Womens T20 Challenge: Spinners Unique Bowling Action Video Goes Viral - Sakshi
Sakshi News home page

Womens T20 Challenge: ఇదేం బౌలింగ్‌ యాక్షన్‌రా బాబు.. చూస్తే వావ్‌ అనాల్సిందే.. వీడియో వైరల్‌

Published Tue, May 24 2022 8:22 PM | Last Updated on Wed, May 25 2022 9:18 AM

Spinners Unique Bowling Action In Womens T20 Challenge - Sakshi

Womens T20 Challenge: మహిళల టీ20 ఛాలెంజ్‌లో భాగంగా మంగళవారం సూపర్‌నోవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ స్పిన్నర్‌ సోనావానే ప్రత్యేక బౌలింగ్‌ యాక్షన్‌తో ఆకట్టుకుంది. సోనావానే డెలివరీ వేసేటప్పడు తన తలను బాగా కిందకు ఉంచి బౌలింగ్‌ చేస్తుంది. సోనావానే బౌలింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సోనావానే బౌలింగ్‌ యాక్షన్‌ను మాజీ దక్షిణాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్‌తో  అభిమానులు పోల్చుతున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. సూపర్‌నోవాస్‌పై 7 వికెట్ల తేడాతో వెలాసిటీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌నోవాస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. నోవాస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ 71 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఇక వెలాసిటీ బౌలర్లలో క్రాస్‌ రెండు వికెట్లు, దీప్తీ శర్మ, రాధా యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెలాసిటీ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. వెలాసిటీ బ్యాటర్లలో షఫాలీ వర్మ(51),లారా వోల్వార్డ్ట్(51) పరుగులతో రాణించారు.

చదవండి: IPL 2022: 'నాకు రాజస్తాన్‌ ఒక కుటుంబం వంటిది.. వార్న్ సార్ ఆశీస్సులు నాకు ఉన్నాయి'


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement