Gamma Radiation From Collapsed Star: నక్షత్ర విస్పోటనంలో వెలువడిన రేడియేషన్‌..పరిశోధనలకు ఆటంకం! - Sakshi
Sakshi News home page

ఖగోళంలో భారీ విస్పోటనం.. పలు పరిశోధనలకు ఆటంకం!

Published Thu, Jun 10 2021 3:18 PM | Last Updated on Fri, Jun 11 2021 4:32 PM

Spectacular Gamma Radiation From Collapse Of Dying Star Could Change Understanding Of The Universe - Sakshi

విశ్వంలో అంతుచిక్కని దృగ్విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిని ఛేదించడం కోసం మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని దృగ్విషయాల చిక్కుముడి విప్పి ఇప్పటికే కొంతమేరకు విజయాన్ని సాధించాడు. అందులో చెప్పుకోదగినదే.. ఈవెంట్ హారిజోన్‌.. ఈ ఈవెంట్‌ మొట్టమొదటి సారిగా కృష్ణ బిలాల( బ్లాక్‌హోల్‌) ఫోటోను తీయడానికి ఉపయోగపడింది. కాగా ప్రస్తుతం నైరుతి ఆఫ్రికాలోని నమీబియా శాస్త్రవేత్తల బృందం సుదూరాన ఉన్న గెలాక్సీలో జరిగిన నక్షత్ర భారీ విస్పోటనాన్ని గుర్తించారు. సుమారు ఈ నక్షత్ర ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ విస్పోటనం ద్వారా అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన గామా-రే పేలుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు.

గామా రే పేలుళ్ల నుంచి అత్యంత శక్తివంతమైన రేడియేషన్‌ వెలువడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రేడియేషన్‌ విశ్వంతరాలపై  జరుగుతున్న పరిశోధనలపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గామా రే పేలుడు భూమి నుంచి సుమారు ఒక బిలియన్‌ కాంతి సంవత్పరాల దూరంలో జరిగింది. కాగా ఈ విస్పోటనం భూ గ్రహానికి అత్యంత సమీపంలో జరిగింది. సాధారణంగా గామా రే పేలుళ్లు భూమి నుంచి 20 బిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో జరుగుతుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పేలుడు ప్రస్తుతం ఉన్నగామా రే పేలుళ్ల సిద్ధాంతాన్ని సవాలు చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వీటిపై  శాస్త్రవేత్తలు  జరిపిన పరిశీలనలో ఎక్స్‌ రే, గామా పేలుళ్లలో భారీగా సారుప్యతలు ఉన్నాయని వెల్లడించారు. ఈ పరిశీలనకు సంబంధించిన విషయాలను డ్యూయిష్ ఎలెక్ట్రోనెన్-సింక్రోట్రోన్ (DESY) లో ప్రచురించారు. ఇది జర్మనీకి చెందిన అతిపెద్ద శాస్త్రీయ సంస్థ అంతేకాకుండా హెల్మ్‌హోల్ట్జ్ అసోసియేషన్‌లో భాగం.ఈ పేలుళ్లలకు సంబంధించిన సిములేషన్‌ వీడియోను ఈ సంస్థ పోస్ట్‌ చేసింది. కాగా ఈ పేలుడు నుంచి వెలువడే అత్యంత ప్రకాశంతమైన నీలి రంగు కాంతిని కొన్ని సంవత్సరాల తరువాత భూమిపై చూడవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు.

అసలు ఏంటి ఈ గామా రే పేలుళ్లు...
సాధారణంగా నక్షత్రాలు​ తమ జీవితకాలన్ని ముగిసిపోయి, సూపర్‌నోవాగా రూపాంతరం చెంది అప్రకాశవంతమైన వస్తువులుగా మారి క్రమేపి కృష్ణబిలాలుగా మారుతుంటాయి. నక్షత్రాల్లో పేలుళ్లు సంభవించినప్పుడు అత్యంత శక్తివంతమైన ఎక్స్‌ రే, గామా దృగ్విషయాలు వెలువడుతుంటాయి.  గామా-రే పేలుళ్లు సుదూరంగా ఉన్న గెలాక్సీలలో జరిగే అపారమైన శక్తివంతమైన పేలుళ్లు. ఈ పేలుళ్లు విశ్వంలో సంభవించే అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన విద్యుదయస్కాంత సంఘటనలు. గామా రే పేలుళ్లు కొన్ని సార్లు పది మిల్లీసెకన్ల నుంచి కొన్ని గంటల వరకు జరుగుతుంటాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement