టీమిండియా క్రికెటర్, హైదరాబాద్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఝలక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో రాయుడు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో రాయుడు ఆఫ్‌స్పిన్ బౌలింగ్ యాక్షన్‌ను ఐసీసీ తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ నివేదికను ఐసీసీ భారత టీమ్ మేనేజ్‌మెంట్‌కు అందజేయడంతో పాటు.. అతను 14 రోజుల్లోగా పరీక్షకు హాజరు కావాలని తేల్చి చెప్పింది.