ఇండియా ‘బి’ని గెలిపించిన అరుంధతి రెడ్డి  | Womens T20 Challenger Trophy: Arundhati Reddy Shines As India B Wins Against India C | Sakshi
Sakshi News home page

Womens T20 Challenger Trophy: ఇండియా ‘బి’ని గెలిపించిన అరుంధతి రెడ్డి 

Published Fri, Nov 25 2022 12:15 PM | Last Updated on Fri, Nov 25 2022 12:15 PM

Womens T20 Challenger Trophy: Arundhati Reddy Shines As India B Wins Against India C - Sakshi

సీనియర్‌ మహిళల టి20 చాలెంజర్‌ ట్రోఫీలో ఇండియా ‘బి’ 4 వికెట్ల తేడాతో ఇండియా ‘సి’ని ఓడించింది. ముందుగా ‘సి’ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సిమ్రన్‌ షేఖ్‌ (32), పూజ వస్త్రకర్‌ (27), ప్రియా పూనియా (27), సబ్బినేని మేఘన (26) రాణించారు. ‘బి’ బౌలర్‌ అరుంధతి రెడ్డి 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ‘బి’ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది.

దేవిక వైద్య (41 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. మరో మ్యాచ్‌లో ఇండియా ‘ఎ’ 7 వికెట్ల తేడాతో ఇండియా ‘డి’ని చిత్తు చేసింది. ముందుగా ‘డి’ 19.4 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. అమన్‌జోత్, సైకా ఇషాఖ్, అంజలి, సహానా తలా 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత ‘ఎ’ జట్టు 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 95 పరుగులు సాధించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement