Supernovas
-
నక్షత్రాలు పేలితే భూమికి ముప్పు!
భూగోళంపై కోట్లాది జీవులు ఉన్నాయి. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో జీవజాలం పుట్టుకొచ్చింది. ఇందుకు ఎన్నో సంఘటనలు దోహదం చేశాయి. భూమిపై జీవుల ఆవిర్భావం, మనుగడకు ఇక్కడి అనుకూల వాతావరణమే కారణం. ధరణిపై వాతావరణం విషతుల్యంగా మారితే జీవులకు ముప్పు తప్పదు. పూర్తిగా అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు. అలాంటి ప్రమాదమే తలెత్తే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుదూరంలోని అంతరిక్షంలో ఉన్న సూపర్నోవాల పేలుడు నుంచి గ్రహాలకు కొత్త ముప్పు పొంచి ఉందని, ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం మన చేతుల్లో లేదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏమిటీ ముప్పు? అంతరిక్షంలో అనంతమైన నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని సూపర్నోవాగా మారి పేలిపోతుంటాయి. బ్లాస్ట్ వేవ్ సంభవిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదకరమైన ఎక్స్–కిరణాలు అధిక మోతాదులో వెలువడుతాయి. ఇవి సమీపంలోని గ్రహాలను చేరుతాయి. ఇందుకు నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పట్టొచ్చు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి దాని పరిధిలోని భూగ్రహాన్ని రక్షించడానికి ఓజోన్ పొర ఆవరించి ఉంది. సూపర్నోవా పేలుడుతో ఉద్గారమయ్యే ఎక్స్–కిరణాలు భూమిని చుట్టూ ఉన్న ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తాయి. ఓజోన్ పొర చాలావరకు తుడిచిపెట్టుకుపోతోంది. దాంతో యూవీ రేడియేషన్ నేరుగా భూగ్రహం ఉపరితలాన్ని ఢీకొడుతుంది. ఫలితంగా నైట్రోజన్ డయాక్సైడ్ అనే విషవాయువు భూమిపై ఉత్పత్తి అవుతుంది. అది విషపూరితమైన గోధుమ రంగు పొరను భూమి చుట్టూ ఏర్పరుస్తుంది. అప్పుడు వాతావరణం లుప్తమైపోతుంది. జీవులు అంతరించిపోతాయి. ఎలా గుర్తించారు? యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్తలు చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీతోపాటు ఇతర అత్యాధునిక టెలిస్కోప్‌లతో సూపర్‌నోవాలపై అధ్యయనం చేశారు. పేలిపోయే తారల నుంచి ఎక్స్–కిరణాలు వెలువడి, భూమి, ఇతర గ్రహాలను ప్రభావితం చేసే దశ రాబోతుందని, ఈ పరిణామం 100 కాంతి సంవత్సల దూరంలో చోటుచేసుకుంటుందని కనిపెట్టారు. పేలిపోయే నక్షత్రాల నుంచి వాటిల్లే ముప్పు గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగినట్లు గుర్తించారు. 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూపర్నోవాలు పేలిపోతే భూమిలాంటి గ్రహాలకు రేడియేషన్ ముప్పు ఉంటుందని తేల్చారు. 1979సీ, ఎస్ఎన్ 1987ఏ, ఎస్ఎన్ 2010జేఎల్, ఎస్ఎన్ 1994ఐ అనే సూపర్నోవాలను నిశితంగా పరిశీలించారు. అవి ఇప్పట్లో పేలే అవకాశం ఉందా? దానిపై ఓ అంచనాకొచ్చారు. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేనట్లే భూమికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదని శాస్త్రవేత్త కానర్ ఓమహోనీ వెల్లడించారు. ఎక్స్–రే డేంజర్ జోన్లో బలమైన సూపర్నోవా ఏదీ లేదని తెలిపారు. భూమికి సమీపంలో గతంలో తారలు పేలిపోయిన దాఖలాలు ఉన్నాయని వెల్లడించారు. 20 లక్షల నుంచి 80 లక్షల సంవత్సరాల క్రితం భూమి నుంచి 65 నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్నోవా ఒకటి పేలిపోయింది. దానికి సంబంధించిన రేడియేషన్ ఇప్పటికీ భూమి వైపునకు దూసుకొస్తోందని పరిశోధకులు గుర్తించారు. సూపర్నోవా నుంచి వెలువడే ఎక్స్–కిరణాలపై మరిన్ని పరిశోధనలు చేయడం నక్షత్రాల జీవితకాలం గురించి అర్థం చేసుకోవడానికే కాదు, ఆస్ట్రోబయాలజీ, పాలియోంటాలజీ, ప్లానెటరీ సైన్సెస్ తదితర రంగాల్లో చిక్కుముడులు విప్ప డానికి ఉపయోగపడ తాయని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్త బ్రియాన్ ఫీల్డ్స్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టి20 చాలెంజ్: విజేత ‘సూపర్ నోవాస్’
పుణే: హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ‘సూపర్ నోవాస్’ జట్టు మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో మరోసారి తన సత్తాను ప్రదర్శించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన టీమ్ మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో సూపర్ నోవాస్ నాలుగు పరుగుల తేడాతో దీప్తి శర్మ నాయకత్వంలోని వెలాసిటీ జట్టుపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సూపర్ నోవాస్ జట్టుకు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నోవాస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. డియాండ్రా డాటిన్ (44 బంతుల్లో 62; 1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హర్మన్‌ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ప్రియా పూనియా (29 బంతుల్లో 28; 2 సిక్స్‌లు) రాణించారు. దీప్తి శర్మ, కేట్ క్రాస్, సిమ్రన్ బహదూర్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెలాసిటీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులే చేయగలిగింది. లారా వోల్వార్ట్ (40 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి అజేయంగా నిలిచినా జట్టును గెలిపించడంలో విఫలమైంది. చివరి 3 ఓవర్లలో విజయానికి 48 పరుగులు కావాల్సి ఉండగా... వోల్వార్ట్, సిమ్రన్ బహదూర్ (10 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 18వ ఓవర్లో 2 సిక్స్‌లతో 14 పరుగులు, 19వ ఓవర్లో 4 ఫోర్లతో 17 పరుగులు రాబట్టారు. దాంతో ఆఖరి ఓవర్లో విజయ సమీకరణం 17 పరుగులకు మారింది. ఎకెల్‌స్టోన్ వేసిన ఈ ఓవర్ తొలి బంతినే వోల్వార్ట్ సిక్సర్‌గా మలచినా... తర్వాతి 5 బంతుల్లో 6 పరుగులే వచ్చాయి. అలానా కింగ్ 3 వికెట్లు పడగొట్టగా, ఎకెల్‌స్టోన్, పూజ చెరో 2 వికెట్లు తీశారు. గతంలో మూడు సార్లు మహిళల టి20 చాలెంజ్ టోర్నీ జరగ్గా... 2018, 2019లలో సూపర్ నోవాస్ విజేతగా నిలిచింది. 2020లో ట్రయల్ బ్లేజర్స్ టైటిల్ నెగ్గింది. కరోనా కారణంగా 2021లో ఈ టోర్నీని నిర్వహించలేదు. Winners Are Grinners! ☺️ ☺️@ImHarmanpreet, Captain of Supernovas, receives the #My11CircleWT20C Trophy from the hands of Mr. @SGanguly99, President, BCCI & Mr. @JayShah, Honorary Secretary, BCCI. 👏 🏆 #SNOvVEL pic.twitter.com/ujGbXX4GzB — IndianPremierLeague (@IPL) May 28, 2022 -
Womens T20: మహిళల టి20 చాలెంజ్‌లో చెలరేగిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి!
పుణే: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (47 బంతుల్లో 73; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో ట్రయల్‌బ్లేజర్స్ 16 పరుగుల తేడాతో వెలాసిటీపై గెలిచింది. అయితే రన్‌రేట్‌లో వెనుకబడిపోవడంతో బ్లేజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. శనివారం జరిగే ఫైనల్లో సూపర్‌నోవాస్‌తో వెలాసిటీ తలపడుతుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (44 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్) దంచేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (1) నిరాశపరిచినా... వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి మేఘన మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మేఘన 32 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా 36 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించాక మేఘన అవుటైంది. తర్వాత హేలీ మాథ్యూస్ (16 బంతుల్లో 27; 4 ఫోర్లు) ధాటిగా ఆడింది. అనంతరం వెలాసిటీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులకే పరిమితమైంది. కిరణ్ నవ్‌గిరే (34 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగినా లాభం లేకపోయింది. -
SPN Vs VEL: చెలరేగిన షఫాలీ.. హర్మన్‌ప్రీత్ సేనకు తప్పని ఓటమి
Womens T20 Challenge Velocity Vs Supernovas- పుణే: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో వెలాసిటీ ఏడు వికెట్ల తేడాతో సూపర్ నోవాస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రియా (4), డాటిన్ (6), హర్లీన్ డియోల్ (7) టాపార్డర్ చేతులెత్తేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), తానియా భాటియా (36; 3 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. కేట్ క్రాస్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత వెలాసిటీ 18.2 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33 బంతుల్లో 51; 9 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో లారా వోల్వర్డ్ (35 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. షఫాలీ అవుటయ్యాక వోల్వర్డ్, కెప్టెన్ దీప్తి శర్మ (25 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. డాటిన్ 2 వికెట్లు పడగొట్టారు. వీరోచిత ప్రదర్శన చేసిన హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చెరో విజయం సాధించిన సూపర్ నోవాస్ (నెట్ రన్‌రేట్; 0.912), వెలాసిటీ (నెట్ రన్‌రేట్; 0.736) రెండేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సూపర్ నోవాస్ ఫైనల్ చేరాలంటే గురువారం వెలాసిటీతో జరిగే మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్ జట్టు (నెట్ రన్‌రేట్; –2.450) భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. చదవండి: IPL 2022 GT Vs RR: అరంగేట్రంలోనే అదుర్స్.. అహ్మదాబాద్‌కు చలో చలో! READ: @TheShafaliVerma and @LauraWolvaardt starred with the bat as the @Deepti_Sharma06-led Velocity beat Supernovas. 👍 👍 - By @mihirlee_58 Here's the match report 👇 #My11CircleWT20C #SNOvVEL https://t.co/LSTW5mpYeG — IndianPremierLeague (@IPL) May 24, 2022 -
WTC 2022: విజృంభించిన పూజ.. స్మృతి టీమ్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన
పుణే: అమ్మాయిల మెరుపుల క్రికెట్ టోర్నీ ‘టి20 చాలెంజ్’లో సూపర్ నోవాస్ శుభారంభం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ 49 పరుగుల తేడాతో స్మృతి కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ ట్రయల్ బ్లేజర్స్ జట్టుపై జయభేరి మోగించింది. తొలుత సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించగా, హర్లీన్ (19 బంతుల్లో 35; 5 ఫోర్లు), డాటిన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. బ్లేజర్స్ స్పిన్నర్లు హేలీ మాథ్యూస్ 3, సల్మా ఖాటున్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులకే పరిమితమైంది. స్మృతి మంధాన (23 బంతుల్లో 34; 4 ఫోర్లు) ఆరంభంలో వేగంగా ఆడింది. అయితే పేసర్ పూజ వస్త్రకర్ (4/12) వైవిధ్యమైన బంతులతో ట్రయల్ బ్లేజర్స్‌ను దెబ్బ తీసింది. ఒకదశలో 7 ఓవర్లలో 63/1 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న బ్లేజర్స్ అనూహ్యంగా 10 పరుగుల వ్యవధిలోనే ఏకంగా 6 వికెట్లను కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. ఇదే వేదికపై నేడు మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరిగే మ్యాచ్‌లో సూపర్ నోవాస్‌తో వెలాసిటీ జట్టు తలపడుతుంది. -
ఖగోళంలో భారీ విస్పోటనం.. పలు పరిశోధనలకు ఆటంకం!
విశ్వంలో అంతుచిక్కని దృగ్విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిని ఛేదించడం కోసం మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని దృగ్విషయాల చిక్కుముడి విప్పి ఇప్పటికే కొంతమేరకు విజయాన్ని సాధించాడు. అందులో చెప్పుకోదగినదే.. ఈవెంట్ హారిజోన్.. ఈ ఈవెంట్ మొట్టమొదటి సారిగా కృష్ణ బిలాల( బ్లాక్‌హోల్) ఫోటోను తీయడానికి ఉపయోగపడింది. కాగా ప్రస్తుతం నైరుతి ఆఫ్రికాలోని నమీబియా శాస్త్రవేత్తల బృందం సుదూరాన ఉన్న గెలాక్సీలో జరిగిన నక్షత్ర భారీ విస్పోటనాన్ని గుర్తించారు. సుమారు ఈ నక్షత్ర ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ విస్పోటనం ద్వారా అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన గామా-రే పేలుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. గామా రే పేలుళ్ల నుంచి అత్యంత శక్తివంతమైన రేడియేషన్ వెలువడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రేడియేషన్ విశ్వంతరాలపై జరుగుతున్న పరిశోధనలపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గామా రే పేలుడు భూమి నుంచి సుమారు ఒక బిలియన్ కాంతి సంవత్పరాల దూరంలో జరిగింది. కాగా ఈ విస్పోటనం భూ గ్రహానికి అత్యంత సమీపంలో జరిగింది. సాధారణంగా గామా రే పేలుళ్లు భూమి నుంచి 20 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరుగుతుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పేలుడు ప్రస్తుతం ఉన్నగామా రే పేలుళ్ల సిద్ధాంతాన్ని సవాలు చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటిపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో ఎక్స్ రే, గామా పేలుళ్లలో భారీగా సారుప్యతలు ఉన్నాయని వెల్లడించారు. ఈ పరిశీలనకు సంబంధించిన విషయాలను డ్యూయిష్ ఎలెక్ట్రోనెన్-సింక్రోట్రోన్ (DESY) లో ప్రచురించారు. ఇది జర్మనీకి చెందిన అతిపెద్ద శాస్త్రీయ సంస్థ అంతేకాకుండా హెల్మ్హోల్ట్జ్ అసోసియేషన్‌లో భాగం.ఈ పేలుళ్లలకు సంబంధించిన సిములేషన్ వీడియోను ఈ సంస్థ పోస్ట్ చేసింది. కాగా ఈ పేలుడు నుంచి వెలువడే అత్యంత ప్రకాశంతమైన నీలి రంగు కాంతిని కొన్ని సంవత్సరాల తరువాత భూమిపై చూడవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. అసలు ఏంటి ఈ గామా రే పేలుళ్లు... సాధారణంగా నక్షత్రాలు తమ జీవితకాలన్ని ముగిసిపోయి, సూపర్నోవాగా రూపాంతరం చెంది అప్రకాశవంతమైన వస్తువులుగా మారి క్రమేపి కృష్ణబిలాలుగా మారుతుంటాయి. నక్షత్రాల్లో పేలుళ్లు సంభవించినప్పుడు అత్యంత శక్తివంతమైన ఎక్స్ రే, గామా దృగ్విషయాలు వెలువడుతుంటాయి. గామా-రే పేలుళ్లు సుదూరంగా ఉన్న గెలాక్సీలలో జరిగే అపారమైన శక్తివంతమైన పేలుళ్లు. ఈ పేలుళ్లు విశ్వంలో సంభవించే అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన విద్యుదయస్కాంత సంఘటనలు. గామా రే పేలుళ్లు కొన్ని సార్లు పది మిల్లీసెకన్ల నుంచి కొన్ని గంటల వరకు జరుగుతుంటాయి. -
చాంపియన్ ట్రయల్ బ్లేజర్స్
షార్జా: మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్లో కొత్త చాంపియన్ అవతరించింది. ఇప్పటికే రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకున్న డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్‌ను ఓడించి ట్రయల్ బ్లేజర్స్ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ 16 పరుగులతో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. స్మృతి మంధాన (49 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు ఆమాత్రం స్కోరు సాధించగలిగింది. నోవాస్ బౌలర్ రాధా యాదవ్ మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించింది. అనంతరం సల్మా ఖాతూన్ (3/18), దీప్తి శర్మ (2/9)ల ధాటికి సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మ¯న్‌ప్రీత్ కౌర్ (36 బంతుల్లో 30; 2 ఫోర్లు), శశికళ సిరివర్ధనే (18 బంతుల్లో 19; 1 ఫోర్) రాణించారు. విజేతగా నిలిచిన ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. కెప్టెన్ మెరుపులు... టైటిల్‌పై గురిపెట్టిన స్మృతి దూకుడే మంత్రంగా చెలరేగింది. అనుజా బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6తో తన ఉద్దేశాన్ని చాటింది. డాటిన్ (32 బంతుల్లో 20; 1 ఫోర్) రాణించడంతో పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులు సాధించింది. తర్వాత నోవాస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగుల వేగం తగ్గింది. డాటిన్‌ను అవుట్ చేసిన పూనమ్ యాదవ్ ఓవర్లోనే వరుసగా 4, 6తో స్మృతి జోరు పెంచింది. ఈ క్రమంలో 38 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుది. జట్టు స్కోరు 101 వద్ద స్మృతి రెండో వికెట్‌గా వెనుదిరిగింది. రాధ మాయాజాలం... డెత్ ఓవర్లలో రాధ కొట్టిన దెబ్బకి బ్లేజర్స్ ఇన్నింగ్స్ కకావిలకమైంది. 18వ ఓవర్లో బంతినందుకున్న ఆమె... దీప్తి శర్మ (9), రిచా ఘోష్ (10)లను డగౌట్ చేర్చి భారీ స్కోరుకు కళ్లెం వేసింది. ఇక చివరి ఓవర్లోనైతే ఏకంగా 3 వికెట్లతో విజృంభించింది. తొలి బంతికి ఎకెల్‌స్టోన్ (1), నాలుగో బంతికి హర్లీన్ (4), ఐదో బంతికి జులన్ గోస్వామి (1) వికెట్లను పడగొట్టి కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చింది. చివరి బంతికి చాంథమ్ (0) రనౌట్‌గా వెనుదిరగడంతో ఆ వికెట్ ఆమె ఖాతాలో చేరలేదు. ఈ దెబ్బకి చివరి ఐదు ఓవర్లలో నోవాస్ కేవలం 17 పరుగులే చేయగలిగింది. అతి జాగ్రత్తతో... ఆరంభంలోనే నోవాస్‌కు షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న చమరి ఆటపట్టు (6) వికెట్‌ను రివ్యూ కోరి బ్లేజర్స్ దక్కించుకుంది. దీంతో అతి జాగ్రత్తకు పోయిన నోవాస్ పవర్‌ప్లేలో 28 పరుగులే చేసింది. తానియా (14), జెమీమా (13) విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడింది. శశికళ (19)తో కలిసి నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించి మ్యాచ్‌పై ఆశలు రేపింది. విజయానికి 12 బంతుల్లో28 పరుగులు చేయాల్సి ఉండగా... రెండు పరుగుల వ్యవధిలో అనుజా, హర్మన్, పూజలను పెవిలియన్ చేర్చి సల్మా ఖాతూన్ నోవాస్ నుంచి టైటిల్‌ను లాగేసుకుంది. -
సగర్వంగా ఫైనల్‌కు..
షార్జా: డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్ అనుకున్నది సాధించింది. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని మహిళల టి20 చాలెంజ్ టోరీ్నలో ఫైనల్ బెర్తును ఒడిసి పట్టింది. గెలుపు... ట్రయల్ బ్లేజర్స్వైపు మొగ్గుతోన్న దశలో రాధా యాదవ్ (2/30) అద్భుత బౌలింగ్‌తో సూపర్ నోవాస్‌ను 2 పరుగులతో గెలిపించింది. బ్లేజర్స్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా... రాధ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ను దక్కించుకుంది. దీంతో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్‌కు ఓటమి తప్పలేదు. మూడు జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు ముగిశాక మూడు జట్లూ ఒక్కో విజయంతో రెండు పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్ బ్లేజర్స్ (+2.109), హర్మన్‌ప్రీత్ కెపె్టన్సీలోని సూపర్ నోవాస్ (–0.054) జట్లు ఫైనల్లోకి ప్రవేశించగా... హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తున్న వెలాసిటీ (–1.869) జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. సోమవారం జరిగే ఫైనల్లో ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ అమీతుమీ తేల్చుకుంటాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చమరి ఆటపట్టు జయాంగని (48 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రయల్ బ్లేజర్స్ జట్టు 20 ఓవర్లు ఆడి 5 వికెట్లకు 144 పరుగులు చేసి ఓడిపోయింది. దీప్తి శర్మ (43 నాటౌట్) రాణించినా జట్టును గెలిపించలేకపోయింది. -
గెలిస్తేనే ఫైనల్లోకి...
షార్జా: అదిరే ఆరంభం... ఆపై నిరాశజనక ప్రదర్శన... తొలి రెండు మ్యాచ్‌ల్లో మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నీ సాగిన తీరిది. కరోనా విరామం తర్వాత భారత మహిళలు తలపడుతోన్న ఈ టోర్నీలో ఊహకందని ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్... అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ట్రయల్ బ్లేజర్స్‌ను నేడు ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది దర్జాగా ఫైనల్‌కు చేరేందుకు స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ పక్కాగా సిద్ధమైంది. లీగ్‌లో నిలవాలంటే గెలవడం తప్ప సూపర్ నోవాస్‌కు మరో దారి లేదు. ఈ మ్యాచ్‌లో గెలుపొందితే నెట్ రన్‌రేట్ సహాయంతో వెలాసిటీ (–1.869) జట్టును వెనక్కి నెట్టి సూపర్ నోవాస్ (–0.204) ఫైనల్‌కు చేరే అవకాశముంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం పట్టుదలగా ఉంది. చమరి ఆటపట్టు, జెమీమా రోడ్రిగ్స్ సహాయంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించాలని యోచిస్తుంది. మరోవైపు ట్రయల్ బ్లేజర్స్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై సోఫీతో పాటు రాజేశ్వరీ గైక్వాడ్‌ను తట్టుకొని నిలిస్తే సూపర్ నోవాస్ విజయం కష్టమేమీ కాదు. ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరుగనుంది. బ్యాటర్లు సత్తా చాటిన జట్టునే విజయం వరించడం ఖాయం. -
వెలాసిటీ బోణీ
షార్జా: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ ఐదు వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని సూపర్ నోవాస్ జట్టుపై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్ చమరి ఆటపట్టు (39 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించింది. ఏక్తాబిష్త్ 3 వికెట్లు తీసింది. తర్వాత వెలాసిటీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సునె లూస్ (21 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సుష్మ వర్మ (33 బంతుల్లో 34; 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. రాణించిన చమరి... ఓపెనర్ ప్రియా (11), జెమీమా రోడ్రిగ్స్ (7) విఫలమైనా... మరో ఓపెనర్ చమరి ఆటపట్టు కుదరుగా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. మనాలీ, కాస్పెరెక్ ఓవర్లలో సిక్సర్లు బాదిన చమరి దూకుడుకు జహనార చెక్ పెట్టింది. కాసేపటికే హర్మన్ (27 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను జహనార పెవిలియన్ చేర్చగా... తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారిలో సిరివర్దెనె (18) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 20వ ఓవర్ వేసిన ఏక్తా బిష్త్ ఆఖరి రెండు బంతుల్లో రాధా యాదవ్ (2), షకీరా (5)లను అవుట్ చేసింది. జహనార, కాస్పెరెక్ చెరో 2 వికెట్లు తీశారు. ఆఖర్లో ఉత్కంఠ... బంతికో పరుగు చొప్పున చేయాల్సిన లక్ష్యం. కానీ ఖాతా తెరువకుండానే ఓపెనర్ వ్యాట్ (0)ను, లక్ష్యఛేదనలో సగం పరుగులు చేయగానే షఫాలీ (11 బంతుల్లో 17), కెప్టెన్ మిథాలీ (7), వేద కృష్ణమూర్తి (28 బంతుల్లో 29; 4 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. 13 ఓవర్లలో వెలాసిటీ స్కోరు 65/4. ఇంకా 42 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన సమీకరణం. చివరి 5 ఓవర్లలో అయితే ఓవర్‌కు 10 చొప్పున 50 పరుగులు చేయాలి. లక్ష్యానికి దాదాపు దూరమైన తరుణంలో సుష్మ, సునె లూస్ భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. పూనమ్ 16వ ఓవర్లో ఇద్దరు చెరో సిక్సర్ బాదడంతో 14 పరుగులు, సిరివర్దెనె 17వ ఓవర్లో 11 పరుగులు రావడంతో లక్ష్యం సులువైంది. సుష్మ అవుటైనా... ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లూస్, శిఖాపాండే చెరో బౌండరీతో గెలిపించారు. నేడు జరిగే మ్యాచ్‌లో వెలాసిటీతో ట్రయల్ బ్లేజర్స్ తలపడుతుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.