Cement Company
-
స్టార్ సిమెంట్‌లో అ్రల్టాటెక్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ సిమెంట్ తాజాగా స్టార్ సిమెంట్‌లో మైనారిటీ వాటా కొనుగోలు చేస్తోంది. ప్రమోటర్ల నుంచి మొత్తం 8.69 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు అ్రల్టాటెక్ పేర్కొంది. ఇందుకు రూ. 851 కోట్లు వెచి్చంచనుంది. దక్షిణాది కంపెనీ ఇండియా సిమెంట్స్‌లో ఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అ్రల్టాటెక్ నియంత్రిత వాటాను సొంతం చేసుకుంది. మరోవైపు అదానీ గ్రూప్ సైతం ఇతర సంస్థల కొనుగోళ్లు, సొంత ప్లాంట్ల ఏర్పాటుతో సిమెంట్ రంగంలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. పోటా పోటీగా.. అటు అ్రల్టాటెక్, ఇటు అదానీ గ్రూప్ దిగ్గజం అంబుజా సిమెంట్స్ ఇతర సంస్థల కొనుగోళ్లు, సొంత ప్లాంట్ల ఏర్పాటు ద్వారా సామర్థ్య విస్తరణను చేపడుతున్నాయి. లక్ష్యాలకు అనుగుణంగా చిన్న సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. వెరసి గత రెండేళ్లలో ఇండియా సిమెంట్స్, కేశోరామ్ సిమెంట్ బిజినెస్, ఆర్ఏకేడబ్ల్యూసీటీని సొంతం చేసుకుంది. ఇదేవిధంగా సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా ఇండస్ట్రీస్‌సహా ఇటీవలే ఓరియంట్ సిమెంట్‌ను అంబుజా సొంతం చేసుకుంది. తద్వారా 2024లో అదానీ సిమెంట్ సామర్థ్యం 100 ఎంటీపీఏకు చేరింది. కంపెనీ రెండేళ్ల క్రితం హోల్సిమ్ నుంచి 70 ఎంటీపీఏ సామర్థ్యాలను కొనుగోలు చేయడం ద్వారా సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది. మరోపక్క 156.66 ఎంటీపీఏ సామర్థ్యంతో అ్రల్టాటెక్ మార్కెట్ లీడర్‌గా నిలుస్తోంది. ఆధిపత్యాన్ని నిలుపుకునే బాటలో 2027కల్లా 200 ఎంటీపీఏ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. బ్లాక్ డీల్ ద్వారా ఎన్ఎస్ఈ బ్లాక్ డీల్ గణాంకాల ప్రకారం అల్ట్రాటెక్ సిమెంట్ 3.36 కోట్లకుపైగా స్టార్ సిమెంట్ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 227.7 సగటు ధరలో వీటిని సొంతం చేసుకుంది. వీటి విలువ రూ. 766 కోట్లుకాగా.. 8.32 శాతం వాటాకు సమానం. స్టార్ సామర్థ్యమిలా.. మేఘాలయ సంస్థ స్టార్ సిమెంట్ 7.7 ఎంటీపీఏ స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. షేరుకి రూ. 235 మించకుండా స్టార్ సిమెంట్‌లో 8.69 శాతం వాటాకు సమానమైన 3.7 కోట్ల షేర్ల కొనుగోలుకి బోర్డు అనుమతించినట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. వెరసి రూ. 851 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో స్టార్ సిమెంట్ ప్రమోటర్ గ్రూప్‌లోని రాజేంద్ర చమారియా, ఆయన కుటుంబీకుల వాటాలను సొంతం చేసుకుంది. అయితే ఇతర ప్రమోటర్లు(సెంచురీ ప్లై) వాటాలను ఆఫర్ చేయలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్టార్ సిమెంట్‌లో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ వాటా 66.47 శాతంగా ఉంది. -
నంద్యాల జిల్లా : రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
రాంకో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి
-
రాంకో సిమెంట్ కంపెనీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్
Live Updates: పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూత: సీఎం జగన్ పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. రామ్‌కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీనే ఉదాహరణ అని సీఎం అన్నారు. పారిశ్రామిక అభివృద్ధితో ముందుకు.. మంత్రి అమర్నాథ్ ►రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధితో ముందుకు తీసుకెళుతున్నామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పరిశ్రమలకు ఎంతో పోత్సాహం ఇస్తున్నామన్నారు. సీఎం జగన్ తీసుకున్న చర్యలతోనే పెట్టుబడులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ►నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు. కొలిమిగుండ్ల(నంద్యాల జిల్లా): జిల్లా పారిశ్రామిక పథంలో పయనిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పలు కంపెనీలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో జయజ్యోతి, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండగా తాజాగా కల్వటాల వద్ద రూ.1,790 కోట్లతో రామ్‌కో కంపెనీ సిమెంట్ పరిశ్రమను నెలకొల్పింది. ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్ ను ఉత్పత్తి చేసే ఈ పరిశ్రమ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా సిమెంట్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ముడి ఖనిజపు నిల్వలు కొలిమిగుండ్ల మండలంలో అపారంగా ఉన్నాయి. రవాణా సౌకర్యం, నీటి వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. దీనికితోడు వెనుకబడిన ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దీంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. సిద్ధమైన రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో రామ్‌కో సిమెంట్ పరిశ్రమను నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కొలిమిగుండ్ల, నాయినపల్లె, కల్వటాల, ఇటిక్యాల, చింతలాయిపల్లె, కనకాద్రిపల్లె గ్రామాల రైతుల నుంచి దశల వారీగా 5 వేల ఎకరాల భూమిని సేకరించారు. 2018 డిసెంబర్ 14లో పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేయగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం విధానాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా అడుగులు వేయడంతో రామ్‌కో సిమెంట్ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల అనుమతులు చకచకా లభించాయి. తర్వాత నిర్మాణ పనులు సాగుతున్న సమయంలో కరోనా ఎఫెక్ట్‌తో పనులకు కొంత కాలం బ్రేక్ పడినా ఆ తర్వాత యుద్ధప్రాతిపదికన చేపట్టి నిర్మాణం పూర్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం సైతం పూర్తి సహకారం అందించింది. పరిశ్రమకు ప్రధానంగా నీటి వనరులు అవసరం. ఎక్కువ లోతులో బోర్లు వేసి భారీ మోటార్ల సాయంతో నీటిని పంపింగ్ చేస్తే సమీప గ్రామాల్లో సాగు, తాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో అవుకు రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీళ్లను పైపులైన్ ద్వారా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి భారీ బడ్జెట్‌తో ఏర్పాటు చేసిన రామ్‌కో పరిశ్రమలో ఏడాదికి 2.0 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయనున్నారు. 30 మెగా వాట్ల థర్మల్ ప్లాంట్‌ను కంపెనీ సొంతంగా ఏర్పాటు చేసుకుంది. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలిచ్చింది. త్వరలోనే మరో 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ పరిశ్రమ ద్వారా పరోక్షంగా మరి కొంత మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే ఫ్యాక్టరీ ఏర్పాటుతో కొలిమిగుండ్లలో ఇళ్ల స్థలా లతో పాటు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. సీఎస్ఆర్ కింద అభివృద్ధి పనులు కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద పరిశ్రమల పరిధిలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది. 2019 నుంచి 2022 వరకు సీఎస్ఆర్ కింద రూ.8.5 కోట్లు ఖర్చు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. -
అదానీ కీలక నిర్ణయం: కరణ్ అదానీ చేతికి ఏసీసీ పగ్గాలు
న్యూఢిల్లీ: స్విస్ సిమెంట్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన ఇండియా బిజినెస్‌ల కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. తద్వారా ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ గ్రూప్ దేశీయంగా రెండో అతిపెద్ద సిమెంట్ దిగ్గజంగా ఆవిర్భవించింది. కాగా అదానీ పెద్దకుమారుడు కరణ్‌కు ఏసీసీ బాధ్యతలు అప్పగించినట్లు గ్రూప్ తాజాగా పేర్కొంది. 6.5 బిలియన్ డాలర్లకు హోల్సిమ్ నుంచి సొంతం చేసుకున్న తదుపరి ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లను పూర్తి చేసినట్లు తెలిపింది. అదానీ గ్రూప్ టేకోవర్ పూర్తయిన వెంటనే రెండు కంపెనీల బోర్డు డైరెక్టర్లు రాజీనామాలు చేసినట్లు వెల్లడించింది. (Gautam Adani: దూకుడు మామూలుగా లేదుగా! ఏకంగా బెజోస్‌కే ఎసరు) గౌతమ్ అదానీ అధ్యక్షతన గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ అంబుజా సిమెంట్స్‌కు అధ్యక్షత వహించ నున్నారు. ప్రస్తుతం పోర్టు బిజినెస్‌లు చూస్తున్న కరణ్ అదానీ ఏసీసీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అంబుజా బోర్డులో, ఇంధన దిగ్గజం షెల్ ఇండియా మాజీ హెడ్ నితిన్ శుక్లా ఏసీసీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంబుజా సీఈవోగా అజయ్ కుమార్, ఏసీసీ సీఈవోగా శ్రీధర్ బాలకృష్ణన్ వ్యవహరించనున్నారు. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ఇదీ చదవండి: Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్ -
అల్ట్రాటెక్ వేల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ సామర్థ్య విస్తరణ బాట పట్టింది. దీనిలో భాగంగా ప్రస్తుత ప్లాంట్ల సామర్థ్య పెంపు, కొత్త యూనిట్ల ఏర్పాటును చేపట్టనుంది. ఇందుకు రూ. 12,886 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. తద్వారా 22.6 మెట్రిక్ టన్నుల వార్షిక(ఎంటీపీఏ) సామర్థ్యాన్ని జత చేసుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలిపింది. తాజాగా సమావేశమైన బోర్డు ఈ ప్రతిపాదనలను అనుమతించినట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ దిగ్గజం పేర్కొంది. భవిష్యత్ వృద్ధికి వీలుగా పెట్టుబడులను వెచ్చించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అల్ట్రాటెక్ 120 ఎంటీపీఏ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత విస్తరణలు పూర్తయితే కంపెనీ మొత్తం సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 159 ఎంటీపీఏను దాటనుంది. -
ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ...భారత్‌కు గుడ్‌బై..!
ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ హోల్సిమ్ గ్రూప్ (హోల్డర్‌ఇండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్- Holcim Group) భారత్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. కంపెనీ గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా..భారత్ నుంచి తమ వ్యాపారాలకు స్వస్తి పలుకుతూ కోర్ మార్కెట్లపై హోల్సిమ్ గ్రూప్ దృష్టి సారించనున్నట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. గత పదిహేడుళ్లుగా హోల్సిమ్ గ్రూప్ భారత్ మార్కెట్లలో తమ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇక హోల్సిమ్ గ్రూప్‌కు చెందిన రెండు లిస్టెడ్ కంపెనీలోని వాటాలను కూడా విక్రయించేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ గ్రూప్..అంబుజా సిమెంట్, ఎసీసీ సిమెంట్ కంపెనీల్లో వాటాలను కల్గి ఉంది. అంబుజా సిమెంట్స్‌లో 63.19 శాతం, ఎసీసీ కంపెనీలో 4.48 శాతం వాటాలను హోల్సిమ్ గ్రూప్ కల్గి ఉంది. హోల్సిమ్ గ్రూప్ తీసుకున్న నిర్ణయంతో సిమెంట్ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఆయా రంగ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ఇరు కంపెనీల వాటాలను అదానీ గ్రూప్స్, జెఎస్‌డబ్య్లూ సిమెంట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటాల విక్రయంతో రుణ భారం తగ్గించుకోవాలని హోల్సిమ్ గ్రూప్ చూస్తోంది. అలాగే కొనుగోళ్ల ద్వారా పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫైడ్ చేసుకోవాలని భావిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో హోల్సిమ్ గ్రూప్ తన బ్రెజిలియన్ యూనిట్‌ను సుమారు ఒక బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఇక భారత్‌లో పాటుగా జింబాబ్వేలోని వ్యాపారాలను కూడా విక్రయించేందుకు సిద్దమైన్నట్లు సమాచారం. కారణం అదే..! హోల్సిమ్ గ్రూప్ ఆయా దేశాల నుంచి నిష్క్రమించేందుకు సిద్దమవుతోంది. స్పెషాలిటీ బిల్డింగ్ సొల్యూషన్స్, హై ఎండ్ ఎనర్జీ ఎఫిసియెంట్ రెనోవేషన్స్ వంటి విభాగాలపై హోల్సిమ్ గ్రూప్ ఫోకస్ చేయనుంది. ‘స్ట్రాటజీ 2025 ఆక్సల్రెటింగ్ గ్రీన్ గ్రోత్ ప్రోగాం’లో భాగంగా ఆయా దేశాల నుంచి నిష్క్రమించేందుకు హోల్సిమ్ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా కంపెనీ డిసెంబర్ 2021లో మలర్కీ రూఫింగ్ ఉత్పత్తులను, 2021 ప్రారంభంలో ఫైర్‌స్టోన్ బిల్డింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. చదవండి: విలీన బాటలో దిగ్గజ ఐటీ కంపెనీలు? -
అ్రల్టాటెక్ లాభం రూ. 1,310 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అ్రల్టాటెక్ సిమెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో అంతంతమాత్ర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్(క్యూ2)లో యథాతథంగా రూ. 1,310 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు పెట్ కోక్ ధరలు భారీగా పెరగడం ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం 16 శాతం ఎగసి రూ. 12,017 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 10,387 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక ఈ క్యూ2లో మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 10,209 కోట్లను అధిగమించాయి. కోల్, పెట్ కోక్ ధరలు రెట్టింపుకావడంతో ఇంధన వ్యయాలు 17 శాతం అధికమైనట్లు కంపెనీ తెలియజేసింది. అయితే విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం, నిర్వహణ సామర్థ్యంపై దృష్టిపెట్టడం ద్వారా కొంతమేర వ్యయాలను అదుపు చేసినట్లు తెలియజేసింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో మధ్యప్రదేశ్‌లోని బిచర్‌పూర్ కోల్ బ్లాకులో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభంకాగలవని కంపెనీ అంచనా వేస్తోంది. తద్వారా బొగ్గు కొనుగోళ్లపై ఆధారపడటాన్ని తగ్గించుకునే యోచనలో ఉంది. అమ్మకాలు అప్..: క్యూ2లో సిమెంట్ అమ్మకాలు 8% పుంజుకుని 21.64 మిలియన్ టన్నులను తాకాయి. ఈ అక్టోబర్‌లో 1.2 ఎంటీపీఏ సిమెంట్ సామర్థ్యం అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. బీహార్‌లోని పాట లీపుత్ర సిమెంట్ వర్క్స్, పశి్చమ బెంగాల్‌లోని డాంకునీ సిమెంట్ వర్క్స్ యూనిట్లు ప్రారంభమైనట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో అ్రల్టాటెక్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 7,395 వద్ద ముగిసింది. -
త్రిసూల్ సిమెంట్ కంపెనీ లీజు రద్దు
సాక్షి, అనంతపురం : జిల్లాలోని యాడికిలో మెస్సర్స్ త్రిసూల్ సిమెంట్ కంపెనీ లీజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెకార్ట సున్నపురాతి గనుల లీజు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి.. మరో ఐదేళ్ల పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడనందునే లీజు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
స్టాక్స్ వ్యూ
ప్రస్తుత ధర: రూ.756 టార్గెట్ ధర: రూ.1,057 ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం నాలుగు విభాగాల్లో–వీఎస్ఎఫ్, సిమెంట్, రసాయనాలు, టెక్స్‌టైల్స్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిల్లో వీఎస్ఎఫ్, సిమెంట్ కీలక విభాగాలు. ఈ కంపెనీ మొత్తం ఆదాయం, నిర్వహణ లాభాల్లో ఈ రెండు విభాగాల వాటా దాదాపు 90 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వీఎస్ఎఫ్, కాస్టిక్ సోడా ధరలు అంతర్జాతీయంగా బలహీనంగా ఉండటంతో నిర్వహణ లాభం(స్టాండ్అలోన్) అంచనాల మేరకు పెరగలేదు. వీఎస్ఎఫ్(విస్కోస్ స్టేపుల్ ఫైబర్–నూలు లాగానే ఉండే బయోడిగ్రేడబుల్ ఫైబర్. దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్, డ్రెస్ మెటీరియల్, లో దుస్తుల తయారీలో దీనిని వినియోగిస్తారు) కు సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం వంద శాతాన్ని వినియోగించుకున్నా, అమ్మకాలు 3 శాతమే పెరిగాయి. డిమాండ్ బలహీనంగా ఉండటం, దిగుమతులు పెరగడంతో కెమికల్స్ విభాగం పనితీరు అంచనాలను అందుకోలేకపోయింది. అమ్మకాలు 7 శాతం తగ్గగా, మార్జిన్లు 8 శాతం తగ్గి 20 శాతానికే పరిమితమైంది. దేశంలోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీ అయిన అ్రల్టాటెక్ సిమెంట్‌లో 57.3 శాతం వాటా ఉండటం, స్టాండ్అలోన్ వ్యాపారాలు నిలకడైన వృద్ధిని సాధిస్తుండటం, వీఎస్ఎఫ్ వ్యాపారంలో దాదాపు గుత్తాధిపత్యం ఉండటం, వీఎస్ఎఫ్, రసాయనాల విభాగాల ఉత్పత్తి సామర్థ్యాలు పెరుగుతుండటం, ఏబీ క్యాపిటల్, ఇతర కంపెనీల్లో వాటాలుండటం... సానుకూలాంశాలు. మరో గ్రూప్ కంపెనీ వొడాఫోన్ ఐడియా రుణ భారం భారీగా ఉండటం, (ఈ రుణానికి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఎలాంటి కార్పొరేట్ గ్యారంటీని ఇవ్వకపోవడంతో ఇది పెద్ద ప్రతికూలాంశం కాబోదు), సిమెంట్, వీఎస్ఎఫ్ ధరలు తగ్గే అవకాశాలు, వీఎస్‌ఎఫ్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు పెరిగే అవకాశాలు.... ప్రతికూలాంశాలు. బాటా ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,736 టార్గెట్ ధర: రూ.1,955 ఎందుకంటే: బాటా ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థికఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. మందగమన నేపథ్యంలో కూడా ఈ కంపెనీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.722 కోట్లకు పెరిగింది. ప్రీమియమ్(ఖరీదైన) ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా స్థూల మార్జిన్లు 60 బేసిస్ పాయింట్లు పెరిగి 54.4 శాతానికి, నిర్వహణ లాభ మార్జిన్ అర శాతం పెరిగి 13.5 శాతానికి పెరిగాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా నికర లాభం 27 శాతం ఎగసి రూ.71 కోట్లకు పెరిగింది. కొత్త ట్రెండీ కలెక్షన్లను అందుబాటులోకి తెస్తుండటం, మార్కెటింగ్ వ్యయాలు పెంచుతుండటం, ప్రస్తుత స్టోర్ మోడళ్లను రీ డిజైనింగ్ చేయడం తదితర చర్యల కారణంగా ఈ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ‘మాస్’ నుంచి ‘ప్రీమియమ్’కు మారుతోంది. ఫ్రాంచైజీ స్టోర్స్‌తో కలుపుకొని దేశవ్యాప్తంగా 1,420 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. ఐదేళ్లలో 500 ఫ్రాంచైజీ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు, యువత కేటగిరీలో కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుండటం, ప్రీమియమ్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరిస్తుండటం, ప్రకటనల కోసం అధికంగానే ఖర్చు చేస్తుండటం, స్థూల లాభం మెరుగుపడే అవకాశాలుండటం, ఎలాంటి రుణ భారం లేకపోవడం, రూ.800 కోట్ల మేర నగదు నిల్వలు ఉండటం....సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 11 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. -
సిమెంటు కంపెనీల ఒప్పందాలతో లాభం: రైల్వే జీఎం
సాక్షి, హైదరాబాద్: సిమెంటు కంపెనీలతో ఒప్పందాల వల్ల సరుకు రవాణా రూపంలో రైల్వేకు ఆదాయం పెరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పేర్కొన్నారు. స్థిరమైన రేట్లు, రాయితీల వల్ల ఆయా కంపెనీలకు కూడా మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.సికింద్రాబాద్ రైల్ నిలయంలో శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ సంస్థలు దీర్ఘకాలిక సరుకు రవాణా ధర ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆయన చెప్పారు. వినియోగదారుడు ఒకసారి రైల్వే దీర్ఘకాల ధర సూచి ఒప్పందం(లాంగ్ టర్మ్ టారిఫ్ కాంట్రాక్ట్)లో చేరితే ఒక ఏడాది వరకు సరుకు రవాణా ధరలలో మార్పు ఉండదు. దీనివల్ల వినియోగదారుడు ఒక సంవత్సరం వరకు స్థిరమైన సరుకు రవాణా ధరకు అనుగుణంగా వ్యవస్థాగత ప్రణాళిక వేసుకోవడానికి వీలవుతుందన్నారు. ముందు సంవత్సరం కంటే మరింత ఎక్కువగా రవాణా పెరిగితే ఈ ఒప్పందం ప్రకారం సరుకు రవాణా వినియోగదారుకు చార్జీలో రాయితీ రూపంలో ఎన్నో ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయన్నారు. దీనికి పెరుగుదలతో సంబంధం ఉన్న రాయితీ కనుక గతేడాది కంటే ఎంత ఎక్కువగా సరుకు రవాణా చేస్తే అంత ఎక్కువగా రాయితీలు ఉంటాయన్నారు. ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్. మధుసూదన రావు, ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బ్రజేంద్ర కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె. శివప్రసాద్, చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ఫ్రైట్ సర్వీసెస్) డా.బి.ఎస్.క్రిష్టోఫర్, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ డెరెక్టర్(మార్కెటింగ్) కృష్ణ శ్రీవాస్తవ ఈ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలో ఎం/ఎస్. పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ 8వది కాగా మిగతా 7 కంపెనీల్లో ఎం/ఎస్. అల్ట్రాటెక్, ఓరియంట్, కేశోరాం, మై హోం, రామ్‌కో, జువారి, భారతీ సిమెంట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. -
సిమెంట్ అక్రమ వ్యాపార కేంద్రంపై దాడులు
చౌటుప్పల్ (మునుగోడు) : అక్రమంగా సాగిస్తున్న సిమెంట్ వ్యాపార కేంద్రంపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మికంగా దా డులు నిర్వహించారు. ట్యాంకర్ల నుంచి అక్రమ పద్ధతుల్లో సిమెంట్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులతోపాటు కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. సిమెంట్ ట్యాంకర్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. రూ.11,500 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ఏరుకొండ వెంకటయ్య సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన నీల మల్లేశం లారీ డ్రైవర్‌గా, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రా మానికి చెందిన రుద్రాక్షి నరహరి క్లీనర్‌గా సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ప్రాం తంలోని మైహోం ఇండస్ట్రీస్ నుంచి ఏపీ24 డ బ్ల్యూ 4073 నంబరు గల ట్యాంకర్ లారీలో సిమెంట్‌ను తీసుకుని హైదరాబాద్‌లోని ఆ కంపెనీకి చెందిన గోదాముకు వెళ్లారు. అక్కడ లారీలోని సిమెంట్‌ను ఖాళీ చేసి తిరిగి కంపెనీకి బయలుదేరారు. ఈ క్రమంలో మండల కేంద్రం లోనే నివాసం ఉంటున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన దేశగోని సుధాకర్ ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన సిమెంట్ కొనుగోలు కేంద్రానికి వెళ్లారు. అప్పటికే తమకు అందిన సమాచారం ప్రకారం ఎస్ఓటీ పోలీసులు సమీపంలో మాటువేసి ఉన్నారు. ట్యాంకర్ నుంచి సిమెంటును బస్తాల్లోకి నింపుతున్న క్రమంలో పట్టుకున్నారు. 350 సిమెంటు బస్తాల సిమెంట్ స్వాధీనం సుధాకర్‌కు చెందిన అక్రమ కొనుగోలు కేంద్రంలో దాడులు చేసిన ఎస్ఓటీ పోలీసులు 350 సిమెంటు బస్తాలు లభ్యమయ్యాయి. సిమెంటును దిగుమతి చేస్తున్న లారీ సైతం పట్టుబడింది. లారీడ్రైవర్, క్లీనర్ల వద్ద రూ.11,750 నగదు, రెండు సెల్ఫోన్లు లభ్యమయ్యాయి. వీరిద్దరితో పాటు కొనుగోలుదారుడైన సుధాకర్‌ను అరెస్టు చేశారు. మరోసారి చిక్కితే పీడీయాక్ట్ సిమెంటు అక్రమ వ్యాపారం నిర్వహించే వ్యక్తులతో పాటు సిమెంటును విక్రయించే లారీ డ్రైవర్లు, క్లీనర్లపై నిఘా పెంచామని సీఐ తెలిపారు. ఒకసారి పట్టుబడిన వ్యక్తులు మరోసారి చిక్కితే పీడీయాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్తున్న సిమెంటు లారీ వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న అక్రమ వ్యాపారులకు విక్రయిస్తున్న లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని గుర్తుచేశారు. ఈ తతంగంలో సంబంధిత సిమెంటు గోదాముల వద్ద పనిచేసే వ్యక్తుల సహకారం సైతం ఉందని తెలిపారు. పట్టుబడిన వ్యక్తులను రిమాండ్ నిమిత్తం రామన్నపేట కోర్టుకు తరలించామని సీఐ వివరించారు. సమావేశంలో స్థానిక ఎస్ఐ ఎన్.నవీన్‌బాబు, ఎస్ఓటీ ఎస్ఐ లక్ష్మీనారాయణ ఉన్నారు. -
సిమెంట్ కంపెనీలకు షాక్..!
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్ఏటీ) సిమెంట్ కంపెనీలకు చుక్కెదురయ్యింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన పెనాల్టీని సవాలు చేస్తూ 11 సిమెంట్ సంస్థలు పెట్టుకున్న అభ్యర్ధనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఈ తీర్పు వెలువడిన తరువాత స్టాక్ మార్కెట్లో సిమెంట్ రంగ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇంట్రాడేలో 14 శాతం వరకు నష్టపోయాయి. మార్కెట్ ముగింపు సమయానికి 3 శాతం నష్టాన్ని నమోదుచేశాయి. ఇండియా సిమెంట్స్ 3.29 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.39 శాతం, అంబుజా సిమెంట్స్ 1.50 శాతం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 1.31 శాతం, జెకె లక్ష్మీ సిమెంట్ 1.26 శాతం, ఏసీసీ 0.28 శాతం నష్టపోయాయి. సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సీఎమ్ఏ), అల్ట్రాటెక్, ఏసీసీ, రామ్‌కో, జేకే సిమెంట్, అంబుజా సహా 11 సిమెంట్ సంస్థలు కార్టెల్‌గా ఏర్పడి ధరలను నియంత్రించాయని పేర్కొంటూ... 2016 అగస్టులో సీసీఐ ఈ సంస్థలపై రూ.6,700 కోట్ల పెనాల్టీని విధించింది. -
టాప్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ కాల్చివేత
ఓ టాప్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. నైజిరియాకు చెందిన డాగెంట్ సిమెంట్ కంపెనీకి కంట్రీ మేనేజర్‌గా పనిచేస్తున్న దీప్ కామ్రాను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇథియోపియాలో హత్య చేసినట్టు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా వారు హత్య చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి అడ్డిస్ అబాబాకు తిరుగు ప్రయాణమైన దీప్ కామ్రాను ఓరోమియా ప్రాంతంలో దుండగులు అడ్డగించి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కామ్రాతో పాటు ఆయన సెక్రటరీ, డ్రైవర్ కూడా మరణించినట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆ దుండగులను పట్టుకోవడానికి సెక్యురిటీ బలగాలు రంగంలోకి దింపినట్టు పేర్కొంది. నైజిరియాకు చెందిన డాంగెట్ కంపెనీ ఆఫ్రికాలో 10 ప్రాంతాల్లో తన కార్యకాలపాలను సాగిస్తోంది. ఇథియోపియాలో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారిగా డాంగెట్ కంపెనీ ఉంది. అత్యధిక నైపుణ్యమున్న 32.5, 42.5 గ్రేడ్ సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తూ.. మార్కెట్ అవసరాలను ఇది అతి సులువుగా చేధిస్తోంది. -
సిమెంట్ ధరలను కృత్రిమంగా పెంచేశారు
♦ రాత్రికి రాత్రే 60–70 శాతం పెరిగిన ధరలు ♦ 50 కిలోల బస్తా రూ.310–340 ♦ ధరల అదుపులో ప్రభుత్వం జోక్యం అవసరం: డెవలపర్ల జేఏసీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ కంపెనీలన్నీ ఒక జట్టుగా ఏర్పడి.. 50 కిలోల సిమెంట్ బస్తా ధరను రాత్రికి రాత్రే 60–70 శాతం వరకూ పెంచేశాయని రాష్ట్ర నిర్మాణ సంఘాల జేఏసీ చైర్మన్ ఎస్.రాంరెడ్డి విమర్శించారు. మార్చిలో రూ.210–230 మధ్య ఉన్న ధరను కాస్తా.. కృత్రిమ కొరతను సృష్టించి ఒక్కసారిగా రూ.310–340కి చేర్చారని ఆరోపించారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే సిమెంట్ కొనుగోళ్లను నిలిపివేయటమో లేక సీసీఐకి (కాంపీటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా) ఫిర్యాదు చేయడమో చేస్తామని హెచ్చరించారు. లక్షలాది మంది ఆధారపడ్డ నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేస్తోన్న ఈ పెంపుదలపై ప్రభుత్వం జోక్యం కల్పించుకొని ధరలను తగ్గించాలని కోరారు. ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సిమెంట్ వార్షిక వినియోగం 22–24 మిలియన్ టన్నులుంటుంది. రెండు రాష్ట్రాల్లో 20కి పైగా సిమెంట్ తయారీ సంస్థలున్నాయి. దేశం మొత్తం సిమెంట్ ఉత్పత్తిలో 26 శాతం వాటా ఈ రెండు రాష్ట్రాలదే. అయినా సరే మన దగ్గరి కంటే మహారాష్ట్ర, కేరళ వంటి ఇతర రాష్ట్రాల్లోనే ధరలు తక్కువగా ఉండటం ఆశ్చర్యకరం’’ అన్నారాయన. సిమెంట్ ధరలతో ఇళ్ల ధరలు పెరగడమే కాకుండా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు ఆలస్యమవుతాయని, ప్రత్యేకించి అందుబాటు గృహాలపై మరింత భారం పడుతుందని తెలియజేశారు. ‘‘సిమెంట్ ధరల ప్రభావం నిర్మాణ సంస్థల మీదే కాకుండా వ్యక్తిగతంగా ఇళ్లను నిర్మించుకునే వారి మీద కూడా పడుతుంది. సిమెంట్ వినియోగంలో డెవలపర్లు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఏజెన్సీల వాటా 20–25 శాతవరకుంటే.. సామాన్యులది 70–75 శాతం వరకూ ఉంటుంది’’అని జేఏసీ కన్వినర్ జీ రాంరెడ్డి వివరించారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్), తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ)లు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. దీనికి చైర్మన్‌గా ఎస్ రాంరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇందులో 600 మంది డెవలపర్లు, 1,000 మంది చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో–కన్వినర్లు ఎస్ఎన్ రెడ్డి, పీ రవిందర్ రావు, జీవీ రావు, జే వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ పీ రామకృష్ణా రావు పాల్గొన్నారు. -
సిమెంట్ కంపెనీలతో..కేసీఆర్ కుమ్మక్కు..!
గుర్రం ముందు గడ్డికట్టి పరిగెత్తించినట్టు రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన సాగుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం దేవరకొండలో నిర్వహించిన జన ఆవేదన సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మూడోరోజే కేసీఆర్ సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారని పొన్నాల ఆరోపించారు. దేవరకొండ : గుర్రం ముందు గడ్డి కట్టి పరిగెత్తించిన చందంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి విమర్శిం చారు. దేవరకొండలో నిర్వహించిన జన ఆవేదన సమ్మేళనంలో వారు మాట్లాడారు. 2004 ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతులకు ఉచిత కరెంట్ ఫైలుపై సంతకం చేస్తే, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మూడో రోజే సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కై వాటి ధరలు పెంచారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కొన్ని లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తే కేసీఆర్ మాత్రం రెండు గదుల ఇళ్లు రెండు గ్రామాల్లో కట్టి డబుల్ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు గాని, సామాన్య ప్రజానికానికి చేస్తున్నది ఏమీ లేదని అన్నారు. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏక వ్యక్తి పాలన నడుస్తోందని, ప్రజలను పాలించే నైతిక హక్కు ఈ రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం కోల్పోయిందన్నారు. అందుకే ప్రజల్లోకి వెళ్లడానికి జన ఆవేదన సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ నేత కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వినోద్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్‌లాల్‌నాయక్, వడ్త్యా రమేశ్, మాజీ జెడ్పీటీసీ గుంజ రేణుక, నారాయణ, సత్యనారాయణరెడ్డి, నాయకుడు ఎండీ.యూనూస్, పెద్దయ్య, మన్మథరెడ్డి, కిషన్, ఉమర్, నాగేశ్వర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. బతుకు తెలంగాణ కావాలి : పొన్నాల కొండమల్లేపల్లి : తెలంగాణలో ప్రజలకు బంగారు తెలంగాణ కాదు.. బతుకు తెలంగాణ కావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, జన ఆవేదన కార్యచరణ కమిటీ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ సేకరణ చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. సమావేశంలో నాయకులు యుగేందర్‌రెడ్డి, ఉట్కూరి వేమన్‌రెడ్డి, ప్రమీల వెంకటేశ్, బొడిగె శంకర్‌గౌడ్, పానుగంటి శ్రీకాంత్, జయశంకర్, దామోదర్‌రెడ్డి, శ్రీకాంత్ తదితరులున్నారు. -
లఫార్జ్ భారత చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉజ్వల్ భర్తియ
ముంబై : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సిమెంట్ కంపెనీ లఫార్జ్ భారత కార్యకలాపాల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉజ్వల్ భర్తియ నియమితులయ్యారు. ఇదివరకు కంపెనీ భారత కార్యకలాపాలను మార్టిన్ రిగ్నర్ పర్యవేక్షించేవారు. ఉజ్వల్ భర్తియ గత 16 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన గతంలో లఫార్జ్ భారత మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. -
కుట్ర బట్టబయలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు సరస్వతి సిమెంట్స్‌కు చెందిన భూముల విషయంలో జరిగిన వివాదం వెనుక పెద్ద భాగోతమే నడిచింది. భూమి లేకుండా సిమెంట్ కంపెనీ ప్రతినిధులపై దౌర్జన్యానికి దిగి ఒకరు, తనపై తానే కిరోసిన్ పోసుకుని సిమెంట్ కంపెనీ ప్రతినిధులే తనపై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని మరొకరు తప్పుడు కేసులు పెట్టారు. రెండు రోజుల తరువాత అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇవీ... మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలోని సరస్వతి సిమెంట్స్‌కు భూములు అమ్మిన రైతుల్లో కొందరు పత్తిపంటను వేయగా, దానిని తొలగించేందుకు సిమెంట్ కంపెనీ ప్రతినిధులు ఈనెల 8వ తేదీన ప్రయత్నించారు. దీనిని నిలువరించేందుకు రైతులతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కంపెనీ ప్రతినిధులతో వివాదానికి దిగారు. భూములు అమ్మినవారిలో చెన్నాయపాలెం గ్రామానికి చెందిన బండ్ల గురులక్ష్మి కూడా ఉన్నారు. ఆమె మూడు ఎకరాలు అమ్మారు. అయితే ఆమె విశాఖపట్నంలోని తన కుమారుల వద్ద ఉంటోంది. పిడుగురాళ్లలో నివసిస్తున్న ఆమె కుమార్తె గద్దె పూర్ణమ్మ టీడీపీ నేతల చెప్పుడు మాటలు విని ఆ భూమిలో పత్తి పంటను సాగు చేసింది. వారానికి ఒకసారి పిడుగురాళ్ల నుంచి వచ్చి పొలాన్ని పరిశీలించి వెళుతోంది. ఈ క్రమంలో 8వ తేదీన సిమెంట్ కంపెనీ ప్రతినిధులు తన భూమిలోని పంటను తొలగిస్తున్నారని తెలుసుకుని పూర్ణమ్మ కిరోసిన్ డబ్బాతో పొలానికి చేరుకొని సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో వివాదానికి దిగింది. ఆ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రోద్బలంతో ఆమె కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని సిమెంట్ కంపెనీ ప్రతినిధులపై బెదిరింపులకు దిగింది. దీనిని అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఈ విషయం తెలియని టీడీపీ నేతలు సరస్వతీ సిమెంట్స్ ప్రతినిధులపై, వారికి మద్దతుగా వచ్చిన వారిపై తప్పుడు కేసును బనాయించేందుకు మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఆమెపై సరస్వతి సిమెంట్ కంపెనీ ప్రతినిధులు, వారి మద్దతుదారులు కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొనగా 307 సెక్షన్‌కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, అదే గ్రామానికి చెందిన బచ్చలపూడి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 250 మందిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన రవికి సరస్వతీ సిమెంట్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూముల్లో సెంటు భూమి కూడా లేకపోవడం గమనించదగిన విషయం. భూమి లేని రవి అసలు అక్కడకు ఎందుకు వచ్చాడో టీడీపీ నేతలకే తెలియాలి. ఈ రెండు సంఘటనలు బట్టి చూస్తే సరస్వతి సిమెంట్స్ యాజమాన్యంపై టీడీపీ నేతలు మోపిన కేసులన్నీ తప్పుడు కేసులు, నిరాధారమైవని స్పష్టమవుతోంది. -
సిమెంటుకు తయారీ మంట!
భారంగా విద్యుత్, బొగ్గు, రవాణా చార్జీలు - తప్పనిసరి పరిస్థితుల్లో ధర పెంపు - ధర పెంచకపోతే ప్లాంట్ల మూసివేతే - రైల్వే చార్జీలతో మరోసారి పెంచాల్సివస్తోంది - ‘సాక్షి’తో సిమెంటు కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ వ్యయం అంతకంతకూ పెరుగుతుండడంతో సిమెంటు కంపెనీలకు పాలుపోవడం లేదు. ముడి పదార్థాలు, విద్యుత్, బొగ్గు, రవాణా వ్యయాలు, బ్యాంకు వడ్డీలు ఏడాదికేడాది భారంగా పరిణమిస్తున్నాయి. దీంతో సిమెంటు తయారీ వ్యయం అదే స్థాయిలో దూసుకెళ్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు ప్లాంట్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ధర పెంచకపోతే మరిన్ని ప్లాంట్ల మూసివేత తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేస్తున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ధర పెంచక తప్పలేదని పేర్కొంటున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు రైల్వే సరుకు రవాణా చార్జీలు తాజాగా 6.5 శాతం పెరిగాయి. పరిశ్రమకు మరింత భారం పడ్డట్టేనని, దీని ప్రభావంతో మరోసారి ధర పెంచక తప్పదని కంపెనీలు అంటున్నాయి. దూసుకెళ్తున్న వ్యయం.. సిమెంటు తయారీకి రూ.155-165, ఎక్సైజ్ పన్ను రూ.41, వ్యాట్ రూ.46, రవాణా రూ.55-80 కలుపుకుంటే మొత్తం వ్యయం ఒక్కో బస్తాకు రూ.297-332 అవుతోంది. దీనికి హ్యాండ్లింగ్ చార్జీలు, డీలర్/ఏజెంట్ కమిషన్ అదనం. భారీ పెట్టుబడితో కూడుకున్న రంగం కాబట్టి బస్తా అమ్మకం ధర రూ.300 లోపు ఉంటే కంపెనీలకు నష్టమేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. డిమాండ్ తక్కువగా ఉండడంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించి వేశాయి. అయితే స్థిర వ్యయాలైన తరుగుదల, వడ్డీ, పరిపాలన తదితర వ్యయాలు మిగిలిన ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో సిమెంటు ధర పెరిగేందుకు ఒక కారణమవుతోంది. మూడేళ్లలో విద్యుత్ చార్జీలు 70% దాకా పెరిగాయి. ఇక నాణ్యమైన బొగ్గు కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇండోనేసియా నుంచి దిగుమతైన బొగ్గు టన్నుకు నాలుగేళ్ల క్రితం రూ.4 వేలుంటే, నేడు రూ.5 వేలకు చేరుకుంది. దేశీయ బొగ్గు కొరత కారణంగా టన్నుకు రూ.3,750 నుంచి రూ.5,500లకు చేరిం ది. డీజిల్ లీటరుకు రూ.44 నుంచి రూ.61కి చేరింది. దీంతో సిమెంటు ధర కూడా హెచ్చించాల్సివస్తోందని కంపెనీలు వాపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల కంటే తక్కువే.. సమైక్య రాష్ట్రంలో గతేడాది జూలై ప్రాంతంలో సిమెంటు ధర బస్తాకు (50 కిలోలు) రకాన్నిబట్టి రూ.320 దాకా వెళ్లింది. అది కాస్తా తర్వాతి నెలల్లో రూ.200-235కు వచ్చి చేరింది. సిమెంటుకు గిరాకీ లేకపోవడమే ధర క్షీణతకు కారణం. 2014 మే నుంచి ధరల్లో పెరుగుదల వచ్చింది. సీమాంధ్ర, తెలంగాణలో ఒక దశలో బస్తా ధర రూ.340 దాకా వెళ్లినప్పటికీ తిరిగి రూ.300-325 మధ్య ప్రస్తుతం నిలకడగా ఉంది. ఉత్తరాదితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఒక్కో బస్తాకు రూ.380 వరకు ధర ఉందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమిళనాడులో రూ.370-380, కేరళలో రూ.370, కర్ణాటకలో రూ.350 వరకు ఉందని పేర్కొన్నారు. అటు మహారాష్ట్రలోనూ ధరలు పెరిగాయి. ఈ రాష్ట్రాల కంటే ఇక్కడే ధర తక్కువగా ఉందని ఆయన తెలిపారు. తయారీ వ్యయాలు ఎగుస్తున్నందునే ధరల్ని వాటికి అనుగుణంగా స్థిరీకరణ చేయాల్సి వచ్చిందని చెప్పారు. తాజాగా పెరిగిన రైల్వే సరుకు చార్జీల ప్రభావంతో సిమెంటు ధర ఒక్కో బస్తాకు రూ.10 వరకు పెరగనుందని పేర్కొన్నారు. 2014 జనవరి-మార్చి త్రైమాసికంలో చాలా కంపెనీలు నష్టాలను చవిచూడడాన్నిబట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితి అద్ధం పడుతుందని ప్రముఖ కంపెనీ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. అనిశ్చితి కారణంగా.. గత మూడేళ్లుగా సమైక్య రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. ఈ కారణంగా సిమెంటుకు ఆయువు పట్టు అయిన నిర్మాణ రంగం కుదేలైంది. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులే దని చెప్పారు. అటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలూ ఏవీ జరగలేదు. దీంతో సిమెంటుకు గిరాకీ లేకుండా పోయిందని ఓ కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించారు. -
పురచేత్తో పెంపు.. కుడిచేత్తో కోత..
కుడిచేతితో చేసిన దానం ఎడమచేతికి తెలియనివ్వరాదు’ అన్నది పెద్దల సూక్తి. ‘పురచేత్తో పెంచిన రుణసాయానికి కుడిచేతితో కోత పెట్టాలి’.. ఇదీ ఇప్పటి సర్కారు యుక్తి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రవేశ పెట్టిన ‘ఇందిరమ్మ’ పథకం లబ్ధిదారులకు ఇప్పుడు ఎదురవుతున్న ఆశాభంగమిది. ఇందిరమ్మ లబ్ధిదారులకిచ్చే రుణం పెంచామని గొప్పలు చెప్పుకొన్న కిరణ్ సర్కారు.. గుట్టుచప్పుడు కాకుండా ఆ మొత్తంలో రకరకాలుగా కోత పెట్టింది. మండపేట, తెలుగుదేశం హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి రూరల్‌లో రూ.30,000, అర్బన్‌లో రూ.40,000లుగా ఉన్న రుణాన్ని వైఎస్ ‘ఇందిరమ్మ’ పథకం ప్రవేశపెట్టి రూ.45,000, రూ.55,000లకు పెంచారు. పరిపాలన ఖర్చులు, లబ్ధిదారుల వాటా కింద అర్బన్‌లో రూ.3,300, రూరల్‌లో రూ.1,300 తగ్గించి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందించేవారు. కిరణ్ సర్కారు కూడా ఏడాది క్రితం వరకు ఇలాగే ఇస్తూ వచ్చింది. పెరిగిన గృహ నిర్మాణ సామగ్రి ధరలకు అనుగుణంగా రుణమొత్తం పెంచాలన్న డిమాండ్‌తో కొద్ది నెలల క్రితం అర్బన్‌లో ఓసీ, బీసీలకు రూ.80, 000లకు, ఎస్సీలకు రూ.1,00,000లకు, రూరల్‌లో ఓసీ, బీసీలకు రూ.70,000లకు, ఎస్సీలకు రూ.1,00,000లకు పెంచారు. రుణసాయం పెరిగిందన్న భరోసాతో ఇళ్ల నిర్మాణానికి నడుం బిగించి లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. పరిపాలన ఖర్చులు, లబ్ధిదారుల వాటా అంటూ ఓసీ, బీసీలకు అర్బన్ ప్రాంతాల్లో రూ.7,500, ఎస్సీలకు రూ.8,100, రూరల్‌లో అన్ని వర్గాల వారికీ రూ.4,200 చొప్పున కోత విధిస్తున్నారు. అంతేకాక ప్లాస్టింగ్ తర్వాత ఇస్తామంటూ మరో రూ.5,000 తగ్గించేస్తున్నారు. అంటే ఓసీ, బీసీలకు అర్బన్‌లో రూ.67,500, రూరల్‌లో రూ.60,800, ఎస్సీలకు అర్బన్‌లో రూ.86,900, రూరల్‌లో రూ.90,800 మాత్రమే అందుతున్నాయి. రుణసాయాన్ని పెంచినట్టే పెంచి ప్రభుత్వం కోత విధిస్తోందని, ప్లాస్టింగ్ తర్వాత ఇస్తామంటున్న రూ.5 వేలు అసలే అందడం లేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఈ పథకం కింద మూడు విడతల్లో జిల్లాకు సుమారు 2,46,560 ఇళ్లు మంజూరవగా ఇప్పటి వరకు కేవలం 92,743 పూర్తయ్యాయి. 24,936 ఇళ్ల నిర్మాణ ం ఇంకా ప్రారంభమే కాలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. శ్లాబ్ దశలో కేవలం రూ.3,300లే.. బిల్లుల విడుదలలోనూ ప్రభుత్వం తీరు విమర్శలకు తావిస్తోంది. వైఎస్ హయాంలో ఇళ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నా పెంచిన సాయం పూర్తిగా లబ్ధిదారునికి చేరేది. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం పునాది, లింటల్ దశలకు మాత్రమే పెంచిన సాయాన్ని విడుదల చేస్తున్నారు. శ్లాబ్‌కు మాత్రం గతంలో మాదిరిగానే రూ.10,800 ఇస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో మొదటి రెండు దశలు పూర్తిచేసుకుని శ్లాబ్ దశలో ఉంటే పెంచిన సాయం వారికి అందని దుస్థితి నెలకొంటోంది. అర్బన్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. శ్లాబ్ దశలో ఉన్న లబ్ధిదారులకు పెంచిన సాయం అందకపోగా శ్లాబ్ పూర్తయ్యాక చెల్లించే బిల్లులో పరిపాలన ఖర్చుల కింద రూ.7,500 కోత విధిస్తుండటంతో ఆ దశలో వచ్చే రూ. 10,800లకుగాను కేవలం రూ.3,300లు మాత్రమే అందుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయాన్ని పెంచి, సకాలంలో ఇవ్వాలి.. గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ప్రభుత్వ సాయం చాలక ఇందిరమ్మ లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుతం టన్ను ఐరన్ రూ.44,000, సిమెంట్ కంపెనీలను బట్టి బస్తా రూ.250 నుంచి రూ.270, కంకర రెండు యూనిట్ల లారీ రూ.72,00, రెండు యూనిట్ల -
నాణ్యతలో అగ్రగామి భారతి సిమెంట్
మహబూబ్‌నగర్(భగీరథకాలనీ) న్యూస్‌లైన్: ప్రపంచంలోనే సిమెంట్ కంపెనీలలో కెళ్లా అగ్రగామి సిమెంట్గా భారతి సిమెంట్ నిలిచిందని సంస్థ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ ఎంసి మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని త్రిస్టార్ సింధూ హోటల్లో జిల్లాలకు చెందిన సివిల్ ఇంజనీర్లతో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. అతితక్కువ కాలంలోనే ప్రజల ఆదరణ పొందుతూ ఈ కంపెనీ మంచి గుర్తింపు పొందిందని తెలిపారు. భారతదేశంతోపాటు విదేశాలలో కూడా మంచి గుర్తింపు లభించిందని వెల్లడించారు. ఈ కంపెనీని ప్రారంభించిన నాలుగేళ్లలోనే అంచలంచెలుగా ఎదుగుతూ వస్తోందన్నారు. ఈ సిమెంట్‌ను నాణ్యతతో తయారు చేస్తున్నామని దీంతో భవనాలు, కాంక్రిట్ నిర్మాణాలు అత్యధిక కాలం పాటు మన్నిక పొందగలుగుతాయని తెలిపారు. దేశంలోని చాలా ల్యాబ్ టెస్టింగ్ సెంటర్లు ఈ సిమెంట్ నాణ్యతకు కితాబు ఇచ్చాయని ఆయన తెలిపారు. అత్యాధునిక జర్మన్ టెక్నాలజీతో సిమెంటును తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతీ బస్తాలోని సిమెంటు నాణ్యతను పరిశీలించేందుకు రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. సిమెంటు బస్తాలు బయటి మార్కెట్లో ఎలాంటి కల్తీకి లోనవకుండా ఇప్పటివరకు ఏ కంపెనీ ప్రవేశపెట్టని టాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్ చేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. తమ సిమెంట్ నాణ్యతకు మరో పేరని పాలమూరు ప్రజలు ఇప్పటిలాగే ఇంకా ఆదరణ చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మొబైల్ వాహనాలతో అవగాహన కార్యక్రమాలు కాంక్రీట్ నిర్మాణాలలో అవలంభించాల్సిన పద్దతులపై గ్రామాల్లోని, పట్టణాలోని భవన నిర్మాణ కార్మికులకు భారతి సిమెంట్ సంచార వాహనాలతో వెళ్ళి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గోన్న మేస్త్రిలకు రూ.లక్ష విలువ గల ఉచిత బీమాను చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజిఎం కొండల్‌రెడ్డి, టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి,సతీష్ రాజు,నరేష్.ఇంజనీర్లుశ్రీనివాస రెడ్డి,ఈశ్వరయ్య,రమేష్‌లు పాల్గోన్నారు.