Womens T20 Challenge 2022
-
ఇండియా ‘బి’ని గెలిపించిన అరుంధతి రెడ్డి
సీనియర్ మహిళల టి20 చాలెంజర్ ట్రోఫీలో ఇండియా ‘బి’ 4 వికెట్ల తేడాతో ఇండియా ‘సి’ని ఓడించింది. ముందుగా ‘సి’ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సిమ్రన్ షేఖ్ (32), పూజ వస్త్రకర్ (27), ప్రియా పూనియా (27), సబ్బినేని మేఘన (26) రాణించారు. ‘బి’ బౌలర్ అరుంధతి రెడ్డి 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ‘బి’ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. దేవిక వైద్య (41 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మరో మ్యాచ్‌లో ఇండియా ‘ఎ’ 7 వికెట్ల తేడాతో ఇండియా ‘డి’ని చిత్తు చేసింది. ముందుగా ‘డి’ 19.4 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. అమన్‌జోత్, సైకా ఇషాఖ్, అంజలి, సహానా తలా 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత ‘ఎ’ జట్టు 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 95 పరుగులు సాధించింది. -
టి20 చాలెంజ్: విజేత ‘సూపర్ నోవాస్’
పుణే: హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ‘సూపర్ నోవాస్’ జట్టు మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో మరోసారి తన సత్తాను ప్రదర్శించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన టీమ్ మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో సూపర్ నోవాస్ నాలుగు పరుగుల తేడాతో దీప్తి శర్మ నాయకత్వంలోని వెలాసిటీ జట్టుపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సూపర్ నోవాస్ జట్టుకు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నోవాస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. డియాండ్రా డాటిన్ (44 బంతుల్లో 62; 1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హర్మన్‌ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ప్రియా పూనియా (29 బంతుల్లో 28; 2 సిక్స్‌లు) రాణించారు. దీప్తి శర్మ, కేట్ క్రాస్, సిమ్రన్ బహదూర్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెలాసిటీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులే చేయగలిగింది. లారా వోల్వార్ట్ (40 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి అజేయంగా నిలిచినా జట్టును గెలిపించడంలో విఫలమైంది. చివరి 3 ఓవర్లలో విజయానికి 48 పరుగులు కావాల్సి ఉండగా... వోల్వార్ట్, సిమ్రన్ బహదూర్ (10 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 18వ ఓవర్లో 2 సిక్స్‌లతో 14 పరుగులు, 19వ ఓవర్లో 4 ఫోర్లతో 17 పరుగులు రాబట్టారు. దాంతో ఆఖరి ఓవర్లో విజయ సమీకరణం 17 పరుగులకు మారింది. ఎకెల్‌స్టోన్ వేసిన ఈ ఓవర్ తొలి బంతినే వోల్వార్ట్ సిక్సర్‌గా మలచినా... తర్వాతి 5 బంతుల్లో 6 పరుగులే వచ్చాయి. అలానా కింగ్ 3 వికెట్లు పడగొట్టగా, ఎకెల్‌స్టోన్, పూజ చెరో 2 వికెట్లు తీశారు. గతంలో మూడు సార్లు మహిళల టి20 చాలెంజ్ టోర్నీ జరగ్గా... 2018, 2019లలో సూపర్ నోవాస్ విజేతగా నిలిచింది. 2020లో ట్రయల్ బ్లేజర్స్ టైటిల్ నెగ్గింది. కరోనా కారణంగా 2021లో ఈ టోర్నీని నిర్వహించలేదు. Winners Are Grinners! ☺️ ☺️@ImHarmanpreet, Captain of Supernovas, receives the #My11CircleWT20C Trophy from the hands of Mr. @SGanguly99, President, BCCI & Mr. @JayShah, Honorary Secretary, BCCI. 👏 🏆 #SNOvVEL pic.twitter.com/ujGbXX4GzB — IndianPremierLeague (@IPL) May 28, 2022 -
5 ఫోర్లు, 5 సిక్స్‌లతో విధ్వంసం.. ఎవరీ కిరణ్ నవ్‌గిరే..?
మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో గురువారం ట్రయల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే చేలరేగింది. ఈ మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే నవ్‌గిరే అర్ధసెంచరీ సాధించింది. తద్వారా మహిళల టి20 చాలెంజ్ టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్దసెంచరీ సాధించిన బ్యాటర్‌గా నవ్‌గిరే నిలిచింది. అంతకు ముందు షఫాలీ వర్మ 30 బంతుల్లో అర్దసెంచరీ సాధించి ఈ రికార్డును కలిగి ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో 34 బంతులు ఎదుర్కొన్న కిరణ్ 69 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. కాగా కిరణ్ ఒంటరి పోరాటం చేసినప్పటికి వెలాసిటీకి ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్‌లో ఓటమి చెందినప్పటికీ తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన కిరణ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎవరీ కిరణ్ నవ్‌గిరే 27 ఏళ్ల కిరణ్ నవ్‌గిరే మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించింది. ఆమె తన క్రీడా జీవితాన్ని అథ్లెట్‌గా ప్రారంభించింది. జావెలిన్ త్రో, షాట్‌పుట్,రిలే రన్నింగ్‌లో చాలా పతకాలు కిరణ్ సాధించింది. అయితే భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోనిని ఆదర్శంగా తీసుకుని 2016లో అథ్లెటిక్స్ను వదిలి నవ్‌గిరే క్రికెట్లోకి అడుగుపెట్టింది. ధోని ప్రశాంతత, హార్డ్ హిట్టింగ్ స్కిల్స్ ఆమెను ఎంతో గానే ప్రేరేపించాయి. క్రికెట్ కెరీర్ మహారాష్ట్ర జట్టుకు ఎంపిక కాకపోవడంతో డొమాస్టిక్ క్రికెట్లో నాగాలాండ్ జట్టుకు కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇటీవల ముగిసిన సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో కిరణ్ సంచలనం సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌లోను కిరణ్ 76 బంతుల్లో 162 పరుగులు చేసింది. తద్వారా టీ20 క్రికెట్లో 76 బంతుల్లో 162 పరుగులు చేసింది తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించింది. ఇక టోర్నీలో నవ్‌గిరే 525 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది. చదవండి: Dinesh Karthik: దినేశ్ కార్తిక్ ఏంటిది? డీకేకు మందలింపు! కీలక మ్యాచ్‌కు ముందు షాక్! -
Womens T20: మహిళల టి20 చాలెంజ్‌లో చెలరేగిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి!
పుణే: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (47 బంతుల్లో 73; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో ట్రయల్‌బ్లేజర్స్ 16 పరుగుల తేడాతో వెలాసిటీపై గెలిచింది. అయితే రన్‌రేట్‌లో వెనుకబడిపోవడంతో బ్లేజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. శనివారం జరిగే ఫైనల్లో సూపర్‌నోవాస్‌తో వెలాసిటీ తలపడుతుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (44 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్) దంచేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (1) నిరాశపరిచినా... వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి మేఘన మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మేఘన 32 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా 36 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించాక మేఘన అవుటైంది. తర్వాత హేలీ మాథ్యూస్ (16 బంతుల్లో 27; 4 ఫోర్లు) ధాటిగా ఆడింది. అనంతరం వెలాసిటీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులకే పరిమితమైంది. కిరణ్ నవ్‌గిరే (34 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగినా లాభం లేకపోయింది. -
SPN Vs VEL: చెలరేగిన షఫాలీ.. హర్మన్‌ప్రీత్ సేనకు తప్పని ఓటమి
Womens T20 Challenge Velocity Vs Supernovas- పుణే: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో వెలాసిటీ ఏడు వికెట్ల తేడాతో సూపర్ నోవాస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రియా (4), డాటిన్ (6), హర్లీన్ డియోల్ (7) టాపార్డర్ చేతులెత్తేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), తానియా భాటియా (36; 3 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. కేట్ క్రాస్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత వెలాసిటీ 18.2 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33 బంతుల్లో 51; 9 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో లారా వోల్వర్డ్ (35 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. షఫాలీ అవుటయ్యాక వోల్వర్డ్, కెప్టెన్ దీప్తి శర్మ (25 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. డాటిన్ 2 వికెట్లు పడగొట్టారు. వీరోచిత ప్రదర్శన చేసిన హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చెరో విజయం సాధించిన సూపర్ నోవాస్ (నెట్ రన్‌రేట్; 0.912), వెలాసిటీ (నెట్ రన్‌రేట్; 0.736) రెండేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సూపర్ నోవాస్ ఫైనల్ చేరాలంటే గురువారం వెలాసిటీతో జరిగే మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్ జట్టు (నెట్ రన్‌రేట్; –2.450) భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. చదవండి: IPL 2022 GT Vs RR: అరంగేట్రంలోనే అదుర్స్.. అహ్మదాబాద్‌కు చలో చలో! READ: @TheShafaliVerma and @LauraWolvaardt starred with the bat as the @Deepti_Sharma06-led Velocity beat Supernovas. 👍 👍 - By @mihirlee_58 Here's the match report 👇 #My11CircleWT20C #SNOvVEL https://t.co/LSTW5mpYeG — IndianPremierLeague (@IPL) May 24, 2022 -
ఇదేం బౌలింగ్ యాక్షన్రా బాబు.. చూస్తే వావ్ అనాల్సిందే.. వీడియో వైరల్
Womens T20 Challenge: మహిళల టీ20 ఛాలెంజ్‌లో భాగంగా మంగళవారం సూపర్‌నోవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ స్పిన్నర్ సోనావానే ప్రత్యేక బౌలింగ్ యాక్షన్‌తో ఆకట్టుకుంది. సోనావానే డెలివరీ వేసేటప్పడు తన తలను బాగా కిందకు ఉంచి బౌలింగ్ చేస్తుంది. సోనావానే బౌలింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సోనావానే బౌలింగ్ యాక్షన్‌ను మాజీ దక్షిణాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్‌తో అభిమానులు పోల్చుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్‌నోవాస్‌పై 7 వికెట్ల తేడాతో వెలాసిటీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్నోవాస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. నోవాస్ బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక వెలాసిటీ బౌలర్లలో క్రాస్ రెండు వికెట్లు, దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలా వికెట్ సాధించారు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెలాసిటీ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. వెలాసిటీ బ్యాటర్లలో షఫాలీ వర్మ(51),లారా వోల్వార్డ్ట్(51) పరుగులతో రాణించారు. చదవండి: IPL 2022: 'నాకు రాజస్తాన్ ఒక కుటుంబం వంటిది.. వార్న్ సార్ ఆశీస్సులు నాకు ఉన్నాయి' Debut for 23 year old leg spinner from Maharashtra, Maya Sonawane#My11CircleWT20C#WomensT20Challenge2022 pic.twitter.com/IRylJ62EGx — WomensCricCraze🏏( Womens T20 Challenge) (@WomensCricCraze) May 24, 2022 -
WTC 2022: విజృంభించిన పూజ.. స్మృతి టీమ్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన
పుణే: అమ్మాయిల మెరుపుల క్రికెట్ టోర్నీ ‘టి20 చాలెంజ్’లో సూపర్ నోవాస్ శుభారంభం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ 49 పరుగుల తేడాతో స్మృతి కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ ట్రయల్ బ్లేజర్స్ జట్టుపై జయభేరి మోగించింది. తొలుత సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించగా, హర్లీన్ (19 బంతుల్లో 35; 5 ఫోర్లు), డాటిన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. బ్లేజర్స్ స్పిన్నర్లు హేలీ మాథ్యూస్ 3, సల్మా ఖాటున్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులకే పరిమితమైంది. స్మృతి మంధాన (23 బంతుల్లో 34; 4 ఫోర్లు) ఆరంభంలో వేగంగా ఆడింది. అయితే పేసర్ పూజ వస్త్రకర్ (4/12) వైవిధ్యమైన బంతులతో ట్రయల్ బ్లేజర్స్‌ను దెబ్బ తీసింది. ఒకదశలో 7 ఓవర్లలో 63/1 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న బ్లేజర్స్ అనూహ్యంగా 10 పరుగుల వ్యవధిలోనే ఏకంగా 6 వికెట్లను కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. ఇదే వేదికపై నేడు మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరిగే మ్యాచ్‌లో సూపర్ నోవాస్‌తో వెలాసిటీ జట్టు తలపడుతుంది.