8.69 శాతం వాటా కొనుగోలు
డీల్ విలువ రూ. 851 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ సిమెంట్ తాజాగా స్టార్ సిమెంట్‌లో మైనారిటీ వాటా కొనుగోలు చేస్తోంది. ప్రమోటర్ల నుంచి మొత్తం 8.69 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు అ్రల్టాటెక్ పేర్కొంది. ఇందుకు రూ. 851 కోట్లు వెచి్చంచనుంది. దక్షిణాది కంపెనీ ఇండియా సిమెంట్స్‌లో ఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అ్రల్టాటెక్ నియంత్రిత వాటాను సొంతం చేసుకుంది. మరోవైపు అదానీ గ్రూప్ సైతం ఇతర సంస్థల కొనుగోళ్లు, సొంత ప్లాంట్ల ఏర్పాటుతో సిమెంట్ రంగంలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
పోటా పోటీగా..
అటు అ్రల్టాటెక్, ఇటు అదానీ గ్రూప్ దిగ్గజం అంబుజా సిమెంట్స్ ఇతర సంస్థల కొనుగోళ్లు, సొంత ప్లాంట్ల ఏర్పాటు ద్వారా సామర్థ్య విస్తరణను చేపడుతున్నాయి. లక్ష్యాలకు అనుగుణంగా చిన్న సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. వెరసి గత రెండేళ్లలో ఇండియా సిమెంట్స్, కేశోరామ్ సిమెంట్ బిజినెస్, ఆర్‌ఏకేడబ్ల్యూసీటీని సొంతం చేసుకుంది.
ఇదేవిధంగా సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా ఇండస్ట్రీస్‌సహా ఇటీవలే ఓరియంట్ సిమెంట్‌ను అంబుజా సొంతం చేసుకుంది. తద్వారా 2024లో అదానీ సిమెంట్ సామర్థ్యం 100 ఎంటీపీఏకు చేరింది. కంపెనీ రెండేళ్ల క్రితం హోల్సిమ్ నుంచి 70 ఎంటీపీఏ సామర్థ్యాలను కొనుగోలు చేయడం ద్వారా సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది. మరోపక్క 156.66 ఎంటీపీఏ సామర్థ్యంతో అ్రల్టాటెక్ మార్కెట్ లీడర్‌గా నిలుస్తోంది. ఆధిపత్యాన్ని నిలుపుకునే బాటలో 2027కల్లా 200 ఎంటీపీఏ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
బ్లాక్ డీల్ ద్వారా
ఎన్‌ఎస్‌ఈ బ్లాక్ డీల్ గణాంకాల ప్రకారం అల్ట్రాటెక్ సిమెంట్ 3.36 కోట్లకుపైగా స్టార్ సిమెంట్ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 227.7 సగటు ధరలో వీటిని సొంతం చేసుకుంది. వీటి విలువ రూ. 766 కోట్లుకాగా.. 8.32 శాతం వాటాకు
సమానం.
స్టార్ సామర్థ్యమిలా..
మేఘాలయ సంస్థ స్టార్ సిమెంట్ 7.7 ఎంటీపీఏ స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. షేరుకి రూ. 235 మించకుండా స్టార్ సిమెంట్‌లో 8.69 శాతం వాటాకు సమానమైన 3.7 కోట్ల షేర్ల కొనుగోలుకి బోర్డు అనుమతించినట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. వెరసి రూ. 851 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో స్టార్ సిమెంట్ ప్రమోటర్ గ్రూప్‌లోని రాజేంద్ర చమారియా, ఆయన కుటుంబీకుల వాటాలను సొంతం చేసుకుంది. అయితే ఇతర ప్రమోటర్లు(సెంచురీ ప్లై) వాటాలను ఆఫర్ చేయలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్టార్ సిమెంట్‌లో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ వాటా 66.47 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment