్వాసం పెరిగింది. తాజా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉంది. అయితే ఇలాంటి బంతుల కోసం చాలా కష్టపడ్డాను. ఇంకా నేర్చుకోవాలనే తపనతో ఉన్నాను. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉండటంతో ఏదైనా భిన్నంగా ప్రయత్నించాలని మా పేసర్లు అందరం భావించాం. స్వింగ్‌కు పరిస్థితి కొంత అనుకూలంగా ఉందనిపించడంతో అలా ప్రయత్నించాం –జస్ప్రీత్ బుమ్రా, భారత బౌలర్ -
ఇదేమీ బౌలింగ్ యాక్షన్ రా బాబు!
అప్పుడప్పుడు రవిచంద్రన్ అశ్విన్ వెరైటీ బౌలింగ్ వేసి అలరించడం మనకు తెలిసిందే. తాజాగా ఓ రొమేనియన్ బౌలర్ కూడా తన బౌలింగ్ యాక్షన్‌తో ఇంటర్నెట్లో కితకితలు పంచుతున్నాడు. యూరోపియన్ యూనియన్ టీ10 క్రికెట్ లీగ్‌లో రొమేనియా బౌలర్ పావెల్ ఫ్లోరిన్ తన బౌలింగ్‌తో సోషల్ మీడియా సెన్సేషనల్‌గా మారిపోయాడు. అతడేమీ చండప్రచండంగా బంతులు విసిరి.. బ్యాట్స్‌మెన్‌ను బెదరగొట్టి వికెట్లు తీయలేదు. పరిగెత్తుకొని వచ్చి.. చాలా నెమ్మదిగా మొత్తం గాలిలోకి బంతిని విసిరేస్తున్నాడు ఈ బౌలర్. అసలు బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా.. విచిత్రమైన బౌలింగ్ శైలితో వికెట్లకు దూరంగా ఫుల్‌టాస్ బంతిని విసురుతున్నాడు. అతని బౌలింగ్ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఇదేమీ బౌలింగ్ యాక్షన్రా బాబు అని కామెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇదే బెస్ట్ క్రికెట్ మూమెంట్ అయి ఉంటుందని, ఇతని బౌలింగ్ యాక్షన్ చూస్తే.. కితకితలు ఖాయమని నెటిజన్లుఅంటున్నారు. మీరు ఓసారి లుక్కేయండి Ladies and gentlemen ... welcome to the #EuropeanCricketLeague 🤷🤷🤷 pic.twitter.com/ctrhyJvs4b — Fox Cricket (@FoxCricket) July 30, 2019 -
అంబటి రాయుడికి ఐసీసీ ఝలక్!
-
అంబటి రాయుడికి ఐసీసీ ఝలక్!
దుబాయ్ : టీమిండియా క్రికెటర్, హైదరాబాద్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఝలక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో రాయుడు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో రాయుడు ఆఫ్‌స్పిన్ బౌలింగ్ యాక్షన్‌ను ఐసీసీ తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ నివేదికను ఐసీసీ భారత టీమ్ మేనేజ్మెంట్కు అందజేయడంతో పాటు.. అతను 14 రోజుల్లోగా పరీక్షకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. అయితే ఈ పరీక్షకు ఈ హైదరాబాద్ ఆటగాడు హాజరుకాకపోవడంతో నిబంధనల మేరకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో రాయుడు బౌలింగ్ చేయరాదని, దేశవాళీ, బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీల్లో మాత్రం చేయవచ్చని స్పష్టం చేసింది. జనవరి 13లోగా రాయుడు బౌలింగ్ పరీక్షకు హాజరు కావాల్సింది. కానీ న్యూజిలాండ్ పర్యటనతో బీజీగా ఉన్న రాయుడు పరీక్షకు హాజరు కాలేదు. దీంతో ఐసీసీ క్లాజ్ 4.2 నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. అతను పరీక్షకు హాజరై తన బౌలింగ్ యాక్షన్ సరైనదేనని నిరూపించుకునే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఇక పార్ట్‌టైమ్ స్పిన్నర్ రాయుడు తన 46 మ్యాచ్‌ల వన్డే కెరీర్లో 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు దేశవాళీ వన్డేలు, టి20ల్లో అతను ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. సిడ్నీ వన్డేలో 2 ఓవర్లు వేసిన రాయుడు 13 పరుగులిచ్చాడు. -
ఐసీసీపై ఆగ్రహం.. క్రికెటర్‌కు నోటీసులు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనలపై ఆగ్రహం వ్యక్తంచేసినందుకుగానూ వివరణ ఇవ్వాల్సిందిగా శనివారం నోటీసులు జారీచేసింది. బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్.. ఐసీసీ బౌలింగ్ యాక్షన్ నిబంధనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. బౌలింగ్ యాక్షన్ వ్యవహారంలో ఐసీసీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఐసీసీతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న బోర్డు క్రికెటర్లపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరి బౌలర్లకు ఒకే నిబంధనలను అమలు చేయాలని సూచించాడు. అనుమానస్పద బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్న బౌలర్లను పరీక్షించడానికి ఓ విధానాన్ని రూపోందించాలని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు ఐసీసీకి వ్యతిరేకంగా ఉండటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ కోరింది. ఈ నోటీసుల వ్యవహారంపై హాఫిజ్ స్పందిస్తూ.. తాను పీసీబీ అనుమతితోనే ఇంటర్వూలో పాల్గొన్నానని తెలిపాడు. తాను గంటపాటు ఇంటర్వూ ఇస్తే అందులో కేవలం 15 సెకన్ల గురించి మాట్లాడుతున్నారని, మొత్తం ఇంటర్వ్యూ చూసి తను ఏ సందర్భంలో మాట్లాడానో తెలుసుకోవాలన్నాడు. బౌలింగ్ వేసేటప్పుడు మోచేతిని 15 డిగ్రీల వరకు వంచేందుకు ఐసీసీ అనుమతిస్తుంది. ఈ విషయంలో మూడుసార్లు నిబంధనల కంటే ఎక్కువగా మోచేతిని వంచిన హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీ అనుమానం వ్యక్తం చేస్తూ నిషేధం విధించింది. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అనుమానాస్పద బౌలింగ్ కారణంగా ఐసీసీ అతడిని సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 17న లాబోరో యూనివర్సిటీలో జరిగిన పరీక్షల్లో హఫీజ్ ఐసీసీ అనుమతించిన 15 డిగ్రీల్లోపే మోచేతిని వంచుతున్నట్టు తేలింది. దీంతో మే 1న తిరిగి అతడిపై ఉన్న నిషేదాన్ని ఎత్తేసింది. -
హఫీజ్‌కు మళ్లీ ఐసీసీ క్లియరెన్స్
దుబాయ్: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌కు మరోసారి ఐసీసీ ఆమోదం లభించింది. గత అక్టోబరులో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అంపైర్లు అతని బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని నివేదిక ఇవ్వడంతో ఐసీసీ నిషేధం విధించింది. అనంతరం తన యాక్షన్‌ను సరిదిద్దుకొని రెండు వారాల అతను పరీక్షకు హాజరయ్యాడు. తాజా యాక్షన్‌ను సరైనదిగా గుర్తించి అతను ఆఫ్‌స్పిన్ బౌలింగ్ వేసేం దుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. హఫీజ్ కెరీర్లో ఇలా జరగడం ఇది మూడోసారి. -
'అశ్విన్, భజ్జీల బౌలింగ్‌పై అనుమానం'
టీమిండియాలో కీలక స్పిన్నర్లుగా కొనసాగుతున్న హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ల బౌలింగ్ యాక్షన్ పై పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ తీవ్ర ఆరోపణలు చేశాడు. 'హర్భజన్, అశ్విన్‌ల యాక్షన్ పై నాకు చాలా అనుమానాలున్నాయి. నిజానికి వాళ్లిద్దరూ చకింగ్ చేస్తారు. ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది' అని అజ్మల్ అన్నారు. 'ఇంకా..నేను ఛాలెంజ్ విసురుతున్నా. బౌలింగ్ చేస్తున్నప్పుడు హర్భన్ చేయి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంచుతాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం దానిని చకింగ్ గానే పరిగణిస్తారు' అని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ కు చెందిన ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజ్మల్ ఈ కామెంట్లు చేసినట్లు.. ఆయనను ఇంటర్వ్యూ చేసిన టీవీ యాకంర్ జైనాబ్ అబ్బాస్ వెల్లడించారు. అజ్మల్ ఇంతగా ఫ్రస్ట్రేట్ కావటం ఇదవరకెన్నడూ చూడలేదని అన్నారు. ఈ మేరకు మంగళవారం అబ్బాస్ కొన్ని ట్వీట్లు వదిలాడు. చకింగ్ చేస్తున్నాడని నిరూపణ కావడంతో గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరణకు గురైన సయ్యద్ అజ్మల్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఉన్నట్టుండి ఇలా దాయాది దేశ ఆటగాళ్లపై ఆరోపణలు చేయడం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి మరి! -
ఆగి...వేస్తానంటే కుదరదు!
బౌలింగ్ యాక్షన్లపై ఐసీసీ సీరియస్ జాబితాలో అశ్విన్, రైనా దుబాయ్: ‘బౌలింగ్ ప్రారంభించి, బంతి విసిరే లోపు టీవీలో ప్రకటన ప్రసారం చేయవచ్చు...ఈ మధ్య సమయంలో ఒక సినిమా చూసేయవచ్చు’ ...భారత స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ శైలిపై తరచుగా వినిపించే జోక్‌లు ఇవి. ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి బౌలింగ్ శైలి సీరియస్ అంశం కానుంది. బౌలర్ల చకింగ్పై కఠినంగా వ్యవహరిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పుడు మరో కోణంపై దృష్టి పెట్టింది. ఇకపై బౌలింగ్ చేసేటప్పుడు ‘పాజ్’ (ఆగి ఆగి బంతి విసరడం) ఇస్తే దానిపై చర్య తీసుకునే హక్కు అంపైర్లకు ఐసీసీ కల్పించింది. ఈ అక్టోబర్నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల (42.2) ప్రకారం బౌలర్ ఆ తరహాలో బంతి విసిరితే అది సరైందా, కాదా అని అప్పటికప్పుడు అంపైర్లు నిర్ణయిస్తారు. దాంతో వారి బాధ్యత మరింత పెరగనుంది. ‘ఎంత సేపు బంతిని ఆపుతున్నారో చెప్పేందుకు మేమేమీ స్టాప్ వాచ్‌లు పెట్టుకోలేం. అది ప్రతీ బంతికి తేడా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారమే అంపైర్లు వ్యవహరిస్తారు. అలాంటి బౌలింగ్‌తో బ్యాట్స్‌మన్ ఏకాగ్రత చెదురుతుందని భావిస్తే దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించవచ్చు’ అని ఐసీసీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అశ్విన్‌తో పాటు మరో భారత బౌలర్ సురేశ్ రైనా, పాకిస్థాన్‌కు చెందిన మొహమ్మద్ హఫీజ్ ఈ తరహా శైలితో బౌలింగ్ చేస్తున్నారు. -
ఓజా బౌలింగ్‌పై సందేహం
ముంబై: భారత క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఇల్లీగల్ యాక్షన్ కమిటీ’ సభ్యుడైన మాజీ అంపైర్ ఏవీ జయప్రకాశ్, ఒక ఇంటర్వ్యూలో ఓజా పేరు వెల్లడించారు. మోచేయిని పరిమితికి మించి వంచుతూ ఓజా బౌలింగ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బీసీసీఐ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే కొద్ది రోజులుగా ఓజా దీనిని సరిదిద్దుకునే పనిలో ఉన్నట్లు, ఎన్సీఏలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ‘చాన్నాళ్ల క్రితమే ఓజా బౌలింగ్‌లో సందేహాలు నెలకొన్నాయి. అతను దానిని సరిదిద్దుకొని మళ్లీ జట్టులోకి వస్తూ ఉన్నా... నిబంధనల ప్రకారం చూస్తే ప్రతీ సారి అతని బౌలింగ్‌ను అనుమానించాల్సి వచ్చింది’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. సచిన్ ఆఖరి టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అనంతరం ఓజా మరో టెస్టు ఆడలేదు. ప్రస్తుతం అతను దులీప్ ట్రోఫీ సెమీస్ మ్యాచ్ ఆడేందుకు హర్యానాలోని రోహ్టక్లో ఉన్నాడు. ఓజా తన బౌలింగ్‌లో మార్పులు చేసుకొని కొత్త యాక్షన్‌తోనే ఈ మ్యాచ్ ఆడనున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్‌లో ఓజా బరిలోకి దిగిన తర్వాత అతని యాక్షన్‌పై ఉన్న సందేహాలు తొలగిపోయే అవకాశం ఉంది. మరో వైపు దీనిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఖండించింది. ‘ఓజాపై మీడియా కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తోంది. అతని బౌలింగ్‌పై బీసీసీఐ మాకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నిజంగానే సందేహముంటే అతడిని దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసేవారు కాదు’ అని హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్ స్పష్టం చేశారు. -
సునీల్ నరైన్ ఇంటికి...
వన్డే సిరీస్ నుంచి వైదొలగిన స్పిన్నర్ న్యూఢిల్లీ: సందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌తో చాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు దూరమైన వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు. అతని బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన తాజా పరిణామాల అనంతరం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నరైన్‌ను స్వదేశం రావాల్సిందిగా ఆదేశించింది. ‘రాబోయే సిరీస్ నుంచి నరైన్‌ను తప్పిస్తున్నాం. అతను తన యాక్షన్‌ను సమీక్షించుకొని క్రికెట్లోకి తిరిగి వచ్చేందుకు ఈ విరామం ఉపయోగపడుతుంది’ అని విండీస్ బోర్డు ప్రకటించింది. నరైన్ తప్పుకోవడంతో వెస్టిండీస్ జట్టు స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే భారత్‌తో సిరీస్ బరిలోకి దిగనుంది. -
సందేహాస్పదంగా మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్
హైదరాబాద్: వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. చాంపియన్స్ లీగ్ టి20లో భాగంగా హైదరాబాద్ లో సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్- డాల్ఫిన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో నరైన్ బౌలింగ్ శైలిపై అనుమానాలు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ చాంపియన్స్ లీగ్ టి20 ఆర్గనైజింగ్ కమిటీ ఈ మేరకు సోమవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, షాంషుద్దీన్ లతో పాటు థర్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన కూడా నరైన్ క్వికర్ డెలివరీపై సందేహాలు వ్యక్తం చేశారని తెలిపింది. నరైన్ బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారని వెల్లడించింది. ఈ విషయాన్ని మ్యాచ్ ముగిసిన తర్వాత నరైన్ కు అంపైర్లు తెలిపారని పేర్కొంది. నరైన్ తన బౌలింగ్ శైలి సక్రమంగా ఉందో, లేదో నిరూపించుకోవాల్సివుంది. -
అజ్మల్ కు అండగా పీసీబీ!
కరాచీ:ఐసీసీ నిషేధానికి గురైన పాకిస్తాన్ స్పిన్నర్ సయిద్ అజ్మల్ ను కాపాడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) నడుంబిగించింది.అతడి బౌలింగ్ యాక్షన్ ను సరిదిద్ది మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తీసుకోచ్చేందుకు మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాఖ్ సాయం కోరింది. అజ్మల్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ తాజాగా ఐసీసీ అతనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో పీసీబీ.. ఆ దేశ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ ను సంప్రదించింది. అజ్మల్ బౌలింగ్ శైలిలో మార్పు తెచ్చి.. తిరిగి అంతర్జాతీయంగా అతన్ని ఆడించాలని పాకిస్తాన్ భావిస్తోంది. 'పీసీబీ నన్ను సంప్రదించింది. అజ్మల్ కు సాయం చేయాలని కోరింది. . అజ్మల్ ఒక పోరాట యోధుడు. అతని బౌలింగ్ మళ్లీ సరిదిద్దుకుని ఐసీసీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉందని' సక్లయిన్ తెలిపాడు. అతని బౌలింగ్ ను సరిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సక్లయిన్ పేర్కొన్నాడు. తొలుత ఐసీసీ నిషేధాన్నిసవాలు చేయాలని భావించిన పాకిస్తాన్.. ఆ నిర్ణయాన్ని మార్చుకుని సక్లయిన్ సాయాన్ని కోరింది. ఒకవేళ ఐసీసీ నిషేధాన్ని సవాల్ చేయాలని పాకిస్తాన్ భావించనప్పటికీ.. ఆ పరీక్షల్లో కూడా అజ్మల్ విఫలమైతే మరిన్ని సమస్యలు రావచ్చని పాకిస్తాన్ ముందుగా అతని బౌలింగ్ సరిచేయడానికి యత్నాలు ఆరంభించింది.