త్రిసూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజు రద్దు | Trishul Cement Company Lease Cancelled By AP Government | Sakshi
Sakshi News home page

త్రిసూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజు రద్దు

Jan 31 2020 6:47 PM | Updated on Jan 31 2020 7:46 PM

Trishul Cement Company Lease Cancelled By AP Government - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని యాడికిలో మెస్సర్స్‌ త్రిసూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెకార్ట సున్నపురాతి గనుల లీజు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సిమెంట్‌ తయారీ ప్లాంట్‌ నిర్మాణానికి.. మరో ఐదేళ్ల పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడనందునే లీజు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్‌ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement