
లఫార్జ్ భారత చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉజ్వల్ భర్తియ
ముంబై : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సిమెంట్ కంపెనీ లఫార్జ్ భారత కార్యకలాపాల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉజ్వల్ భర్తియ నియమితులయ్యారు. ఇదివరకు కంపెనీ భారత కార్యకలాపాలను మార్టిన్ రిగ్నర్ పర్యవేక్షించేవారు. ఉజ్వల్ భర్తియ గత 16 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన గతంలో లఫార్జ్ భారత మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరించారు.