ultratech cement
-
లిస్టెడ్ కంపెనీగానే ఇండియా సిమెంట్స్
న్యూఢిల్లీ: దక్షిణాదిన కార్యకలాపాలు విస్తరించిన ఇండియా సిమెంట్స్(ఐసీఎల్) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతుందని అ్రల్టాటెక్ సిమెంట్ తాజాగా పేర్కొంది. ఐసీఎల్‌ను డీలిస్ట్ చేసే యోచనలేదని ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ దిగ్గజం తెలియజేసింది. వారాంతాన ఐసీఎల్ ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించిన నేపథ్యంలో లిస్టింగ్ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. డీల్ విలువ రూ.3,954 కోట్లుకాగా.. ఇప్పటికే ఐసీఎల్‌లో 23 శాతం వాటా కలిగిన అల్ట్రాటెక్ దీంతో నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. షేరుకి రూ.390 ధరలో 8.05 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు అల్ట్రాటెక్ రూ.3,142 కోట్లకుపైగా వెచ్చించనుంది. అయితే ఐపీఎల్ క్రికెట్ టీమ్.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) యాజమాన్యంలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఐసీఎల్ ప్రమోటర్ ఎన్.శ్రీనివాసన్, కుటుంబ సభ్యులు ప్రమోటర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. అల్ట్రాటెక్ తరఫున ఓపెన్ ఆఫర్‌ను చేపట్టిన యాక్సిస్ క్యాపిటల్.. ఐసీఎల్‌ను డీలిస్ట్ చేసే యోచనలేదన్న విషయాన్ని స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. పూర్తిస్థాయిలో ఓపెన్ ఆఫర్ విజయవంతమైతే ఐసీఎల్‌లో అ్రల్టాటెక్ వాటా 81.49 శాతానికి చేరే వీలుంది! బీఎస్ఈలో ఐసీఎల్ షేరు 0.7 శాతం నీరసించి రూ. 372 వద్ద ముగిసింది. ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే ఇది 4.6 శాతం డిస్కౌంట్. -
అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ చేతికి తాజాగా ఇండియా సిమెంట్స్ లిమిటెడ్(ఐసీఎల్)లో 32.72 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. సంస్థ ప్రమోటర్ల నుంచి రూ. 3,954 కోట్లకు ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ దిగ్గజం వాటాను సొంతం చేసుకోనుంది. అంతేకాకుండా పబ్లిక్ వాటాదారుల వద్ద నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. తద్వారా తీవ్ర పోటీతోపాటు.. వేగవంత వృద్ధిలోనున్న దక్షిణాది(ప్ర«దానంగా తమిళనాడు) మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించేందుకు అ్రల్టాటెక్‌కు వీలు చిక్కనుంది. కాగా.. దేశీ సిమెంట్ రంగంలో మరింత పోటీకి తెరతీస్తూ హైదరాబాద్ కంపెనీ పెన్నా సిమెంట్‌ను రూ. 10,422 కోట్లకు అదానీ గ్రూప్ సొంతం చేసుకున్న నెల రోజుల తదుపరి అ్రల్టాటెక్ సైతం సిమెంట్ కంపెనీ కొనుగోలుకి తెరతీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది! షేరుకి రూ. 390 షేరుకి రూ. 390 చొప్పున ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్లు, సహచరుల వాటాను కొనుగోలు చేయనున్నట్లు అ్రల్టాటెక్ తాజాగా స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ప్రమోటర్లు ఎన్.శ్రీనివాసన్, చిత్ర, రూపా గురునాథ్, ఎస్కే అశోక్ బాలాజీ నుంచి 28.42 శాతం, శ్రీ శారదా లాజిస్టిక్స్ నుంచి 4.3 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఇందుకు బోర్డు ఆమోదించినట్లు వెల్లడించింది. తాజా డీల్‌తో ఐసీఎల్‌లో అల్ట్రాటెక్ వాటా 55 శాతానికి జంప్ చేయనుంది. దీంతో సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా షేరుకి రూ. 390 ధరలో 8.05 కోట్ల ఈక్విటీ షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలు చేయనుంది. వారాంతాన ఐసీఎల్ షేరు రూ. 374.6 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే ఓపెన్ ఆఫర్ ధర 4 శాతం అధికం. 26 శాతం వాటాకు అల్ట్రాటెక్ రూ. 3,142 కోట్లు వెచి్చంచవలసి ఉంటుంది. కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి తదుపరి ఐసీఎల్‌కు అల్ట్రాటెక్ ప్రమోటర్‌గా అవతరించనుంది. తొలుత ఇన్వెస్టర్‌గా.. మొత్తం 14.45 ఎంటీపీఏ సామర్థ్యంగల ఐసీఎల్‌లో ఈ ఏడాది జూన్‌లో అ్రల్టాటెక్ ఇన్వెస్టర్‌గా రెండు బ్లాక్ డీల్స్ ద్వారా 23 శాతం వాటాను చేజిక్కించుకుంది. డీమార్ట్ ప్రమోటర్లు దమానీ కుంటుంబం నుంచి ఈ వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డీల్ విలువ రూ. 1,900 కోట్లుగా అంచనా. తాజా కొనుగోలుతో దక్షిణాది మార్కెట్లలోనూ కార్యకలాపాలు విస్తరించగలమని ఏబీ గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు.అదానీ పోటీ అంబుజాను సొంతం చేసుకోవడం ద్వారా 2022 సెపె్టంబర్లో సిమెంట్ పరిశ్రమలోకి అడుగు పెట్టిన డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ సైతం దేశీయంగా దిగ్గజాలతో పోటీపడుతోంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ నుంచి 6.4 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 51,000 కోట్లు) అంబుజా సిమెంట్‌ను కొనుగోలు చేసింది. తద్వారా ఏసీసీలోనూ మెజారిటీ వాటాను పొందింది. అంతేకాకుండా 2023లో మైహోమ్ ఇండస్ట్రీస్, సంఘీ ఇండస్ట్రీస్‌లను చేజిక్కించుకుంది. వెరసి 2028కల్లా 140 ఎంటీపీఏపై దృష్టిపెట్టి ముందుకు కదులుతోంది. ఇందుకు ప్రస్తుత యూనిట్ల విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితర ప్రణాళికలను అమలు చేస్తోంది. పెన్నా కొనుగోలుతో అదానీ గ్రూప్ సిమెంట్ తయారీ సామర్థ్యం 14 ఎంటీపీఏ పెరిగి 93 ఎంటీపీఏకు చేరిన సంగతి తెలిసిందే. 155 ఎంటీపీఏ(కన్సాలిడేటెడ్) సామర్థ్యంతో దేశీ సిమెంట్ రంగంలో నంబర్ వన్‌గా నిలుస్తున్న ఆదిత్య బిర్లా గ్రూప్ తదుపరి రెండో ర్యాంకులో అదానీ గ్రూప్ నిలుస్తోంది. -
సిమెంట్ కర్మాగారం ముట్టడి
బూదవాడ (జగ్గయ్యపేట) : ఎన్టీఆర్ జిల్లా బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం జరిగిన బాయిలర్ పేలుడు ప్రమాద ఘటనలో గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ మృతితో పాటు మరికొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా యాజమాన్యం కనీసం స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో స్పందించారు. రెండోరోజైన సోమవారం గ్రామస్తులు.. బాధితుల కుటుంబ సభ్యులు మెయిన్ గేట్‌వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.అక్కడ పోలీసులు నిలువరించినప్పటికీ ట్రాక్టర్లతో మెయిన్ గేట్‌ను ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లారు. అడ్మినిస్ట్రేషన్ భవనం వైపునకు వెళ్లి కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లతో సామగ్రిని ధ్వంసంచేసి కంప్యూటర్లను పగలగొట్టారు. కార్యాలయంలోని విలువైన రికార్డులను చించేశారు. దీంతో పోలీసులు వారిని కట్టడి చేసేందుకు లాఠీచార్జి చేయడంతో వారంతా శాంతించారు. ఈ సందర్భంగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కలెక్టర్ చర్చలు.. గ్రామస్తులు కర్మాగారాన్ని ముట్టడించడంతో సమాచారం అందుకున్న కలెక్టర్ సృజన తెలంగాణ గేటులో నుంచి లోపలికి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న గ్రామస్తులు, ఆదివారం రాత్రి మృతిచెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులతో ఆమె చర్చలు జరిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని మూడు నెలలుగా బాయిలర్ మరమ్మతులు చేపట్టాలని చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు.అలాగే, ప్రమాదం జరిగి రెండు గంటలైనా యాజమాన్యం స్పందించకపోవడంతో తామే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించామని తెలిపారు. వైద్య శిబిరం కూడా ఏర్పాటుచేయటంలేదని సీఎస్ఆర్ ఫండ్‌తో గ్రామాన్ని అభివృద్ధిచేయాలని.. మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని.. క్షతగాత్రులకు రూ.25 లక్షల ఆరి్థక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ.. ఈ ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.మృతుని కుటుంబానికి కంపెనీ యాజమాన్యం రూ.50 లక్షలు నష్టపరిహారం అందిస్తుందని.. చికిత్స పొందుతున్న వారికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.ఐదు లక్షలు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. మృతుని కుటుంబంలోని ఒకరిని కంపెనీలో ఉద్యోగంతో పాటు పిల్లలను కంపెనీ పాఠశాలలో చదివించనున్నట్లు చెప్పారు. అనంతరం.. యాజమాన్యం నుంచి ప్లాంట్ హెడ్ సతీష్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ చేతుల మీదుగా కలెక్టర్ రూ.50 లక్షల చెక్కును మృతుని భార్య త్రివేణికి అందించారు. ఈ కార్యక్రమంలో జేసీ సంపత్‌కుమార్, ఆర్డీఓ రవీంద్ర, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాస్, పరిశ్రమల శాఖ జీఎం సుధాకర్, జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి రాఘవేంద్ర నాయక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఆందోళనకరంగానే క్షతగాత్రుల పరిస్థితి.. ఇదిలా ఉంటే.. పేలుడు ధాటికి గాయపడిన దారావత్ శివనారాయణ, గుగులోతు గోపినాయక్, పరిటాల అర్జున్, బాణావత్ స్వామిల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 90 శాతం శరీరం కాలిపోవటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
అల్ట్రా టెక్ సిమెంట్ ఘటన.. రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం
-
ఇండియా సిమెంట్స్‌లో అల్ట్రాటెక్ పాగా!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ సిమెంట్ తాజాగా చెన్నైకు చెందిన ఇండియా సిమెంట్స్‌లో భారీ వాటాను దక్కించుకుంది. ఇండియా సిమెంట్స్‌లో దమానీలకు ఉన్న 23 శాతం వాటాను సొంతం చేసుకుంది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం ఇందుకు రూ. 1,889 కోట్లు వెచి్చంచింది. తద్వారా ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్ల తదుపరి రెండో పెద్ద వాటాదారుగా అవతరించింది. రెండు బ్లాక్ డీల్స్ ద్వారా షేరుకి రూ. 265–283 ధరల శ్రేణిలో మొత్తం 7,05,64,656 షేర్లను కొనుగోలు చేసింది. ఇది 22.77 శాతం వాటాకు సమానం కాగా.. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్లు 28.42 శాతం వాటాను కలిగి ఉన్నారు. వాటాను విక్రయించినవారిలో దమానీలు.. గోపీకిషన్ శివకిషన్, కిరణ్ దేవి, రాధాకిషన్ శివకిషన్, శ్రీకాంత దేవి ఉన్నారు. ఆర్కే దమానీకి చెందిన డిరైవ్ ఇన్వెస్ట్మెంట్స్, డిరైవ్ ట్రేడింగ్ అండ్ రిసార్ట్స్ సైతం షేర్లను విక్రయించాయి. గురువారం సమావేశమైన బోర్డు ఇండియా సిమెంట్స్‌లో దాదాపు 7.06 కోట్ల షేర్ల కొనుగోలుకి గ్రీన్ సిగ్నల్ ఇచి్చనట్లు అ్రల్టాటెక్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ఇండియా సిమెంట్స్‌లో 23% నియంత్రేతర వాటా కొనుగోలుని ఫైనాన్షియల్ పెట్టుబడిగా అ్రల్టాటెక్ పేర్కొంది. ఇండియా సిమెంట్స్ తీరిదీ... 2024 మార్చి31 కల్లా ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్ల వాటా 28.42 శాతంగా నమోదైంది. కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్. శ్రీనివాసన్ 0.36 శాతం వాటాను కలిగి ఉన్నారు. ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఈడబ్ల్యూఎస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు 21.56 శాతం వాటా ఉంది. కంపెనీ మొత్తం 16 ఎంటీపీఏ సిమెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో అనుబంధ కంపెనీ త్రినేత్ర సిమెంట్‌కుగల 1.5 ఎంటీపీఏ సామర్థ్యం కలసి ఉంది.గతేడాది (2023–24) ఇండియా సిమెంట్స్ రూ. 5,112 కోట్ల ఆదాయం, రూ. 227 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2022–23)లో నమోదైన రూ. 127 కోట్లతో పోలిస్తే నష్టం పెరిగింది. 2023 సెపె్టంబర్లో ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాలోని కంటకాపల్లె, చిన్నిపాలెంలోగల 73.75 ఎకరాల భూమిని విక్రయించింది. వీటిని రూ. 70 కోట్లకు అ్రల్టాటెక్ సొంతం చేసుకుంది. 2022 అక్టోబర్‌లో స్ప్రింగ్‌వే మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు రూ. 477 కోట్లకు విక్రయించింది. అల్ట్రాటెక్ స్పీడ్.. అ్రల్టాటెక్ సిమెంట్ స్థాపిత సామర్థ్యం వార్షికంగా 152.7 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ)కాగా.. విస్తరణ బాటలో సాగుతోంది. మహారాష్ట్రలోని ఇండియా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్‌ను రూ. 315 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఏప్రిల్ 20న ప్రకటించింది. వైట్ సిమెంట్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ తయారీ కోసం యూఏఈ సంస్థ రాక్ సిమెంట్‌లో 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఈ వారం మొదట్లో ఆఫర్ ధరను సవరించింది. విస్తరణ నేపథ్యంలో గ్రే సిమెంట్ సామర్థ్యం 198.2 ఎంటీపీఏను తాకనుంది.ఈ వార్తలతో అ్రల్టాటెక్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 11,715కు చేరగా.. ఇండియా సిమెంట్స్ 11%పైగా దూసుకెళ్లి రూ. 293 వద్ద స్థిరపడింది. -
ఈ పెద్దాయన స్టాక్ మార్కెట్‌ని ఏలుతున్నారు?, కోట్లు వెనకేసి
చూశారా!! ఈ పెద్దాయనని. ఈయన ఎవరు? ఏం చేస్తుంటారో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారా? అయితే, మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఆయన గురించి తెలుసుకుందాం పదండి. స్టాక్ మార్కెట్‌తో డబ్బులు సంపాదించడం ఎలా? అని ఎవరినైనా అడిగితే అమ్మో స్టాక్ మార్కెటా? వద్దులే. ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తేనో లేదంటే తెలిసిన వాళ్లకి వడ్డీ ఇచ్చుకున్నా నాలుగు రాళ్లు వెనకేసువచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? అలా ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు? అంటూ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్న వారి గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుని, అనుభవజ్ఞులైన నిపుణులు సలహాలు తీసుకోవాలి. అలా తెలుసుకునే షేర్లలో పెట్టుబడులు పెట్టారు ఈ పెద్దాయన. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్, క్రమశిక్షణ, ఓపిక వహించారు. ఇప్పుడు ముదుసలి వయసులో భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఎలా అంటారా? క్రమశిక్షణ, సహనం ఈ రెండింటిలో ఆరితేరిన బిగ్ బుల్, దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్లు స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసి డివిడెండ్లు, బోనస్ షేర్లు, షేర్ల బైబ్యాక్, స్టాక్ స్ల్పిట్లతో లాభాల్ని గడిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ కూడా అంతే. సోషల్ మీడియా ఓవర్‌నైట్ స్టార్ గురించి పెద్దగా వివరాలు వెలుగులోకి రాలేదు. కానీ ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆస్తులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రాజీవ్ మెహతా అనే నెటిజన్ ఈ పెద్దాయన గురించి వీడియో చేశారు. ఆ వీడియోలో కోట్ల ఆస్తులు ఉన్నా సాధారణ జీవితం గడుపుతున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆయనకు ఏయే కంపెనీల్లో షేర్లు ఉన్నాయో వివరించారు. ఆ వివరాల ఆధారంగా సదరు పెద్దాయన నికర ఆస్తి విలువ రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎల్అండ్టీలో 27,855 షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌లో 2,475 షేర్లు, కర్ణాటక బ్యాంక్‌లో 4,000 షేర్లు తన వద్ద ఉన్నాయని తన మాతృ భాషలో పెద్దాయన చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. నివేదికల ప్రకారం..100 మిలియన్ (రూ.10 కోట్ల) కంటే ఎక్కువ విలువైన షేర్లు ఉన్నాయని తెలుస్తోంది. అదనంగా, ఆ వ్యక్తి తాను సంవత్సరానికి సుమారుగా రూ. 6 లక్షల డివిడెండ్లను సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. As they say, in Investing you have to be lucky once He is holding shares worth ₹80 crores L&T ₹21 crores worth of Ultrtech cement shares ₹1 crore worth of Karnataka bank shares. Still leading a simple life#Investing @connectgurmeet pic.twitter.com/AxP6OsM4Hq — Rajiv Mehta (@rajivmehta19) September 26, 2023 ఈ సందర్భంగా రాజీవ్ మెహతా మాట్లాడుతూ పెద్దాయన చెప్పినట్లుగా పెట్టుబడులు మీరు అదృష్టవంతులు కావాలని అన్నారు. అంతేకాదు ఎల్ అండ్ టీలో రూ.80 కోట్ల విలువైన షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌లో రూ. 21 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంక్‌లో రూ. కోటి విలువైన షేర్లు ఉన్నాయని మెహతా పోస్ట్ చేశాడు.ఇప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు అని’ మెహతా పేర్కొన్నారు. Bhai 27,000 L&T shares = 8 cr no? Similarly 3.2 cr. of Ultratech 10 lakh of Ktk bank It's a decent amount still. More power to him. But please consider blurring his face, such publicity usually doesn't do good esp for old people living a simple life. — Deepak Shenoy (@deepakshenoy) September 26, 2023 ఆ వీడియోపై క్యాపిటల్ మైండ్ సీఈఓ, ఫౌండర్ దీపక్ షెనాయ్ స్పందించారు. రాజీవ్ మెహతా చెప్పిన దానిని బట్టి.. ఎల్ అండ్ టీ కంపెనీలో 27 వేల షేర్ల విలువ రూ. 8 కోట్లు, అల్ట్రాటెక్ కంపెనీలో రూ. 3.2 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంకులో రూ. 10 లక్షల విలువైన షేర్లు.. ఇలా మొత్తంగా రూ. 12 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం, ఈ పెద్దాయన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది. -
అవాంతరాలు సర్వసాధారణంగా మారాయి
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణలో వివిధ రకాల అవాంతరాలు ప్రస్తుతం సర్వ సాధారణంగా మారాయని అల్ట్రాటెక్ సిమెంట్ చైర్మన్ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ వాటిని విజయవంతంగా అధిగమించగలిగేలా భారత్ కనిపిస్తోందని తెలిపారు. వార్షిక సర్వ సభ్య సమావేశంలో షేర్హోల్డర్లను ఉద్దేశించి వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో ఆయన ఈ అంశాలు ప్రస్తావించారు. ఈ ఏడాది వ్యయాలపరమైన ఒత్తిళ్లు, ఆర్థిక మార్కెట్లలో అస్థిరత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ వ్యాపారాలు మధ్యకాలికంగా చూస్తే వ్యాపారాలు రికవరీ బాటలోనే కొనసాగుతున్నాయని బిర్లా వివరించారు. ‘కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2020 అసాధారణమైన సంవత్సరంగా గడిచింది. సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో 2021 కూడా అలాగే గడిచిపోయింది. ఇక ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయంగా స్టాగ్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత పెరిగిపోయి.. డిమాండ్ స్తబ్దంగా ఉండటం) వంటి కారణాలతో 2022 కూడా అసాధారణంగానే కొనసాగుతోంది. చూడబోతే అవాంతరాలనేవి సర్వసాధారణంగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది‘ అని బిర్లా చెప్పారు. -
హోల్సిమ్ ఇండియా కొనుగోలు రేసులోకి బిర్లా
ముంబై/న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపు సైతం స్విస్ కంపెనీ హోల్సిమ్కు చెందిన అంబుజా సిమెంట్, ఏసీసీ ఆస్తుల కొనుగోలు రేసులోకి అడుగు పెట్టింది. బిర్లా అధికారికంగా బిడ్ వేసిందని, గ్రూపు కంపెనీ అల్ట్రాటెక్ ద్వారా కొనుగోలు చేయనున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. సీసీఐ అనుమతి పొందుతామన్న నమ్మకం తమకు ఉందని, కొన్ని కంపెనీల ఆస్తులను వేరు చేయడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశాయి. అల్ట్రాటెక్‌కు దేశ సిమెంట్ రంగంలో గణనీయమైన వాటా ఉండడం తెలిసిందే. పోటీ సంస్థలైన ఏసీసీ, అంబుజా సిమెంట్ ఆస్తులు కూడా అల్ట్రాటెక్ చేతికి వెళితే గుత్తాధిపత్యానికి దారితీస్తుందా? లేదా అన్నది సీసీఐ సమీక్షించే అవకాశం నేపథ్యంలో ఇలా తెలిపాయి. ఇప్పటికే జీఎస్డబ్ల్యూ గ్రూపు, అదానీ గ్రూపు సైతం హోల్సిమ్కు చెందిన అంబుజా సిమెంట్, ఏసీసీ ఆస్తుల పట్ల ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. స్టీల్ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ కూడా ఆసక్తిగా ఉందని, రేసులోకి చేరొచ్చని విశ్వసనీయ వర్గాలు తె లిపాయి. ] చదవండి: ఉక్రెయిన్ సంక్షోభం.. ఎగుమతుల్లో ఇండియా రికార్డ్! -
అల్ట్రాటెక్ లాభం 8 శాతం అప్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 8 శాతం ఎగసి రూ. 1,710 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,585 కోట్లు ఆర్జించింది. ఆదాయం 6% ఎగసి రూ. 12,985 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 12,262 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఈ కాలంలో వ్యయాలు 12% పెరిగి రూ. 11,422 కోట్లను తాకాయి. బిర్లా వైట్..: బిర్లా వైట్ బ్రాండు వైట్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, ఆధునీకరణకు రూ. 965 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. తద్వారా ప్రస్తుత 6.5 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యాన్ని దశలవారీగా 12.53 ఎల్టీపీఏకు చేర్చేందుకు తాజా సమావేశంలో బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. 1.2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం అందుకోవడంతో భారీ మౌలిక ప్రాజెక్టుల ద్వారా బల్క్ సిమెంట్ అమ్మకాలను మరింత పెంచుకోగలమని కంపెనీ అభిప్రాయపడింది. ఇక యూపీలో బారా గ్రైండింగ్ లైన్–2 యూనిట్ ప్రారంభంతో సిమెంట్ ఉత్పాదక సామ ర్థ్యం 114.55 ఎంటీపీఏను తాకినట్లు తెలిపింది. రుణ చెల్లింపులు..: 2021 అక్టోబర్‌లో అమ్మకాలు ఊపందుకున్నప్పటికీ ఎన్సీఆర్లో నిర్మాణాలపై నిషేధం, వర్షాలు, దీపావళి సెలవులు తదితర అంశాలు తదుపరి డిమాండును దెబ్బతీసినట్లు అల్ట్రాటెక్ వివరించింది. వెరసి క్యూ3లో కన్సాలిడేటెడ్ అమ్మకాలు 3 శాతం నీరసించి 23.13 మిలియన్ మెట్రిక్ టన్నులకు పరిమితమయ్యాయి. క్యూ3లో అంతర్గత వనరుల ద్వారా రూ. 3,459 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు బీఎస్ఈలో దాదాపు 3 శాతం ఎగసి రూ. 7,868 వద్ద ముగిసింది. -
అల్ట్రాటెక్ లాభం రూ.796 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపులో భాగమైన అల్ట్రాటెక్ సిమెంట్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.796 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.1281 కోట్లతో పోలిస్తే 38 శాతం తగ్గిపోయింది. అమ్మకాల ద్వారా ఆదాయం సైతం 33 శాతం క్షీణించి రూ.11420 కోట్ల నుంచి రూ.7634 కోట్లకు పరిమితమైంది. వడ్డీ, తరుగుదల, పన్ను ముందస్తు లాభం రూ.2353 కోట్లుగా నమోదైంది. అదే విధంగా కంపెనీ వ్యయాలు సైతం 32 శాతం తగ్గి రూ.6,598 కోట్లుగా ఉన్నాయి. అమ్మకాల పరిమాణం 22 శాతం తక్కువగా నమోదైనట్టు అల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. నిర్వహణపరమైన సామర్థ్యాలపై దృష్టి పెట్టడం ద్వారా కరోనా వైరస్ సంక్షోభ ప్రభావాన్ని ఎదుర్కొన్నట్టు పేర్కొంది. ‘‘జూన్ క్వార్టర్లో కార్యకలాపాలకు అవకాశం ఉన్న రోజులు 68. వ్యయాలు, నగదు ప్రవాహాలపై గట్టి నియంత్రణ కొనసాగించాము. దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న 64 ప్లాంట్లలో 60 శాతం సామర్థ్యాన్ని వినియోగించుకున్నాము. మే చివరి నుంచి ఆశ్చర్యం కలిగించే ధోరణులు కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ వినియోగం అంచనాల కంటే అధికంగా నెలకొంది’’ అని కంపెనీ తెలిపింది. స్థిర వ్యయాలను 21 శాతం తగ్గించుకోవడంతోపాటు మూలధన నిధులను మెరుగ్గా నిర్వహించడం ద్వారా రుణ భారాన్ని రూ.2209 కోట్ల మేర తగ్గించుకున్నట్టు ప్రకటించింది. కంపెనీ పనితీరు అంచనాలను అందుకోవడంతో అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్‌లో కొనుగోళ్లకు దారితీసింది. బీఎస్ఈలో 7 శాతానికి పైగా పెరిగి 4135.70 వద్ద క్లోజయింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ లాభం 80 శాతం అప్
ముంబై: బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక కాలంలో 80 శాతం మేర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.396 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.712 కోట్లకు పెరిగిందని అల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.10,294 కోట్ల నుంచి రూ.10,176 కోట్లకు తగ్గిందని పేర్కొంది. స్టాండ్అలోన్ పరంగా చూస్తే. నికర లాభం రూ.433 కోట్ల నుంచి రూ.643 కోట్లకు ఎగసిందని వివరించింది. వివాద పరిష్కార పథకం కోసం రూ.133 కోట్లు కేటాయించామని, దీనిని కూడా కలుపుకుంటే ఈ నికర లాభం మరింతగా పెరిగి ఉండేదని తెలిపింది. -
ఏపీలో అల్ట్రాటెక్ సిమెంట్ భారీ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ అల్ట్రాటెక్... ఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి సంస్థకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కర్నూలు జిల్లా పెట్నికోట వద్ద రానున్న ఈ ప్రాజెక్టుకై అల్ట్రాటెక్ సుమారు రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే కంపెనీ 431.92 హెక్టార్ల స్థలాన్ని ప్లాంటు కోసం కొనుగోలు చేసింది. ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగంగా 40 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్ యూనిట్, 60 లక్షల టన్నుల సామర్థ్యంతో సిమెంటు తయారీ కేంద్రాలు ఏర్పాటవుతాయి. అలాగే ప్లాంటు అవసరాల కోసం 60 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుతోపాటు తయారీ ప్రక్రియలో జనించే వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 15 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కూడా రానుంది. 900 మందికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి లభించనుందని సమాచారం. ప్రాజెక్టు ఏర్పాటు, నిర్వహణకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అల్ట్రాటెక్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విభిన్న రంగాల్లో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీయే అల్ట్రాటెక్ సిమెంట్. సామర్థ్యం పరంగా భారత్‌లో అతిపెద్ద సిమెంటు ఉత్పత్తిదారుగా నిలిచింది. అయిదు దేశాల్లో విస్తరించిన ఈ సంస్థకు ఏటా 6.8 కోట్ల టన్నుల సిమెంటు తయారీ సామర్థ్యం ఉంది. -
అల్ట్రాటెక్ సిమెంట్ లాభం రూ.1,014 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లాగ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో క్వార్టర్లో రూ.1,014 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో రూ.446 కోట్ల నికర లాభం వచ్చిందని అల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,401 కోట్ల నుంచి రూ.11,031 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.11.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మొత్తం వ్యయాలు రూ.9,554 కోట్లని తెలిపింది. ఇతర ఆదాయం 27 శాతం పెరిగి రూ.140 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం రూ.2,213 కోట్లుగా, ఎబిటా మార్జిన్ 21 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఫలితాలతో పోల్చడానికి లేదని కంపెనీ తెలిపింది. బినానీ సిమెంట్స్ కంపెనీని విలీనం చేసుకున్నామని, అందుకే ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.2,224 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,432 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.32,461 కోట్ల నుంచి రూ.37,817 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ షేర్ జోరుగా పెరిగింది. బీఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ 5.5 శాతం లాభంతో రూ. 4,435 వద్ద ముగిసింది. -
మెట్రోరైలుకు 4 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అతి ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు పరుగులు తీయడంపై ఆదిత్యా బిర్లా గ్రూపునకు దేశీయ సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ హర్షం వ్యక్తం చేసింది. మెట్రో సెక్టార్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్ షిప్ ప్రాజెక్టు అయిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణంలో ముఖ్యమైన భూమిక పోషించామంటూ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా నవంబర్ 29న ప్రారంభమైన ఈ మెట్రో రైలుకు సిమెంట్, కాంక్రీట్ సరఫరా చేయడంలో ముఖ్యమైన భాగస్వామిగా నిలిచామని సంస్థ ఒక మీడియా ప్రకటనలో తెలిపింది. నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా గ్రే సిమెంట్ సరఫరా చేశామని వెల్లడించింది. అలాగే భారతదేశంలో అనే ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులకు అల్ట్రాటెక సిమెంట్ విశ్వసనీయమైన బ్రాండ్ అని అల్ట్రాటెక్ పేర్కొంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, టి 12 టెర్మినల్ సహా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, మెట్రో ప్రాజెక్టులు తమ సిమెంట్ శక్తి, మన్నికతోనే విజయవంతంగా నిర్మించినట్టు తెలిపింది. అత్యున్నత నాణ్యత, విశ్వసనీయత, హరిత సాంకేతికకు, ఆవిష్కరణకు దీటుగా నిలిచిందని చెప్పింది. అందుకే ప్రతి విశిష్టమైన ఇంజనీరు, వినియోగదారుని ప్రథమ ఎంపిక అని అల్ట్రాటెక్ ప్రకటించింది . -
అల్ట్రాటెక్.. పూర్తి బిల్డింగ్ సొల్యూషన్స్!
అల్ట్రాటెక్ సిమెంట్ ఎండీ కె.కె.మహేశ్వరి ► స్థలం కొనడం నుంచి రంగులు వేసే వరకు సేవలు ► ఈ ఏడాది సిమెంట్ పరిశ్రమలో 6% వృద్ధి అంచనా ► ‘రెరా’ వల్ల నష్టం స్వల్ప కాలానికే పరిమితం ► డిమాండ్‌ను బట్టి ధరలు మారుతుంటాయి సాక్షి,అమరావతి : బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ మరింత దూకుడును పెంచింది. జేపీ సిమెంట్‌ను చేజిక్కించుకున్న ఊపుతో దక్షిణ భారతదేశ మార్కెట్లో వేగంగా చొచ్చుకుపోవడానికి ప్రణాళికలు రూపొందిం చుకుంటోంది. ఇందులో భాగంగా కేవలం సిమెంట్, కాంక్రీట్ విక్రయాలే కాకుండా సొంతింటి నిర్మాణానికి అన్ని సేవలను అందించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటలో ఉన్న జేపీ బాలాజీ సిమెంట్ పరి శ్రమ ఇప్పుడు అల్ట్రాటెక్ చేతిలోకి రావడంతో పాటు జేపీ సిమెంట్ డీలర్లను అల్ట్రాటెక్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వా నించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ విచ్చేసిన అల్ట్రాటెక్ సిమెంట్ ఎండీ కె.కె. మహేశ్వరితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు... జేపీ సిమెంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత అల్ట్రాటెక్ భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తారా? జేపీ సిమెంట్ కొనుగోలు చేసిన తర్వాత 93 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలో అగ్రగామి సంస్థగా ఎదగడమే కాకుండా ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద కంపెనీగా నిలిచాం. ఈ లావాదేవీ తర్వాత దేశీయ సిమెంట్ పరిశ్రమలో అల్ట్రాటెక్ వాటా 20 నుంచి 24 శాతానికి పెరిగింది. అత్యంత నాణ్యత గల ప్రీమియం బ్రాండ్‌గా కొనసాగించడంపైనే ప్రధానంగా దృష్టి సారించాం. సిమెంట్ కంపెనీల కొనుగోళ్లు, విస్తరణ అన్నది మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం మా ఉత్పత్తి సామర్థ్యంలో సగటు వినియోగం 70–75 శాతం వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ విస్తరణ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ మాకు అత్యంత కీలకమైన రాష్ట్రం. ఇప్పటికే తాడిపత్రిలో యూనిట్ ఉండగా, ఇప్పుడు జగ్గయ్యపేటలోని జేపీ బాలాజీ యూనిట్ కూడా మా చేతికి వచ్చింది. అదే విధంగా జేపీ డీలర్లు అందరూ అల్ట్రాటెక్ పరిధిలోకి వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతీ నెలా 8 లక్షల టన్నుల సిమెంట్ వినియోగం అవుతోంది. గ్లోబల్ మార్కెట్ లీడర్‌గా రాష్ట్రంలో కూడా అత్యధిక వాటాను కైవసం చేసుకోవడంపైనే ప్రధానంగా దృష్టిసారిస్తాం. జమ్మూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బెంగాల్ నుంచి గుజరాత్ వరకు దేశవ్యాప్తంగా అల్ట్రాటెక్ విస్తరించింది. మార్కెట్ లీడర్‌గా కొనసాగడానికి ఎటువంటి ప్రణాళికలను అమలు చేస్తున్నారు? కేవలం సిమెంట్, కాంక్రీట్ విక్రయంపైనే కాకుండా ఇంటి స్థలం కొనుగోలు చేయడం దగ్గర నుంచి ఇంటి నిర్మాణం పూర్తి చేయడం వరకు అన్ని సేవలను అందిస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా దక్షిణాదిలో వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకని స్థలం కొనుగోలు, ఇంటి ప్లానింగ్‌కు సంబంధించిన వాస్తు సేవలను అందిస్తున్నాం. అలాగే మేస్త్రీలను ఎంపిక చేసుకోవడం, ఆర్కిటెక్ సేవలతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీలు, ఇటుకలు వంటి సామగ్రి కొనుగోలులో సహాయాన్ని అందిస్తున్నాం. ఇంటికి వేసే వైట్ సిమెంట్, రంగులు, పుట్టి కొనుగోళ్లకు సంబంధించిన సేవలను కూడా అందిస్తున్నాం. అంతేకాకుండా మేస్త్రీలు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్‌లకు మార్కెట్లో వస్తున్న కొత్త టెక్నాలజీపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే స్థలం కొనుగోలు దగ్గర నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ఫుల్ బిల్డింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ (రెరా) ప్రభావం సిమెంట్ అమ్మకాలపై ఏ విధంగా ఉంది? ఏదైనా కొత్త చట్టం వచ్చినప్పుడు భయం అన్నది సహజంగా ఉంటుంది. అలాగే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు అందరూ ఇదే విధంగా భయపడ్డారు. కానీ అవి ఎంత ప్రయోజనాన్ని అందించాయో మనం చూశాం. శస్త్ర చికిత్స చేస్తున్నప్పుడు నొప్పి రావడం సహజం. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే. చాలా మందితో చర్చించిన తర్వాతనే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్‌ను ప్రవేశపెట్టారు. ప్రారంభంలో కొన్ని సమస్యలున్నా.. త్వరలో అవి సర్దుకుంటాయి. వీటి వల్ల సిమెంట్ అమ్మకాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదు. ఈ ఏడాది అమ్మకాల్లో ఎటువంటి వృద్ధిని అంచనా వేస్తున్నారు? ధరలు పెరిగే అవకాశం ఉందా? ఈ ఆర్థిక సంవత్సరం దేశీయ సిమెంట్ పరిశ్రమలో 5–6 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. మార్కెట్ లీడర్‌గా అంతకంటే ఎక్కువ వృద్ధి నమోదు అవుతుందని నమ్మకం ఉంది. ఇక ధరల విషయానికి వస్తే పూర్తిగా మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ధరలు దిగివస్తున్నాయి. ఆ తర్వాత పెరిగే అవకాశం ఉంది. ధరలు తగ్గించకుండా సిమెంట్ కంపెనీలు సిండికేట్ అవుతున్నాయన్న వాదనలో నిజం లేదు. -
అల్ట్రాటెక్ సిమెంట్ లాభం 15శాతం జంప్
న్యూఢిల్లీ: ఆదిత్యా బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 15.14 శాతం పెరుగుదలతో రూ. 897.91 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ నికరలాభం రూ. 779.83 కోట్లు. కంపెనీ మొత్తం ఆదాయం 6.45 శాతం వృద్ధితో రూ. 7,603 కోట్ల నుంచి రూ. 8,094 కోట్లకు చేరింది. తాజా ఫలితాల్లో తాము ఇటీవల టేకోవర్ చేసిన జైప్రకాష్ అసోసియేట్స్, జేపీ సిమెంట్ కార్పొరేషన్లకు చెందిన సిమెంటు ప్లాంట్ల ఫలితాలు కూడా కలిసివున్నాయని కంపెనీ మంగళవారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. జేపీ గ్రూప్‌నకు ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ ప్రాంతాల్లో వున్న 2.13 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంగల సిమెంటు ప్లాంట్లను అల్ట్రాటెక్ కొనుగోలుచేసింది. తాజా టేకోవర్‌తో తమ మొత్తం వార్షిక ఉత్పాదక సామర్థ్యం 9.3 కోట్ల టన్నులకు చేరుతుందని కంపెనీ తెలిపింది. ముగిసిన త్రైమాసికంలో ఇంధన ధరల పెరుగుదల కారణంగా వ్యయాలు ఎగిసాయని అల్ట్రాటెక్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో అల్ట్రాటెక్ సిమెంటు షేరు ధర స్వల్ప తగ్గుదలతో రూ. 4,355 వద్ద క్లోజయ్యింది. -
అల్ట్రాటెక్–జేపీ డీల్ పూర్తి
♦ ఇది అతిపెద్ద ఎన్పీఏ పరిష్కారం ♦ ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ముంబై: జేపీ సిమెంట్స్‌ను అల్ట్రాటెక్ సిమెంటు టేకోవర్ చేయడంతో అతిపెద్ద మొండి బకాయి సమస్య పరిష్కారమయ్యిందని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. జైప్రకాష్ అసోసియేట్స్ గ్రూప్‌నకు (జేపీ గ్రూప్) ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం భారీగా రుణాలివ్వడం, ఆ రుణాల్లో అధికభాగం ఎన్పీఏలుగా మారడం తెలిసిందే. తాజా డీల్ చరిత్రాత్మకమైనదని, భవిష్యత్తులో ఇటువంటి పరిష్కారాలకు ఇది బాట వేస్తుందని, దేశంలో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద రుణ పరిష్కారమని ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ వ్యాఖ్యానించారు. జేపీ అసోసియేట్స్‌కు, జేపీ సిమెంట్స్‌కు చెందిన సిమెంటు వ్యాపారాన్ని బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్‌కు విక్రయించే ప్రక్రియ పూర్తయినట్లు బ్యాంక్ తెలిపింది. అయితే ఈ డీల్ కారణంగా రుణదాతలైన బ్యాంకులకు ఎంత ఒనగూడుతుందో బ్యాంకు వెల్లడించలేదు. మార్కెట్ అంచనాల ప్రకారం రూ. 4,000 కోట్లు బ్యాంకులకు రావొచ్చు. ఈ విక్రయ ప్రక్రియలో కన్సార్షియం లీడ్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ కీలకపాత్ర వహించి, విజయవంతంగా పూర్తిచేసినట్లు కొచర్ వివరించారు. 9.1 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంగల జేపీ సిమెంటు వ్యాపారాన్ని బిర్లా గ్రూప్ రూ. 16,189 కోట్లకు టేకోవర్ చేసింది. తాజా విక్రయం తర్వాత కూడా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో 1.06 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంగల సిమెంటు వ్యాపారం ఇంకా జేపీ గ్రూప్‌వద్ద వుంటుంది. అల్ట్రాటెక్–జేపీ డీల్ పూర్తికాకపోవడంతో 2017 జనవరి–మార్చి క్వార్టర్లో ఆ రుణాలకు పలు బ్యాంకులు కేటాయింపులు చేయాల్సివచ్చింది. తాజాగా విక్రయ ప్రక్రియ పూర్తికావడంతో ఆ బ్యాంకులు ఖాతాల్లోంచి ఆ కేటాయింపుల్ని తొలగించుకునే వెసులుబాటు ఏర్పడింది. -
దేశీయ సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్ ఇదే!
-
దేశీయ సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్ ఇదే!
ముంబై: దేశీయ సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్ మరోనెలలో పూర్తికాబోతుంది. జైప్రకాశ్ అసోసియేట్స్ సిమెంట్ డివిజన్ ను కొనుగోలుచేస్తున్న ఆల్ట్రాటెక్ సిమెంట్ ఈ ప్రక్రియను జూలై చివరి వరకు ముగించనున్నట్టు రిపోర్టులు వచ్చాయి. జూలై చివరి వరకు ఈ డీల్ పూర్తికానున్నట్టు తెలియగానే, జేపీ అసోసియేట్స్ నేటి మార్కెట్లో ఒక్కసారిగా పైకి దూసుకెళ్లింది. నేటి(మంగళవారం) ఇంట్రాడేలో స్టాక్ 15 శాతం పైగా పైకి ఎగిసింది. ఇప్పటికే ఈ డీల్ కు సంబంధించి ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ల్లో ఆమోదం లభించింది. ఇంకా మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఆమోదం లభించాల్సి ఉందని రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ డీల్ మొత్తం విలువ రూ.16,189కోట్లు. జేపీ అసోసియేట్స్ కు చెందిన 12 సిమెంట్ ప్లాంట్లను కొనుగోలుచేయడానికి ఆల్ట్రాటెక్ ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ ప్లాంట్ల కొనుగోలుతో 94.5 మిలియన్ టన్నుల కెపాసిటీతో ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో సిమెంట్ కంపెనీగా(చైనా మినహా) అవతరించనున్నది. కాగ గతేడాదే ఆల్ట్రాటెక్ సిమెంట్స్ కు, జేపీ అసోసియేట్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది. -
లక్ష్యసాధనకు సత్ప్రవర్తన అవసరం
రాజాం: సత్ప్రవర్తనతో మెలిగినప్పుడే జీవితాశయాలు నెర వేరుతాయని విజయవాడకు చెందిన ఆల్ట్రాటెక్ సిమెంట్ జనర ల్ మేనేజర్ కె.వెంకటరామన్ అన్నారు. శుక్రవారం రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలలో అచీవర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయడానికి జీఎంఆర్ ఐటీ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. తిరుమల ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్(రాజమండ్రి) డైరెక్టర్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థులకు కఠోరదీక్ష, నిరంతర ప్రయత్నాలు ఎంతో అవసరమన్నారు. అనంతరం దేశంలోని ప్రముఖ కళాశాలలు, యూనివర్సిటీలలో పేపర్ ప్రెజెంటేషన్, ప్రోజెక్టు డిజైన్ పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందిన 110 మంది విద్యార్థులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.రాజామురుగుదాస్, జీఎంఆర్ ఐటీ గవర్నింగ్ కౌన్సిలర్ మెంబర్ డాక్టర్ పీఆర్ దహియా, కన్వీనర్ డాక్టర్ జి.శశికుమార్, డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అల్ట్రాటెక్ నికరలాభం 25% అప్
తగ్గిన ఆదాయం.. రూ.6,509 కోట్లకు న్యూఢిల్లీ: అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 25 శాతం పెరిగింది. వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల ఈ స్థాయి వృద్ధి సాధించామని ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.491 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రె ైమాసిక కాలంలో రూ.614 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,669 కోట్ల నుంచి రూ.6,509 కోట్లకు తగ్గిందని వివరించింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్దిపై దృష్టి సారించడం, వర్షాలు బాగా కురియడం, స్మార్ట్ సిటీల అభివృద్ధి తదితర అంశాల కారణంగా టైర్ 1, టైర్ 2 నగరాల్లో గృహ నిర్మాణ రంగానికి డిమాండ్ బాగా ఉండగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నామని కంపెనీ పేర్కొంది. జేపీ గ్రూప్‌కు చెందిన సిమెంట్ ప్లాంట్ల కొనుగోళ్లకు కాంపిటీషన్ కమీషన్(సీసీఐ) ఆమోదం పొందామని తెలిపింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ ఫలితాలు భేష్!
ముంబై: ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ ఎనలిస్టుల అంచనాలకు మించి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. ముంబై ఆధారిత సిమెంట్ తయారీ సంస్థ 31 శాతం నికర లాభాలను నివేదించింది. (స్వతంత్ర ఆధారంగా) నికర లాభం 601.05 కోట్లను, అమ్మకాలపై . 6,134.63 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు వెల్లడించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో సమయంలోనికర లాభం రూ457.41లుగా నమోదు చేసింది. ఈబీఐటీడీఏ లేదా ఆపరేటింగ్ లాభం రూ. 17.6 శాతం పెరిగి రూ.1,155 కోట్లుగా నమోదు చేసింది. గత సంవత్సరం అదే త్రైమాసికంలో సమయంలో 982 కోట్లను ఆర్జించింది. ఇతర ఆదాయం 29 శాతం పెరిగి రూ. 172.5 కోట్లుగా నమోదైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 2 శాతం క్షీణించి రూ. 6196 కోట్లకు పరిమితమైంది. మార్జిన్లు 3 శాతంపైగా పెరిగి 18.6 శాతాన్ని తాకాయి. అటు అల్ట్రాటెక్ సిమెంట్ రూ. 547 కోట్లను రూ నికర లాభాల రిపోర్టు చేయనుందనిఎనలిస్టులు అంచనావేశారు. కాగా మౌలిక ఖర్చులు, మంచి వర్షాకాలం, టైర్-1, టైర్-11 నగరాల్లో గృహ డిమాండ్ అభివృద్ధి దారితీసిందని పేర్కొంది. మంచి వర్షపాత అంచనాలు, ప్రభుత్వ స్మార్ట్ నగరాల నిర్మాణం ఆలోచన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా తమకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందనుందని కంపెనీ తెలిపింది. ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్ గత మూడు నెలల్లో 14 శాతం లాభపడింది -
సిమెంట్ కంపెనీలకు సీసీఐ
రూ. 6,715 కోట్ల జరిమానా న్యూఢిల్లీ: కూటమి కట్టి, ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా సిమెంట్ ధరలను తమ ఇష్టాను సారం నడిపించినందుకు 11 సిమెంట్ కంపెనీలకు, సిమెంటు తయారీదారుల సంఘాని(సీఎంఏ)కి రూ.6,715 కోట్ల మేర భారీ జరిమానా విధిస్తూ అనైతిక వ్యాపార విధానాల నిరోధక సంస్థ (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు సైతం ఉన్నాయి. అన్ని సిమెంట్ కంపెనీలు కుమ్మక్కు కాకుండా, ధరలు, ఉత్పత్తి, సరఫరాను నియంత్రించే చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కాంపిటీషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సూచనల మేరకు సీసీఐ బుధవారం ఈ ఆదేశాలు వెలువరించింది. కంపెనీలు, సీఎంఏ అనుసరించిన వ్యవహార శైలి వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతకరమని సీసీఐ పేర్కొంది. నిర్మాణ, మౌలిక వసతుల రంగాలకు కీలకమైన సిమెంట్ విషయంలో ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థకు కూడా చేటు అని వ్యాఖ్యానించింది. ‘సిమెంటు కంపెనీలు సీఎంఏ ప్లాట్ ఫామ్ ద్వారా ధరల వివరాలు, ఎంత మేర ఉత్పత్తి చేస్తుంది, సరఫరాల గురించి వివరాలను ఇచ్చిపుచ్చుకున్నారు. దాంతో ఉత్పత్తి, మార్కెట్లో సరఫరాలను నియంత్రించారు. సిమెంటు ధరలను నియంత్రించడం వ్యాపార పోటీ నిబంధనలకు విరుద్ధం’ అని సీసీఐ స్పష్టం చేసింది. ఏ కంపెనీపై ఎంత..?: ఏసీసీపై రూ.1,147.59 కోట్లు, జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (రూ.1,323.60 కోట్లు), అల్ట్రాటెక్ సిమెంట్ (రూ.1,175.49కోట్లు), సెంచురీ (రూ.274.02కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ.187.48కోట్లు), జేకే సిమెంట్స్ (రూ.128.54 కోట్లు), లఫార్జ్ (రూ.490 కోట్లు), రామ్‌కో రూ.258.63 కోట్లు), ఏసీఎల్ (రూ.1,163.91 కోట్లు), బినాని (రూ.167.32 కోట్లు), సీఎంఏపై రూ.0.73 కోట్ల జరిమానా భారం పడింది. అనుచిత వ్యాపార విధానాలను అనుసరించినందుకు రూ.397.51 కోట్ల జరిమానా చెల్లించాలని శ్రీ సిమెంట్‌ను సీసీఐ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ లాభం రూ.723 కోట్లు
♦ భారీగా పెరిగిన నికర అమ్మకాలు ♦ లాభంలో 10 శాతం వృద్ధి ♦ ఒక్కో షేరుకి రూ. 9.5 డివిడెండ్ న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.723 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) నాలుగో త్రైమాసిక కాలంలో సాధించిన నికర లాభం రూ.657 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి సాధించామని అల్ట్రాటెక్ సిమెంట్ పేర్కొంది. నికర అమ్మకాలు పెరగడంతో నికర లాభం 10 శాతం ఎగసిందని తెలియజేసింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.9.5 డివిడెండ్‌ను చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గిన వ్యయాలు 2014-15 క్యూ4లో రూ.6,517 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు 2015-16 క్యూ4లో రూ.6,850 కోట్లకు, మొత్తం వ్యయాలు రూ.5,519 కోట్ల నుంచి రూ.5,857 కోట్లకు చేరుకున్నాయి. దేశీయంగా సిమెంట్ అమ్మకాలు 15 శాతం పెరిగాయని, గ్రే సిమెంట్ అమ్మకాలు 11.51 మిలియన్ టన్నుల నుంచి 13.2 మిలియన్ టన్నులకు వృద్ధి చెందాయని కంపెనీ తెలియజేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో 43.38 మిలియన్ టన్నులుగా ఉన్న గ్రే సిమెంట్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 46.93 మిలియన్ టన్నులకు పెరిగాయి. ఇంధనం ధరలు తగ్గడం, పటిష్టమైన నిర్వహణ పనితీరు కారణంగా నిర్వహణ వ్యయాలు తగ్గాయని తెలిపింది. డిమాండ్ 7-8 శాతం మౌలిక సదుపాయాల అభివృద్ధి, హౌసింగ్, స్మార్ట్ సిటీలు, తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 7-8 శాతం పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఇది తమకు సానుకూలమైన అంశమని పేర్కొంది. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోగలమని, భారత దేశ తర్వాతి దశ వృద్ధిలో చురుకుగా పాలుపంచుకోగలమని ధీమా వ్యక్తం చేసింది. తమ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 66.3 మిలియన్ టన్నులకు పెరిగిందని, విస్తరణ కార్యక్రమాలన్నీ అనుకున్నవిధంగానే జరుగుతున్నాయని తెలిపింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసేందుకు ఆమోదం పొందామని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ ధర స్వల్పంగా పెరిగి రూ.3,278 వద్ద ముగిసింది. -
నాలుగో క్వార్టర్లో అల్ట్రాటెక్ అదుర్స్
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మాదిరిగానే భారత్ లో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా పేరున్న అల్ట్రాటెక్ మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి లాభాల్లో దూసుకెళ్లింది. నాలుగో త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 11శాతం జంప్ అయి రూ.681.4 కోట్లగా నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో రెవన్యూ కూడా 4.7 శాతం వృద్ధి చెంది, రూ.6,503.66 కోట్లగా ఫలితాలను చూపించాయి. గతేడాది ఈ త్రైమాసికంలో ఈ కంపెనీ రెవెన్యూ రూ.6,211 కోట్లగా ఉన్నాయి. దేశీయంగా ఈ కంపెనీ అమ్మకాల 15 శాతం వృద్ధిన్ని చూపించాయి. ఈ త్రైమాసికంలో బూడిద రంగు సిమెంట్ అమ్మకాలు 13.20 మిలియన్ టన్నులు ఉండగా, తెలుపు రంగు సిమెంట్ అమ్మకాలు 3.85 మిలియన్ టన్నులుగా ఉన్నాయని ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ తెలిపింది. నిర్వహణ లాభాలు(వడ్డీరేట్లు, తరుగుదలలు, రుణాలు పోగా మిగిలింది) 3.2 శాతం పెరిగి, 1,352.7 కోట్లగా నమోదయ్యాయి. నిర్వహణ ఖర్చు, ఇంధన ధరలు తగ్గుదల ఈ కంపెనీకి బాగా కలిసివచ్చింది. అల్ట్రాటెక్ ఫలితాలు వెల్లడయ్యాక ఈ కంపెనీ సేర్లు లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈ షేరు 6.75 పాయింట్లు లాభపడి 3277.60 వద్ద ముగిసింది.