SPN Vs VEL: చెలరేగిన షఫాలీ.. హర్మన్‌ప్రీత్‌ సేనకు తప్పని ఓటమి | Womens T20 Challenge: Velocity Beat Supernovas By 7 Wickets | Sakshi
Sakshi News home page

Womens T20 Challenge: చెలరేగిన షఫాలీ.. హర్మన్‌ప్రీత్‌ సేనకు తప్పని పరాజయం

Published Wed, May 25 2022 8:02 AM | Last Updated on Wed, May 25 2022 8:12 AM

Womens T20 Challenge: Velocity Beat Supernovas By 7 Wickets - Sakshi

షఫాలీ వర్మ, లారా వోల్వర్డ్‌(PC: IPL)

Womens T20 Challenge Velocity Vs Supernovas- పుణే: మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీలో వెలాసిటీ ఏడు వికెట్ల తేడాతో సూపర్‌ నోవాస్‌ జట్టుపై ఘనవిజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట సూపర్‌ నోవాస్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రియా (4), డాటిన్‌ (6), హర్లీన్‌ డియోల్‌ (7) టాపార్డర్‌ చేతులెత్తేయగా, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (51 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), తానియా భాటియా (36; 3 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు.

వీరిద్దరు నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. కేట్‌ క్రాస్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత వెలాసిటీ 18.2 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (33 బంతుల్లో 51; 9 ఫోర్లు, 1 సిక్స్‌), మిడిలార్డర్‌లో లారా వోల్వర్డ్‌ (35 బంతుల్లో 51 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగారు. షఫాలీ అవుటయ్యాక వోల్వర్డ్,  కెప్టెన్‌ దీప్తి శర్మ (25 బంతుల్లో 24 నాటౌట్‌; 2 ఫోర్లు) అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.

డాటిన్‌ 2 వికెట్లు పడగొట్టారు. వీరోచిత ప్రదర్శన చేసిన హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. చెరో విజయం సాధించిన సూపర్‌ నోవాస్‌ (నెట్‌ రన్‌రేట్‌; 0.912), వెలాసిటీ (నెట్‌ రన్‌రేట్‌; 0.736) రెండేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సూపర్‌ నోవాస్‌ ఫైనల్‌ చేరాలంటే గురువారం వెలాసిటీతో జరిగే మ్యాచ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్టు (నెట్‌ రన్‌రేట్‌; –2.450) భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.

చదవండి: IPL 2022 GT Vs RR: అరంగేట్రంలోనే అదుర్స్‌.. అహ్మదాబాద్‌కు చలో చలో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement